Bhagavanth Kesari : 200 రోజులు పూర్తి చేసుకున్న బాలయ్య సినిమా… థియేటర్ పేరే చెప్తుంది ఆడించారని?

Bhagavanth Kesari : టాలీవుడ్ లో నట సింహం నందమూరి బాలకృష్ణ ది ప్రత్యేక స్థానం అని చెప్పాలి. పదేళ్ల పాటు ఒక్క హిట్టు కొట్టడానికి నానా యాతన పడ్డా చెక్కు చెదరని అభిమానంతో ఇండస్ట్రీ లో నిల్చున్నాడు. కొన్నేళ్లు వరుస ప్లాప్ ల అనంతరం “అఖండ” తో అఖండ విజయం సాధించి టాలీవుడ్ లో తన సత్తా చాటాడు. ఆ సినిమా తర్వాత వరుసగా వీర సింహ రెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాడు. ప్రస్తుతం కెరీర్ బెస్ట్ ఫామ్ లో ఉండగా బ్యాక్ టు బ్యాక్ వరుసగా హాట్రిక్ విజయాలను నమోదు చేసుకున్నాడు. అఖండ, వీర సింహా రెడ్డి మరియు భగవంత్ కేసరి (Bhagavanth Kesari) సినిమాలతో దుమ్ము లేపిన బాలయ్య హాట్రిక్ విజయాలను నమోదు చేయగా బ్యాక్ టు బ్యాక్ 70 కోట్ల షేర్ తో సంచలనం సృష్టించాడు. ఇక బాలయ్య నటించిన “భగవంత్ కేసరి” సినిమా లాస్ట్ ఇయర్ రిలీజ్ అయ్యి మంచి రిజల్ట్ ను సొంతం చేసుకుని, స్లో స్టార్ట్ తర్వాత లాంగ్ రన్ ని దక్కించుకుని బ్రేక్ ఈవెన్ ని అందుకుని 70 కోట్లకు పైగా షేర్ ని 132 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుని సూపర్ హిట్ గా నిలిచింది.

200 రోజుల భగవంత్ కేసరి..

ఇక ఆ తర్వాత డిజిటల్ లో కూడా కుమ్మేసిన సినిమా టెలివిజన్ లో కూడా మంచి రేటింగ్స్ తోనే రన్ అవుతూ ఉండగా, బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటికీ ఒక థియేటర్ లో రోజుకి 4 షోలతో రన్ అవుతూ వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఏకంగా 200 రోజులను పూర్తి చేసుకోవడం విశేషం అని చెప్పాలి. ఆంధ్ర ప్రదేశ్ లో చిలకలూరి పేట లో రామకృష్ణ థియేటర్ లో రోజుకి 4 ఆటలు ప్రదర్శితం అవుతూ ఇప్పుడు 200 రోజులను కంప్లీట్ చేసుకుని సంచలనం సృష్టించగా బ్యాక్ టు బ్యాక్ రెండు 200 రోజుల సినిమాలను ప్రజెంట్ టైంలో సొంతం చేసుకుని ఏ హీరోకి సాధ్యం కాని రికార్డు ను బాలయ్య సొంతం చేసుకోవడం విశేషం. అయితే ఇక్కడే అందరికి ఒక డౌట్ వస్తుంది. ఈ సినిమా ఆడిందా? ఆడించారా? అని. బాలయ్య గతంలో నటించిన లెజెండ్ సినిమాని మగధీర 1000 రోజుల రికార్డుని బ్రేక్ చేయాలనీ, జనాలు లేకపోయినా 10001 రోజులు ఆడించారు నందమూరి అభిమానులు. ఇక రీసెంట్ గా చిరు సినిమాకి పోటీగా వీర సింహారెడ్డి ని కూడా 200 రోజులు ఆడించారు. ఇప్పుడు భగవంత్ కేసరి ని కూడా అలాగే ఆడించారని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

థియేటర్ నందమూరి వారి అడ్డా..

ఇక ఇక బాలయ్య భగవంత్ కేసరి(Bhagavanth Kesari) చిలకలూరి పేట రామకృష్ణ థియేటర్ లో 200 రోజులు ఆడింది అంటున్నారు. కానీ వచ్చిన సమాచారం ప్రకారం 4 షోలతో ఆడినట్టు లెక్కలు లేవని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. పైగా ఓ సినిమా లో బాలయ్య రామకృష్ణా థియేటర్ సందుల్లో పెరిగాను అంటాడు. అలా నందమూరి ఫ్యాన్స్ కి అడ్డాగా రామకృష్ణ థియేటర్ మారిందని నెటిజన్లు అంటున్నారు. సినిమా ఇన్ని రోజులు ఆడినా, 4 షోలు అంటే నమ్మేట్టుగా లేదని కొందరి వాదన. ఎందుకంటే ఈ సినిమాలో అంత గ్రిప్పింగ్ ఉన్న కంటెంట్ లేదు. ఏది ఏమైనా బాలయ్య సినిమా 200 రోజులు ఆడినందుకు బాలయ్య అభిమానులైతే ఖుషి లో ఉన్నారు. ఇక బాలయ్య ఆ తర్వాత తన కొత్త సినిమాను వాల్తేరు వీరయ్యతో సంచలనం సృష్టించిన ‘బాబీ’ డైరెక్షన్ లో చేస్తూ ఉండగా, ఈ సినిమా ఈ ఇయర్ ఎండ్ టైంకి ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. మరి బాలయ్య ఈ సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రచ్చ చేస్తాడో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు