Mrunal Thakur : మృణాల్ డ్రెస్ కోసం 1400 గంటలు శ్రమించిన తెలుగమ్మాయి..

Mrunal Thakur : టాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సీతారామం సినిమాతో అడుగుపెట్టిన ఈ హీరోయిన్ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకోగా, టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపొయింది. మొదటి సినిమాకే పెద్ద పెద్ద ఆఫర్లు వచ్చినా సెలెక్టీవ్ గా నటనకు ప్రాధాన్యమిచ్చే పాత్రలు చేస్తూ వస్తుంది. ఇక ఆయా తర్వాత నాని తో హాయ్ నాన్న సినిమా చేసింది. ఆ సినిమా కూడా మంచి విజయం సాధించగా, నటిగా మృణాల్ కి మంచి పేరు కూడా తీసుకువచ్చింది. అయితే రీసెంట్ గా వచ్చిన ఫ్యామిలీ స్టార్ తో మాత్రం ప్లాప్ అందుకుంది. కానీ నటన పరంగా మాత్రం మృణాల్ కి మంచి పేరు తెచ్చింది. ఇదిలా ఉండగా ఈ మధ్య ఈవెంట్స్ లలో మృణాల్ ఫుల్ జోరు చూపిస్తుంది. ఎక్కడ పడితే అక్కడ ఫోటోషూట్లతో రచ్చ చేస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే.. ఈ మధ్య తెలుగ‌మ్మాయిలు డిజైన‌ర్లుగా రాణిస్తున్నారు. ఫ్యాష‌న్ ప్ర‌పంచపు మంత్ర‌గ‌త్తెలుగా వెలుగుతున్నారు. తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో ఫ్యాష‌న్ ఇండ‌స్ట్రీలో ఇప్ప‌టికే చాలా మంది ఫ్యాష‌న్ డిజైన‌ర్లు తెలుగు వారు ఉన్నారు. ఇందులో అను పెళ్ల‌కూరు ఒక‌రు. ఇప్పుడు మృణాల్ ధ‌రించిన డిజైన‌ర్ “లెహంగా” ఈ తెలుగ‌మ్మాయి ఖ్యాతిని వినువీధుల్లో విహ‌రింప‌జేస్తోంది.

మృణాల్ డ్రెస్ 1400 గంటల శ్రమ ఫలితం..

ఇక తాజాగా బిటి ఫ్యాషన్ వీక్‌లో తెలుగు డిజైనర్ అను పెళ్లకూరు పేరు మార్మోగింది. దీనికి కార‌ణం త‌ను డిజైన్ చేసిన ప్ర‌త్యేక డిజైన‌ర్ “లెహంగా”. అను పెళ్లకూరు కొత్త డిజైనర్ టాప్… చీర రంగు ఎరుపు. ఇదే నేప‌థ్యంలో పువ్వులు ఆకుల డిజైన్ తో అందంగా క‌నిపించింది. ఈ డిజైన్ లో ప‌ట్టు పెర్ల్ ఎంబ్రాయిడ‌రీ వ‌ర్క్ ఎంతో హైలైట్ గా క‌నిపిస్తోంది. ఈ ఘ‌న‌త‌కు కార‌కురాలైన డిజైన‌ర్ అనూని మృణాల్ ఠాకూర్ ప్ర‌శంసించారు. ”నా డిజైనర్ అను గురించి నేను చాలా గర్వపడుతున్నాను.. నేను ర్యాంప్‌పై నడవడం చాలా అద్భుతంగా ఉంది. ఈ దుస్తులను తయారు చేయడానికి అనూ 1400 గంటలు వెచ్చించింది” అని మృనాల్ తెలిపింది. పువ్వులు, ఆకులు, అంద‌మైన ముత్యాల చేరిక‌తో ఈ డిజైన‌ర్ లుక్ ని డిజైన్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంద‌ని మృణాల్ తెలిపింది. భార‌తీయ సాంప్ర‌దాయ దుస్తులంటే ప్రాణం అని కూడా అంది. తాజా డిజైన్ పెళ్లిళ్ల సీజ‌న్ కి స‌రిపోయేది. ” ర్యాంప్ వాక్ సరదాగా ఉంది.. కొంత భయం కూడా ఉంది” అని వ్యాఖ్యానించింది.

వరుస సినిమాలతో జోరు..

ఇక మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో సీతారామం, నానితో హాయ్ నాన్న‌ వంటి వరుస సక్సెస్ లు సాధించిన తర్వాత రీసెంట్ గా విజయ్ దేవ‌ర‌కొండ‌ తో చేసిన “ఫ్యామిలీ స్టార్‌” తో ప్లాప్ అందుకుంది. అయినా కెరీర్ కే ఏమాత్రం డోకా లేదని చెప్పాలి. ఎందుకంటే మృణాల్ తన వరకు బాగానే చేసింది. పైగా తన నటనకు ప్రశంసలు లభించాయి. ఇక ప్రస్తుతం హిందీ లో ‘పూజా మేరీ జాన్’ అనే చిత్రంలో నటిస్తోంది. తమిళంలో శింబుతో కూడా ఒక సినిమా చేస్తోంది. అలాగే తర్వాత ప్ర‌భాస్ హను రాఘవపూడి కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో న‌టించేందుకు రెడీ అవుతుందని సమాచారం. అలాగే రామ్ చరణ్ RC 17 లో కూడా హీరోయిన్ గా నటించబోతుందని సమాచారం. మరి ఈ వార్తలపై క్లారిటీ రావాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు