36Years For Ontari Poratam : 36 వసంతాల “ఒంటరి పోరాటం”.. విక్టరీ వెంకటేష్ ని నటనలో మరో మెట్టు ఎక్కించిన బ్లాక్ బస్టర్…

36Years For Ontari Poratam : టాలీవుడ్ లో విక్టరీ కి కేరాఫ్ “వెంకటేష్” అని అంటారు. నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో మైలు రాళ్లు అందుకున్న వెంకటేష్ తన కెరీర్ బిగినింగ్ నుండి కూడా ఎన్నో విలక్షణమైన పాత్రలను చేసారు. ఇక వెంకటేష్ తో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ది సూపర్ హాట్ కాంబినేషన్. వెంకటేష్ హీరోగా పరిచయమైందే రాఘవేంద్రరావు దర్శకత్వంలో. 1986 లో కలియుగ పాండవులు చిత్రంతో హీరోగా పరిచయమైన వెంకటేష్ తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఇండస్ట్రీ లో తనదైన ముద్ర వేసాడు. ఇక ‘విక్టరీ’ వెంకటేష్, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావుది సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ కాగా, వీరిద్దరి కలయికలో వచ్చిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించాయి. వాటిలో ‘ఒంటరి పోరాటం’ ఒకటి. అలాగే ‘కలియుగ పాండవులు’ మొదలుకొని ‘భారతంలో అర్జునుడు’, అగ్గి రాముడు, కూలి నెంబర్ 1, సహస వీరుడు సాగరకన్య, సుందర కాండ, ముద్దుల ప్రియుడు వంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఇదిలా ఉండగా వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన “ఒంటరి పోరాటం” చిత్రం 1989 మే 18న విడుదలై ఘన విజయం సాధించగా, నేటికీ 36 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా ఈ చిత్ర విశేషాలను కొన్ని తెలుసుకుందాం.

చదువులేని వాడి ఒంటరి పోరాటం..

నిరక్షరాస్యుడైన ఓ కూలీని అలాగే అతని సన్నిహితుల్ని ధనవంతురాలైన ఓ అమ్మాయి అలాగే ఆమె తండ్రి కలిసి డబ్బు మదంతో అవమానిస్తే.. వాళ్లకు బుద్ధి చెప్పడానికి హీరో ఏం చేసాడు, అందులో అతనికి సహకరించినవారేవారు.. ఈ క్రమంలో ఏమి చదువుకొని వ్యక్తి తన తెలివితేటలతో అందనంత ఎత్తుకు ఎలా ఎదగాడన్నదే కథ. ఈ సినిమాలో వెంకటేష్ రాజా అనే పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించాడు. అప్పుడప్పుడే హీరోగా రాణిస్తున్న వెంకటేష్ కి నటన పరంగా ఈ సినిమా మంచి గుర్తింపు తెచ్చిపెట్టగా, కమర్షియల్ గా కూడా మంచి విజయం సాధించింది. ఇక ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించిన జయసుధ, మోహన్ బాబులు కూడా అద్భుతంగా నటించి మెప్పించారు.

36Years For Ontari Poratam Movie

- Advertisement -

చక్రవర్తి పాటల పల్లకి..

ఇక ‘ఒంటరి పోరాటం’ (36Years For Ontari Poratam) చిత్రంలో వెంకీకి జోడిగా ఉత్తరాది భామ ఫరా నటించగా, కైకాల సత్యనారాయణ, మోహన్‌బాబు, బ్రహ్మానందం, సుధాకర్, ఆనంద్‌రాజ్, శివాజీరాజా, చిట్టిబాబు, చిడతల అప్పారావు, పి.జె.శర్మ, అన్నపూర్ణ, శుభ, మమత, ‘డబ్బింగ్’ జానకి ముఖ్య భూమికలు పోషించగా, ‘సహజనటి’ జయసుధ కీలక పాత్రలో దర్శనమిచ్చారు. ఈ సినిమాకి చక్రవర్తి బాణీలు అందించగా వేటూరి సుందరరామమూర్తి, జొన్నవిత్తుల సాహిత్యం సమకూర్చారు. “నువ్వు రెడి నేను రెడి”, “పెదవి మీద ముద్దు”, “మేడలొద్దు మిద్దెలొద్దు”, వంటి పాటలన్నీ అప్పట్లో ప్రేక్షకులను అలరించాయి. శ్రీ కృష్ణ ప్రసన్న ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై బి.వి.యస్.యన్.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించగా 1989 మే 18న విడుదలైన ‘ఒంటరి పోరాటం’ ఘన విజయం సాధించింది. ఇక ఈ సినిమా తర్వాత వెంకటేష్ వరుస సినిమాల విజయాలతో దూసుకుపోయాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు