Getup Sreenu: రోజా మాటలకు శ్రీను షాకింగ్ రిప్లై.. ఏమన్నారంటే..?

Getup Sreenu..మొదట జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న గెటప్ శ్రీను తన కామెడీ టైమింగ్ తో వెండితెర పైన కూడా అవకాశాలు అందుకుంటూ ఉన్నారు. పలు చిత్రాలలో కమెడియన్ గా నటించిన గెటప్ శ్రీను ఇటీవలే హీరోగా కూడా ఒక చిత్రంలో నటిస్తున్నారు. ముఖ్యంగా సుడిగాలి సుదీర్ ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను మంచి స్నేహితులని కూడా చెప్పవచ్చు.. ఇందులో రాంప్రసాద్ జబర్దస్త్ లో కొనసాగుతూ ఉన్నారు.. కానీ సుధీర్, గెటప్ శ్రీను మాత్రం సినిమాలలో రాణిస్తున్నారు.

Getup Sreenu: Sreenu's shocking reply to Roja's words.. What are they saying..?
Getup Sreenu: Sreenu’s shocking reply to Roja’s words.. What are they saying..?

చిన్న ప్రాణులంటూ రోజా కామెంట్స్..

ఇదిలా వుండగా .తాజాగా గెటప్ శ్రీను నటించిన రాజు యాదవ్ అనే సినిమా ఈనెల 17వ తేదీన రిలీజ్ కాబోతున్నది.. ఈ నేపథ్యంలోనే నిన్నటి రోజున ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని కూడా ఘనంగా నిర్వహించారు..అలా మీడియాతో కొద్దిసేపు మాట్లాడిన గెటప్ శ్రీను మంత్రి రోజాపై షాకింగ్ కామెంట్స్ చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది.. ఈ ఇంటర్ వ్యూ కి డైరెక్టర్ కృష్ణమాచారి హీరోయిన్ అవంతిక తో కలిసి మాట్లాడడం జరిగింది గెటప్ శ్రీను. ఈ సందర్భంగానే అక్కడ ఒక యాంకర్ రోజా మీ అందరిని చిన్నప్రాణులు అంటూ సంబోధిస్తోంది. ముఖ్యంగా మెగా ఫ్యామిలీని చూసి భవిష్యత్తులో ఇబ్బంది ఉండకూడదని వారు జనసేన పార్టీ కోసం ప్రచారం చేస్తున్నారు అంటూ కామెంట్ చేశారు.. ఈ విషయం పైన మీ స్పందన ఏంటి అంటూ గెటప్ శ్రీనును అడగగా..

గెటప్ శ్రీను కామెంట్స్ వైరల్..

అందుకు గెటప్ శ్రీను స్పందిస్తూ.. ముందుగా ఈ విషయాన్ని దాటి వేసే ప్రయత్నం చేసినప్పటికీ ఆ తర్వాత ఆమె చేసిన చిన్న కామెంట్స్ అంటున్నట్టుగా తాను భావిస్తున్నానంటూ వెల్లడించారు.. వాస్తవానికి ఒకప్పుడు రోజా, నాగబాబు జబర్దస్త్ కార్యక్రమానికి సైతం జడ్జ్ లుగా ఉండేవారు.. అయితే ఆ తర్వాత రాజకీయాల పరిణామాల వల్ల అటు నాగబాబు ఇటు రోజా ఇద్దరూ కూడా వెళ్లిపోయారు.. అలాంటిది ఇప్పుడు తాజాగా రోజా మాట్లాడిన మాటల పైన గెటప్ శ్రీను ఎలాంటి కౌంటర్ వేస్తారు అంటూ అందరూ ఎదురు చూడగా.. దీనికి సమాధానంగా గెటప్ శ్రీను మాట్లాడుతూ.. ఆమె చేసినవి కేవలం చిన్న కామెంట్స్ మాత్రమే అంటూ సమాధానమిచ్చారు. దీన్ని బట్టి చూస్తే.. సైలెంట్ గాని గెటప్ శ్రీను ఇలాంటి సమాధానం చెప్పారని వార్తలు వినిపిస్తున్నాయి.. మరొకవైపు రోజాని ఇబ్బంది పెట్టకూడదని.. ఆయన ఈ కామెంట్స్ ని దాటవేసినట్లుగా సమాచారం. అంతేకాదు కేవలం తాము అభిమానంతోనే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చేసామంటూ కూడా వెల్లడించారు గెటప్ శ్రీను. మొత్తానికి అయితే రోజా చేసిన కామెంట్లను లైట్ గా తీసుకునట్లు తెలుస్తోంది.. ఎందుకంటే వృత్తిపరంగా అటు రోజా గెటప్ శ్రీనుకి చాలా సహాయం చేసింది ఈ సహాయాన్ని ఆయన దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా కామెంట్లు చేసినట్లు సమాచారం. ఏదేమైనా మీడియా కాంట్రవర్సీగా సృష్టించాలని ప్రయత్నించినప్పటికీ గెటప్ శ్రీను మాత్రం ఈ విషయాన్ని దాట వేసే ప్రయత్నం చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు