Kalki2898AD: కల్కి మ్యూజిక్ రైట్స్ ఫినిష్

Kalki2898AD: కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ అంతా ఎదురు చూస్తున్న సినిమా కల్కి. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. నాగ్ అశ్విన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే ఒక అభిరుచి ఉన్న దర్శకుడు అని అనిపించుకున్నాడు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించడం మాత్రమే కాకుండా, మంచి ప్రశంసలను కూడా తెచ్చి పెట్టింది.

Kalki2898AD: Kalki Music Rights Finish
Kalki2898AD: Kalki Music Rights Finish

ఇకపోతే నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన రెండవ సినిమా మహానటి. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మహానటి సావిత్రి గారి కథను కళ్ళకు కట్టినట్లు చూపించాడు నాగ అశ్విన్. ఈ సినిమా కూడా కమర్షియల్ గా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఈ సినిమాను మొదలు పెట్టినప్పుడు చాలామంది చాలా విమర్శలు చేశారు. ఒక తెలుగు మహానటి బయోపిక్ తీయడానికి మలయాళం హీరోయిన్ ఏంటి అని చాలామంది విమర్శలు చేశారు. అయితే వాటన్నిటికీ ఫస్ట్ లుక్ తోనే సమాధానం చెప్పాడు నాగ్ అశ్విన్. ఇంకా సినిమా రిలీజ్ అయిన తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకుంది.

అందరి కళ్ళు ఇప్పుడు కల్కి సినిమా పై
ఆ సినిమా తర్వాత ఇప్పటివరకు నాగ్ అశ్విన్ ఒక సినిమాను కూడా చేయలేదు. ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న సినిమా కల్కి అందుకోసమే ఈ సినిమా పైన అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. దీనికి తోడు ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ నుంచి వస్తున్న మరో సినిమా కాబట్టి అంచనాలు మరింత పెరిగాయి. బాహుబలి సినిమా తర్వాత ఆ స్థాయిలో ఇప్పటివరకు ప్రభాస్ కు సరైన హిట్ పడలేదు. తర్వాత వచ్చిన సినిమాలన్నీ కూడా అంతంత మాత్రమే ఆడాయి. అందుకే అందరి కళ్ళు ఇప్పుడు కల్కి సినిమా పైన ఉన్నాయి.

- Advertisement -

మ్యూజిక్ హక్కులు సొంతం చేసుకున్న సంస్థ
కల్కి సినిమా కథాంశం చాలా కొత్తగా అనిపిస్తుంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ కూడా అందర్నీ ఆకట్టుకుంది. కమలహాసన్, అమితాబచ్చన్, దీపికా పదుకొనే వంటి పెద్ద పెద్ద నటులు ఈ సినిమాలో కనిపిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ రైట్స్ ను సరేగామా సంస్థ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అలానే ఈ సినిమా నుంచి మొదటి సాంగ్ కూడా ఈ నెలలో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు