My Dear Donga : ఆహాలో సూపర్ రెస్పాన్స్ తో దూసుకుపోతున్న అభినవ్ గోమఠం సినిమా..!

My Dear Donga : టాలీవుడ్ లో ఈ జనరేషన్ కమెడియన్‌లలో వన్ అఫ్ ది బెస్ట్ యాక్టర్‌గా పేరు తెచ్చుకున్న నటుడు ‘అభినవ్ గోమటం’. “ఈ నగరానికి ఏమైంది” సినిమాతో సూపర్ క్రేజ్ ని సంపాదించిన అభినవ్, ఆ తర్వాత వరుస సినిమాల్లో మంచి పాత్రలతో టాప్ కామెడియన్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూనే, ఇక ఇప్పుడు లీడ్ రోల్స్ లో సినిమాలు చేసే స్టేజ్ కి ఎదిగాడు. ఇక రీసెంట్ గా తిరుపతి రావు దర్శకుడిగా అభినవ్ గోమఠం హీరోగా “మస్తు షేడ్స్ ఉన్నయ్ రా” సినిమా చేసిన సంగతి తెలిసిందే. గత నెలలో రిలీజ్ అయిన ఆ సినిమా అభినవ్ కి నటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టింది. కానీ ఆ సినిమా అంతగా విజయం సాధించలేదు. ఇక ఆ తరవాత ఓటిటి లో సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ లో ముగ్గురి హీరోలలో ఒకరిగా నటించగా, ఆ సిరీస్ తో కూడా మంచి పేరు సంపాదించాడు. ఇక రీసెంట్ గా మరో సినిమాలో హీరోగా నటించడం జరిగింది.

మై డియర్ దొంగ గా అభినవ్ గోమటం..

ఇక కమెడియన్ గా కొనసాగుతున్న అభినవ్ గోమఠం హీరోగా మరియు కేబుల్ రెడ్డి నటి షాలిని కొండేపూడి ప్రధాన జంటగా నటించిన లేటెస్ట్ వెబ్ ఫిల్మ్ “మై డియర్ దొంగ”. ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కాకుండా డైరెక్ట్ డిజిటల్ గా రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రముఖ తెలుగు ఓటిటి ప్లాట్ ఫారం అయిన ఆహా వీడియో లో సినిమా డైరెక్ట్ గా రిలీజ్ అయ్యింది. లాస్ట్ మంత్ ఏప్రిల్ 19న ఆహా ఓటిటి లో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా నుండి రిలీజైన ప్రచార చిత్రాలతో మంచి హైప్ ను సొంతం చేసుకున్న ఈ కామెడీ ఎంటర్టైనర్, ప్రస్తుతం 100 మిలియన్స్ స్ట్రీమింగ్ మినిట్స్ తో దూసుకు పోతుంది. BS సర్వజ్ఞ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మహేశ్వర్ రెడ్డి మరియు చంద్ర వెంపటి లు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో దివ్య శ్రీపాద, నిఖిల్ గాజుల మరియు సాయి శశాంక్ మండూరి కూడా కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి వస్తున్న రెస్పాన్స్ పట్ల మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

My Dear Donga movie got 100 million views on aha ott

- Advertisement -

వరుస సినిమాలతో అభినవ్ గోమటం బిజీ..

ఇక అభినవ్ గోమటం (My Dear Donga) ఓ వైపు కమెడియన్ గా కొనసాగుతూనే వరుస సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. అలాగే స్టార్ హీరోల సినిమాల్లో హీరో ఫ్రెండ్ గా లేదా మరో కీలక పాత్రలలో నటిస్తున్నాడు. ఆ మధ్య మస్త్షేడ్స్ ఉన్నాయ్ రా చిత్రంలో హీరోగా నటించగా, ఇప్పుడు మై డియర్ దొంగ లో కూడా హీరోగా అలరించాడు. ఇప్పటికే ప్రియదర్శి లాంటి కమెడియన్లు కూడా హీరోలుగా కొనసాగుతున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లో అభినవ్ కూడా చేరాడు. అయితే ఇప్పుడు హీరోగా చేస్తూనే కామెడీ పాత్రలు వేస్తాడా? లేదా కుదిరినపుడే హీరోగా సినిమాలు చేస్తాడా అనేది చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు