HBD Thalapathy Vijay : దళపతి విజయ్ ఇన్ని తెలుగు సినిమాలు రీమేక్ చేసాడని తెలుసా?

HBD Thalapathy Vijay : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కోలీవుడ్ లోనే కాదు సౌతిండియా వ్యాప్తంగా మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ హీరో మూడు దశాబ్దాలుగా తన సినిమాలతో అభిమానులని అలరిస్తూ ఉన్నాడు. ఇక లాస్ట్ ఇయర్ లియో సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన విజయ్ త్వరలోనే GOAT సినిమాతో ప్రేక్షకులని పలకరించడానికి రెడీ అవుతున్నాడు. ఇదిలా ఉండగా కెరీర్ ఆరంభంలో ద‌ళ‌ప‌తి విజ‌య్ రీమేక్ సినిమాల్లోనే ఎక్కువ‌గా న‌టించాడు. అయితే ఈ జెనరేషన్ వాళ్ళకి విజయ్ సినిమాలు తెలుగులో మన స్టార్ హీరోలు తీస్తున్నారు అనుకుంటారు, కానీ, విజయ్ కెరీర్ ఆరంభంలో చాలా తెలుగు సినిమాలు రీమేక్ చేసాడని తెలుసా? అసలు నిజం చెప్పాలంటే విజయ్ స్టార్ హీరో అయింది తెలుగు సినిమాలు రీమేక్ చేయడం ద్వారానే అని చాలా మందికి తెలీదు. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా పదికి పైగా తెలుగు సినిమాలని విజయ్ (HBD Thalapathy Vijay) తమిళ్ లో రీమేక్ చేయడం జరిగింది. ఆ సినిమాలేవో ఒక్కసారి వాటిపై లుక్కేద్దాం…

List of Telugu remake movies starring Thalapathy Vijay in Tamil

నినైతెన్ వందాయ్ (1998) – పెళ్లిసంద‌డి (1996)

విజయ్ హీరోగా “నినైతేన్ వందాయ్” సినిమాలో హీరోగా నటించగా, ఆ సినిమాలో రంభ‌, దేవ‌యాని క‌థానాయిక‌లుగా క‌నిపించారు. ఇక త‌మిళంలో అల్లు అర‌వింద్ ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీ హిట్ కాగా, కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన తెలుగు సినిమా “పెళ్లి సందడి” కి రీమేక్ గా నినైతేన్ వందాయ్ తెరకెక్కింది. ఇక తెలుగులో శ్రీకాంత్ హీరోగా నటించారన్న విషయం తెలిసిందే.

- Advertisement -

ప్రియమానావలే (2000) – ప‌విత్ర బంధం (1996)

విక్టరీ వెంక‌టేష్ నటించిన సూపర్ హిట్ మూవీ “ప‌విత్ర బంధం” సినిమాను త‌మిళంలోకి రీమేక్ చేసి విజ‌య్ హిట్ అందుకున్నాడు. “ప్రియ‌మాన‌వ‌లే” పేరుతో కోలీవుడ్‌లో పున‌ర్మిర్మాణ‌మైన ఈ మూవీలో సిమ్రాన్ హీరోయిన్‌గా న‌టించింది. ఈ త‌మిళ రీమేక్ ఫ్యామిలీ ఆడియెన్స్‌లో విజ‌య్ క్రేజ్‌ను పెంచింది.

బద్రి (2000) – తమ్ముడు (1999)

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ “తమ్ముడు” సినిమాని విజయ్ తమిళ్ లో బద్రి పేరుతో రీమేక్ చేయగా, అక్కడ మంచి విజయం సాధించింది.

చిరునవ్వుతో(2000) – యూత్(2002)

వేణు తొట్టెంపూడి హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమా “చిరునవ్వుతో”
సినిమాని తమిళ్ లో “యూత్” పేరుతో విజయ్ రీమేక్ చేసాడు.

నువ్వు నాకు నచ్చావ్(2001) – వసీగర(2003)

వెంకటేష్ నటించిన బ్లాక్ బస్టర్ ఎంటర్టైనర్ “నువ్వు నాకు నచ్చావ్” సినిమా తెలుగులో ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాని విజయ్ తమిళ్ లో వసీగర పేరుతో రీమేక్ చేయగా, ఈ సినిమాలో స్నేహ హీరోయిన్ గా నటించింది. అయితే వ‌సీగ‌ర భారీ అంచ‌నాల‌తో రిలీజై బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టింది.

​నీతో (2002) – సచేయిన్ (2005)

తెలుగులో రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ రావు నటించిన సూపర్ హిట్ సినిమా నీతో సినిమాను తమిళ్ లో సచేయిన్ పేరుతో తమిళ్ లో రీమేక్ చేసాడు విజయ్.

ఒక్కడు (2003) – గిల్లి (2004)

మ‌హేష్ బాబు కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీస్ లో ఒకటిగా నిలిచిన “ఒక్క‌డు” మూవీని ‘గిల్లీ’ పేరుతో త‌మిళం లో రీమేక్ చేసాడు విజయ్. ఈ సినిమా కోలీవుడ్ లో బాక్సాఫీస్ రికార్డుల‌ను తిర‌గ‌రాసింది. గిల్లీ మూవీలో త్రిష హీరోయిన్‌గా న‌టించింది.

అత‌నొక్క‌డే (2005) – ఆది (2006)

క‌ళ్యాణ్ రామ్ హీరోగా నటించిన అత‌నొక్క‌డే సినిమాని విజయ్ తమిళ్ లో ఆది పేరుతో రీమేక్ చేసాడు. అయితే ఈ సినిమా తమిళ్ లో అంతగా ఆడలేదు.

పోకిరి (2006) – పొక్కిరి (2007)

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన పోకిరి సినిమా తెలుగులో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన విషయం తెలిసిందే. ఈ సినిమా విజయ్ హీరోగా తమిళ్ లో “పొక్కిరి” పేరుతో కోలీవుడ్‌లో రీమేక్ అయింది. త‌మిళంలో 200 రోజుల‌కు పైగా ఆడిన ఈ మూవీకి ప్ర‌భుదేవా ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

ఆజాద్ (2000) -వేళాయుధం (2011)

నాగార్జున తెలుగులో నటించిన సూపర్ హిట్ సినిమా “ఆజాద్” సినిమాని తమిళ్ లో “వేళాయుధం” పేరుతో విజయ్ రీమేక్ చేసాడు. ఈ సినిమా కూడా తమిళ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. విజ‌య్‌కి మాస్ ఆడియెన్స్‌ను క్రేజ్‌ను తీసుకొచ్చిన సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది.

అయితే విజయ్ “నాన్బ‌న్” (త్రీ ఇడియ‌న్స్ రీమేక్‌) సినిమా ప్లాప్ తర్వాత రీమేక్ క‌థ‌ల‌కు దూరంగా ఉండ‌టం మొద‌లుపెట్టాడు. ఇప్పుడు స్ట్రెయిట్ సినిమాలతోనే ప్రేక్షకులని మెప్పిస్తుండగా, త్వరలో “గోట్” ది గ్రేటెస్ట్ ఆల్ టైం సినిమాతో ప్రేక్షకులని పలకరించడానికి రెడీ అయ్యాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు