Kalki 2898 AD Skratch Episode 04 : భైరవ బుజ్జి లుక్ అదిరిపోయింది

Kalki 2898 AD Skratch Episode 04 : పాన్ ఇండియా స్టార్ట్ ప్రభాస్ మే 17న ఉదయం ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన స్టోరీ ఎంత వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన చేసిన పోస్టులను చూసి అందరూ ప్రభాస్ తన గర్ల్ ఫ్రెండ్ గురించి చెబుతున్నాడని అపార్థం చేసుకునే లోపు సాయంత్రానికే మరో పోస్ట్ తో అసలు విషయం చెప్పేసాడు. ఈసారి నా బుజ్జిని చూస్తారా అంటూ కల్కి 2898 ఏడీ మూవీ ప్రమోషన్లను ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ చేశాడు ప్రభాస్. తాజాగా ఆ బుజ్జి అప్డేట్ రానే వచ్చింది. మరి భైరవ వాహనమైన బుజ్జి విశేషాలు ఏంటో ఓ లుక్కేద్దాం పదండి.

ఈ బుజ్జి ఎవరంటే?

మే 17న సాయంత్రం ప్రభాస్ తన ఇంస్టాగ్రామ్ లో స్క్రాచ్ ఎపిసోడ్ 04 శనివారం సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేయబోతున్నాము అంటూ పోస్ట్ చేశాడు. అందులోనే డార్లింగ్స్ నా బుజ్జిని మీరు చూడాలని ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాను అంటూ రాస్కొచ్చాడు. దీంతో ప్రభాస్ బుజ్జి ఎవరు అన్న చర్చ హాట్ టాపిక్ అయ్యింది. ఇక అసలు విషయంలోకి వెళ్తే ఆ బుజ్జి ఎవరో కాదు కల్కి 2898 మూవీ ప్రమోషన్ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ప్రభాస్ కారుని బుజ్జి అని పిలుస్తున్నారు.

సంవత్సరం క్రితం చిత్ర బృందం యూట్యూబ్ లో స్క్రాచ్ పేరుతో కొన్ని వీడియోలను రిలీజ్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. అందులోనే ఓ ప్రత్యేకమైన కారును తయారు చేయడం కనిపించింది. ఆ కారు తయారీ వీడియో నాలుగో ఎపిసోడ్ శనివారం సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేయనున్నట్టుగా అనౌన్స్ చేశారు మేకర్స్. సినిమాలో ప్రభాస్ పేరు భైరవ కాగా, ఆయన కారు పేరు బుజ్జి అన్నమాట. మొత్తానికి ప్రభాస్ ముద్దుగా పిలుచుకుంటున్న ఈ బుజ్జి కొన్ని గంటల పాటు ప్రభాస్ పెళ్లి న్యూస్ ను మరోసారి హాట్ టాపిక్ అయ్యేలా చేసింది.

- Advertisement -

భైరవ బుజ్జి లుక్ అదిరిపోయింది

ఇక ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది. తాజాగా బుజ్జిని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు మేకర్స్. ఈ బుజ్జి అనే వాహనం సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇకకల్కి 2898 మూవీ కోసం ఎన్నో రకాల వాహనాలను తయారు చేశామని చాలా కాలం క్రితమే వెల్లడించారు. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బుజ్జి లుక్ అదిరిపోయింది.

బుజ్జి అప్డేట్ ఆలస్యానికి కారణం ఇదే

దీనికి ప్రముఖ నటి కీర్తి సురేష్ తన గాత్రాన్ని అందించారు. అయితే దీనికి సంబంధించిన డబ్బింగ్ ఆలస్యం కావడంతో 5 గంటలకే రిలీజ్ చేస్తామన్న అప్డేట్ ను మరింత ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు మేకర్స్. అంటే బుజ్జికి డైలాగులు చెప్పేది కీర్తి సురేష్ అన్నమాట.

Kalki 2898 AD Skratch Episode 04 Bujji Look Out Now

మే 22న బుజ్జి పూర్తి దర్శనం..

అయితే బుజ్జి అంటే ఏంటి ? అన్న ప్రశ్నకు సమాదానం దొరికింది. ‘మన బాడీని మన బ్రెయిన్ ఎలా కంట్రోల్ చేస్తుందో.. బుజ్జిని కూడా ఓ బ్రెయినే అలా కంట్రోల్ చేస్తుంది’ అని చూపించారు. ఇక బుజ్జి మనిషిలానే మాట్లాడుతోంది.. ‘సచ్చినోడా’ అంటూ తిట్లు కూడా తిడుతోంది. ఇక బుజ్జిని తయారు చేసిన వారిని ఈ వీడియోలో పరిచయం చేశారు. అలాగే ‘బుజ్జి అంటే వాహనం మాత్రమే కాదు.. ఇదో సూపర్ హీరో’ అని కూడా చెప్పారు. ఇక బుజ్జి పూర్తి రూపాన్ని మే22న చూపిస్తామని తెలిపారు.

కల్కి ప్రమోషన్స్ షురూ

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న మూవీ కల్కి 2898 ఏడి. నాగ్ అశ్విన్ ఈ సినిమాను భారతదేశంలోనే అత్యంత ఖరీదైన బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా రూపొందిస్తున్నారు. ఇందులో ప్రభాస్ తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి లెజెండరీ యాక్టర్స్ నటిస్తుండడంతో ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. బాలీవుడ్ హీరోయిన్లు దీపిక పదుకొనే, దిశా పటాని హీరోయిన్లుగా నటిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సైన్స్ ఫిక్షన్ మూవీని నిర్మిస్తున్నారు. జూన్ 27న ఈ మూవీని రిలీజ్ చేయనున్న నేపథ్యంలో తాజాగా ప్రమోషన్స్ షురూ చేశారు. అందులో భాగంగానే బుజ్జి లుక్ బయటకు వచ్చింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు