Shobhan Babu : ఒకేరోజు విడుదలైన “నటభూషణ శోభన్ బాబు” రెండు క్లాసిక్ చిత్రాల స్పెషల్..

Shobhan Babu : తెలుగు చిత్ర పరిశ్రమలో తొలితరం అగ్రనటుల్లో ఒకరైన “నటభూషణ శోభన్ బాబు” గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్టీఆర్ ఏఎన్నార్ కంటే కూడా అత్యధిక మహిళా ప్రేక్షకాదరణ ఉన్న హీరోగా, అందాల నటుడిగా ఆయనకు పేరుంది. ఇక శోభన్ బాబు చిత్రాలంటే టాక్ తో సంబంధం లేకుండా ఆ రోజుల్లో ఒక్కసారైనా చూసేవారు. అంతటి పేరున్న శోభన్ బాబు ఎన్నో చిత్రాలతో ప్రేక్షకులని అలరించారు. అలాంటి క్లాసిక్ చిత్రాల్లో ఓ రెండు చిత్రాలు ఒకేరోజున విడుదలై ఘన విజయం సాధించాయి. కానీ అవి ఒకే కాలంలో రాలేదు. రెండు వేర్వేరు కాలాల్లో వచ్చి ఘన విజయం సాధించాయి. అందులో ఒకటి శోభన్ బాబు శారద, జయంతి నటించిన “జీవితం” చిత్రం 1973 మే 18న రిలీజ్ కాగా, మరొకటి శోభన్ బాబు శారద, సుహాసిని, అర్జున్ నటించిన “చట్టంతో చదరంగం” చిత్రం.. ఈ రెండు చిత్రాలు ఆ రోజుల్లో మంచి ప్రేక్షకాదరణ అందుకున్నాయి. ఇక ఈ చిత్ర విశేషాలని ఒక్కసారి ఈరోజు గుర్తుచేసుకుందాం..

51 వసంతాల “జీవితం”…

శోభన్ బాబు స్టార్ హీరోగా అప్పుడప్పుడే రాణిస్తున్న కాలంలో నటించిన చిత్రం “జీవితం”. అప్పటికే సూపర్ హిట్ పెయిర్ అనిపించుకున్న శోభన్ బాబు శారద కలిసి నటించిన ఈ చిత్రంలో జయంతి రెండో కథానాయిక గా నటించింది. 1973 మే 18న విడుదలైన ఈ చిత్రం నేటికీ 51 వసంతాలు పూర్తి చేసుకుంది. ఇక ఈ చిత్రంలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ నేపథ్యంలో కుటుంబకథా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఇక ఈ చిత్రానికి కె. ఎస్ . ప్రకాష్ రావు దర్శకత్వం వహించగా, శ్రీధర్ ప్రొడక్షన్స్ పై బండారు గిరిబాబు, సూర్య చంద్రరావు నిర్మించారు. ఇక అప్పటినుండి ప్రేమకథ చిత్రాలకు శోభన్ బాబు కేరాఫ్ అయిపోగా, తన చిత్రంలో ఇద్దరు కథానాయికలు నటించడం కామన్ అయిపొయింది. ఇక శోభన్ బాబు శారద జంటగా 18 కి పైగా చిత్రాల్లో నటించారు.

Nata Bhushan Shobhan Babu Classic movies Special..

- Advertisement -

36 వసంతాల చట్టంతో చదరంగం..

80వ దశకంలో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి యువ నటులు రానిస్తున్న సమయంలో సీనియర్ నటులైన శోభన్ బాబు (Shobhan Babu) దూకుడు కాస్త తగ్గిందని వార్తలు వస్తున్న సమయంలో మంచి కమర్షియల్ సినిమాతో అందరి నోళ్లు మూయించి ఘన విజయం సాధించిన చిత్రం “చట్టంతో చదరంగం”. 1988 మే 18న విడుదలైన ఈ చిత్రం భారీ విజయం సాధించగా నేటికీ 36 వసంతాలు పూర్తి చేసుకుంది. ఇక శోభన్ బాబు శారద జంటగా నటించగా, శరత్ బాబు ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేసారు. అలాగే రెండో హీరోగా అర్జున్ నటించడం విశేషం. సుహాసిని, రజిని హీరోయిన్లు గా నటించారు. ఇక వరుస పరాజయాల్లో ఉన్న శోభన్ బాబుకి ఈ సినిమా మంచి హిట్ ఇవ్వడమే కాకుండా, శోభన్ బాబు బాక్స్ ఆఫీస్ సత్తా చూపించింది ఈ సినిమా. హైదరాబాద్ జంట నగరాల్లో ఆ రోజుల్లో 30 లక్షలకి పైగా వసూలు చేయడం రికార్డ్. ఇక 1.20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఆరోజుల్లో 3 కోట్లకి పైగా వసూలు చేసింది. ఇక చట్టంతో చదరంగం చిత్ర వంద రోజుల వేడుక చెన్నైలో జరగగా, విక్టరీ వెంకటేష్, కె. రాఘవేంద్రరావు అతిథులుగా వేడుక ఘనంగా జరిగింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు