Krishna Vamsi: ఆయన లేకపోవడం అనాథ అయిపోయా, స్టేజి పైన కన్నీళ్లు పెట్టుకున్న కృష్ణ వంశీ

Krishna Vamsi: రాంగోపాల్ వర్మ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న సంచలమైన దర్శకులలో ఒకప్పుడు రాంగోపాల్ వర్మ పేరు వినిపించేది. శివ అనే సినిమాతో సంచలనం సృష్టించాడు రాంగోపాల్ వర్మ. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న ఎక్కువ శాతం మంది ఒకప్పుడు ఆయన శిష్యులే. అంతటి టాలెంట్ ఉన్న దర్శకుడు వర్మ. అయితే వర్మని ఇప్పటికీ విపరీతంగా గౌరవించే దర్శకుడు కృష్ణవంశీ. శివ సినిమా దగ్గర్నుంచి రాంగోపాల్ వర్మతో కృష్ణవంశీకి పరిచయం ఉంది. అయితే గులాబీ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయం అయ్యాడు కృష్ణవంశీ. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది.

నిన్నే పెళ్ళాడుతా సినిమాతో అవార్డు

గులాబీ సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన కృష్ణవంశీ, నాగార్జున టబు జంటగా నిన్నే పెళ్లాడుతా అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించింది. కేవలం సినిమా సక్సెస్ అవడం మాత్రమే కాకుండా నేషనల్ అవార్డును కూడా ఈ సినిమాకు తీసుకొచ్చింది. ఆ తర్వాత చేసిన సింధూరం సినిమా ఊహించని స్థాయిలో ఆడలేదు కానీ ఈ సినిమాకు మంచి అవార్డులు మాత్రం లభించాయి. అయితే కృష్ణవంశీ సినిమాలకు సంబంధించి సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇంపాక్ట్ బాగా ఉంటుందని చెప్పొద్దు. ఇకపోతే సింధూరం సినిమాకి సంబంధించి సినిమా మొత్తం అయిపోయాక ఆ సినిమాలో స్టార్ట్ అయ్యే అర్థ స్వతంత్రపు అజ్ఞానాన్ని స్వతంత్రం అందమా అనే పాటను రాసారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. వీరిద్దరి మధ్య ఉన్న మార్నింగ్ మాటల్లో చెప్పలేనిది.

Krishna Vamsi

- Advertisement -

కేవలం పాట కోసమే సినిమాను చేసాడు

సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సాహిత్య రచయితగా ఎంట్రీ ఇవ్వక ముందు నుంచే కవిత్వాలు, పాటలు రాస్తూ ఉండేవారు, అలానే పుస్తకాలు కూడా రాశారు. అయితే ఒక తరుణంలో జగమంత కుటుంబం నాది ఏ కాకి జీవితం నాది అంటూ ఒక పాటను రాసుకున్నారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఈ పాట కృష్ణవంశీకి బాగా నచ్చి, కేవలం ఈ పాట కోసమే ప్రభాస్ హీరోగా చక్రం అనే సినిమాను తీసారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని అందుకోలేదు. కానీ మంచి ప్రశంసలను అందుకుంది.

కృష్ణవంశీకి అద్భుతమైన సాహిత్యం

లేకపోతే కృష్ణవంశీ తీసిన ఎన్నో సినిమాలకు సిరివెన్నెల సీతారామశాస్త్రి అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. సిరివెన్నెల సీతారామశాస్త్రికి కృష్ణవంశీకి మధ్య ఉన్నది ఒక తండ్రి కొడుకుల బంధం వంటిది. వీరిద్దరి మధ్య ఉన్న బాండింగ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే మే 20న సిరివెన్నెల సీతారామశాస్త్రి పుట్టినరోజు సందర్భంగా ఒక ప్రముఖ మీడియా ఛానల్లో ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఆ ప్రోగ్రాం కి సంబంధించిన ఒక ఈవెంట్ ను రీసెంట్ గా నిర్వహించారు. అయితే ఈ ఈవెంట్ కి హాజరైన కృష్ణవంశీ మాట్లాడుతూ ఎమోషనల్ అయిపోయారు. ఏ సినిమా మొదలుపెట్టిన ముందు ఆయనను కలిసే వాడినని చెప్పుకొచ్చారు. అలానే ఇప్పుడు ఆయన లేకపోవడం అనాధలా మిగిలిపోయానంటూ స్టేజ్ పైన కన్నీళ్లు పెట్టుకున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు