Aparichitudu Re Release : ఒక్క సినిమా లేదు.. అందుకే అపరిచితుడికి హౌస్ ఫుల్స్..

Aparichitudu Re Release : కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. శివ పుత్రుడు, అపరిచితుడు, ఐ వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో సౌత్ ఇండియా ప్రేక్షకులని అలరిస్తూ, ప్రతి సినిమాకి కొత్త దనం చూపిస్తూ దూసుకుపోతున్నాడు. ఇదిలా ఉండగా విక్రమ్ ని పాన్ ఇండియా స్టార్ గా మలిచిన సినిమా ఏదంటే అందరూ చెప్పే ఒకే ఒక్క సినిమా “అపరిచితుడు”. ఇండియన్ జేమ్స్ కామెరూన్ గా పేరున్న శంకర్ షణ్ముగం దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఆ రోజుల్లో సంచలన విజయం సాధించింది. అప్పటివరకు కోలీవుడ్ కే పరిమితమైన విక్రమ్ ని ఇండియా వైడ్ గా పాపులర్ చేసింది. 2005 లో శంకర్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ ‘అపరిచితుడు’ చిత్రాన్ని వి.రవిచంద్రన్ ఈ చిత్రాన్ని తన ఆస్కార్ ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మించాడు. అప్పటికీ ‘శివపుత్రుడు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు విక్రమ్ చేరువైనా, తనకి తెలుగులో మార్కెట్ సుస్థిర పడేలా చేసిన చిత్రం ‘అపరిచితుడు’ అనే చెప్పాలి. అప్పటి నుండీ విక్రమ్ నటించిన అన్ని సినిమాలు తెలుగులో కూడా డబ్ అవుతూ వస్తున్నాయి. అయితే ఈ వారం అపరిచితుడు సినిమా థియేటర్లలో రీ రిలీజ్ కావడం జరిగింది.

విక్రమ్ నట విశ్వరూపం..

ఇక చియాన్ విక్రమ్ అంతకు ముందే సేతు, శివ పుత్రుడు వంటి సినిమాల్లో తన అద్భుతమైన నటనతో జాతీయ అవార్డు ని సైతం అందుకుని సంచలనం సృష్టించాడు. కానీ శంకర్ కలయికలో వచ్చిన అపరిచితుడు లో అంతకు మించి ఓ రేంజ్ లో నటిస్తాడని ఎవరూ ఊహించి ఉండరేమో. ఇక విక్రమ్ నటించిన బ్లాక్ బస్టర్ అపరిచితుడు (Aparichitudu Re Release) సినిమా ఈ నెల మే 17న రీ రిలీజ్ కావడం జరిగింది. ఇక అపరిచితుడు 2005 జూన్ 17న విడుదలై ఘన విజయం సాధించగా, తెలుగులో అప్పట్లో 13 కోట్ల షేర్ వసూలు చేసి బయ్యర్లకు రెండు రెట్లు భారీ లాభాలని అందించింది. అయితే తాజాగా థియేటర్లలో రిలీజ్ అయిన విక్రమ్ అపరిచితుడు రీ రిలీజ్ అయ్యాక కూడా మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటుంది.

Aparichitudu Re Release Response

- Advertisement -

అపరిచితుడు హౌస్ ఫుల్.. రీ రిలీజ్ కి ప్రేక్షకుల మొగ్గు..

ఇక విక్రమ్ నటించిన అపరిచితుడు మే 17న రీ రిలీజ్ కాగా, తెలంగాణాలో పది రోజుల పాటు సింగల్ స్క్రీన్స్ థియేటర్లు బంద్ కావడం వల్ల ఈ వారం ఏ సినిమాలు కూడా థియేటర్లలో రాకపోవడంతో, ఉన్న లిమిటెడ్స్ థియేటర్లలో అపరిచితుడు రిలీజ్ కాగా, మూవీ లవర్స్ కి ఈ సినిమా మంచి ఆప్షన్ అయింది. ఇక ముందు భారీ రిలీజ్ ను ప్లాన్ చేశారు, కానీ సింగిల్ స్క్రీన్స్ చాలా చోట్ల క్లోజ్ అవ్వగా లిమిటెడ్ రిలీజ్ ను అపరి చితుడు సినిమా సొంతం చేసుకోగా, తెలుగు రాష్ట్రాల్లో ట్రాక్ చేసిన సెంటర్స్ లో మంచి ఓపెనింగ్స్ నే అందుకుందని చెప్పాలి. హైదరాబాదు RTC X రోడ్స్ లో సినిమాకి ఈవినింగ్ షోలకి హౌస్ ఫుల్ బోర్డులు పడగా, ఆంధ్ర సైడ్ కూడా సినిమా షోలకు మంచి ఆక్యుపెన్సీ నోటబుల్ థియేటర్స్ లో సొంతం అవ్వగా, ఓవరాల్ గా మొదటి రీ రిలీజ్ లో సినిమా 16-18 లక్షల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ తెలుగు రాష్ట్రాల్లో సొంతం అయ్యిందని సమాచారం. మరి ఈ సినిమా వీకెండ్ లో మంచి జోరు చూపించే అవకాశం ఉందని చెప్పాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు