Simhadri : బాలకృష్ణ సింహాద్రి చేయకపోవడానికి ఈ రెండు ప్రధాన కారణాలు..! ఫైనల్ గా కథ నేపథ్యమే మార్చేశారు !

Simhadri : జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో కెరీర్ టర్నింగ్ పాంట్ మూవీ అంటే గుర్తొచ్చే సినిమా “సింహాద్రి”. ఈ పేరుతో ఎన్నో రికార్డులు, రివార్డులు, అంతకంటే ఎక్కువ వివాదాలు కూడా జరిగాయి. సోషల్ మీడియా సాక్షిగా ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. 2003 లో వచ్చిన ఈ చిత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే టర్నింగ్ పాయింట్ గా నిలిచిపోయింది. సింహాద్రి(Simhadri), ఆది(aadi) సినిమాలతో యంగ్ ఏజ్ లోనే మాస్ క్రేజ్ ని సొంతం చేసుకున్న ఎన్టీఆర్, తర్వాత ఆ క్రేజ్ ని అందుకునే సినిమా చాలా ఏళ్ళు ఇవ్వలేదు. ఎన్టీఆర్ అల్లరి రాముడు, నాగ వంటి వరుస ప్లాప్స్ తర్వాత వచ్చిన “సింహాద్రి” సినిమా సెన్సేషనల్ విజయాన్ని అందుకుని సంచలనం సృష్టించింది. ఆ రోజుల్లోనే 26.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని అప్పట్లో ఊరమాస్ రికార్డ్ ను నమోదు చేసింది. లాంగ్ రన్ లో అత్యధిక థియేటర్లలో సిల్వర్ జూబ్లీ జరుపుకుని ఆల్మోస్ హైయెస్ట్ గ్రాసర్స్ లో రెండో స్థానంలో నిలిచింది. అయితే ఇలాంటి సినిమా ముందుగా ఎన్టీఆర్ కి కాకుండా నట సింహం నందమూరి బాలకృష్ణ కి వెళ్ళింది అన్న విషయం కొద్ది మందికే తెలుసు. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన చేయలేదు.

చేయకపోవడానికి రెండు ప్రధానకారణాలు ఇవే!

ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సింహాద్రి సినిమా కథ రాసిన విజయేంద్ర ప్రసాద్ బాలకృష్ణ కోసమే ఈ కథ రాసానని ఈ విషయాన్నీ చాలాసార్లు ఓపెన్ గానే చెప్పారు. కానీ బాలయ్య ఈ సినిమా ను ఎందుకని చేయలేదు అనడానికి 2 రీజన్స్ ఉన్నాయి. అందులో ఒకటి, అప్పటికే బాలయ్య సమరసింహా రెడ్డి, నరసింహా నాయుడు, సీమ సింహం ఇలా అన్నీ ఫాక్షన్ ఓరియెంటెడ్ అండ్ రివెంజ్ మూవీస్ నే చేస్తూ వస్తున్నాడు. ఇలాంటి టైం లో మళ్ళీ ఈ కథ ఎందుకని లైట్ తీసుకున్నాడు అన్నది ఒక రీజన్. మరో ప్రధాన కారణం ఏంటంటే ఈ కథ ఫస్ట్ విజయేంద్రప్రసాద్ రాజమౌళి డైరెక్షన్ కోసం రాయలేదు. బి గోపాల్ డైరెక్షన్ లో బాలయ్య తో సినిమా చేయాలని కథ రాశారు. అయితే కథ వినిపించాక బాలయ్య ఓకే చెప్పే టైం లో ‘పోసాని కృష్ణ మురళి’ పలనాటి బ్రహ్మనాయుడు సినిమా కథని తీసుకు రావడం తో ఆ కథ నచ్చి ఒకే తరహా కథ ఇప్పట్లో వద్దని రీజన్ చెప్పి పక్కన పెట్టాడు బాలయ్య.

ప్రభాస్ నుండి తారక్ కి..

ఇక స్టూడెంట్ నంబర్ వన్ సినిమా తర్వాత మరో సినిమా కథ కోసం ఎదురు చూస్తున్న రాజమౌళి కి ఈ కథ చెప్పగా, దాన్ని కొద్దిగా మార్చి ప్రభాస్ కి వినిపించాడు రాజమౌళి. అప్పటికే రాఘవేంద్ర సినిమా చేస్తున్న ప్రభాస్ రిజెక్ట్ చేసాడు. ఆ తర్వాత రాజమౌళి ఎన్టీఆర్ కి సూట్ అయ్యేలా కథ నేపథ్యం మార్చేశాడు. ముందుగా ఒకే హీరోయిన్ ఉన్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లను జత చేసాడు. పూర్తిగా ఎన్టీఆర్ కి సూట్ అయ్యేలా డిసైన్ చేసి తెరకెక్కించారు. ఆ తర్వాత రిజల్ట్ తెలిసిందేగా. ఇలా బాలయ్య చేయాల్సిన సినిమా ఫైనల్ గా ఎన్టీఆర్ కి దక్కింది. మొత్తం మీద ఇది సింహాద్రి ఎన్టీఆర్ చేయడానికి ప్రధాన రీజన్. ఎన్టీఆర్ కెరీర్ లోనే ఓ బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ గా మారింది సింహాద్రి (Simhadri) సినిమా. అదే టైం లో బాలయ్య కి పడి ఉన్నా ఇవే సంచలనాలు సృష్టించేది కావొచ్చు. అయితే ఆ సమయంలోనే నందమూరి వర్గాలు రెండు వర్గాలుగా విడిపోయి రాజకీయంగానూ చెదిరిపోయాయి. ఒక వర్గం జూనియర్ ఎన్టీఆర్ ని వెనకేసుకొని హరికృష్ణ పేరిట వర్గం తయారవగా, మిగతావాళ్ళు బాలకృష్ణ పేరిట ఒక వర్గం తయారయ్యారు. ఇదంతా అప్పట్లో హరికృష్ణ టిడిపి ని కాదని పెట్టిన కొత్త పార్టీ కోసమే అని తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత ఆంధ్రావాలా ఆడియో లాంచ్ కూడా బాలకృష్ణ కి వ్యతిరేకంగా జరిపిన ఫంక్షన్ అని ఆరోజుల్లో వార్తలు వచ్చాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు