Varun sandesh: థ్రిల్లింగ్ సీన్స్ తో నింద టీజర్.. వరుణ్ హిట్ కొట్టడం గ్యారంటీ

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది యంగ్ హీరోలు ఉన్న సంగతి తెలిసిందే. అందులో వరుణ్ సందేశ్ ఒకడు. హీరో వరుణ్ సందేశ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హ్యాపీడేస్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా అడుగు పెట్టాడు వరుణ్ సందేశ్. ఆ తర్వాత కొత్త బంగారులోకం సినిమాతో బంపర్ హిట్ అందుకున్న వరుణ్ సందేశ్… ఈ మధ్యకాలంలో అన్ని ఫెయిల్యూర్స్ ను ఎదుర్కొంటున్నాడు. ఇలాంటి నేపథ్యంలోనే తాజాగా మరో అదిరిపోయే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు వరుణ్ సందేశ్.

నింద అనే డిఫరెంట్ టైటిల్ తో వరుణ్ సందేశ్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాకు రాజేష్ జగన్నాథం దర్శకత్వం వహించాడు. ది ఫర్వెంట్ ఇమ్ డీ ప్రొడక్షన్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కింది. ఇక ఈ సినిమాలో వరుణ్ సందేశ్ హీరోగా చేస్తుండగా… ఈ సినిమా పూర్తిగా మర్డర్ అలాగే క్రైమ్ మిస్టరీ యాంగిల్ లో కొనసాగనుంది. అయితే… ఈ సినిమా టీజర్ తాజాగా రిలీజ్ చేసింది చిత్రం బృందం.

విలక్షణ నటుడు నవీన్ చంద్ర చేతుల మీదుగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ విలక్షణ నటుడు నవీన్ చంద్ర చేతుల మీదుగా ఈ సినిమా టీజర్ విడుదలైంది. జీవితంలో కొన్నిసార్లు తప్పని తెలిసిన కూడా చేయక తప్పదు… అనే డైలాగ్ తో టీజర్ ప్రారంభమవుతుంది. అందమైన ప్రేమ కథ కూడా ఈ టీజర్ లో చూపించారు. ముఖ్యంగా ఈ సినిమా మొత్తం మర్డర్ అలాగే క్రైమ్ మిస్టరీ ఉండనున్నట్లు టీజర్ చూస్తే మనకు స్పష్టమవుతోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు