Rajasekhar : రాజశేఖర్ సాలిడ్ కం బ్యాక్ కి రంగం సిద్ధం..ఆ వెబ్ సిరీస్ దర్శకుడితో సినిమా?

Rajasekhar : టాలీవుడ్ యాంగ్రీ మ్యాన్ రాజా శేఖర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు యాక్షన్ హీరోగా టాలీవుడ్ లో 90స్ లో ఒక ఊపు ఊపిన హీరో. అప్పట్లో మంచి స్టార్ డమ్ మైంటైన్ చేసిన ఈ హీరో 2000 ల తర్వాత చల్లబడ్డాడు. వరుస పరాజయాలు ఈయన్ని కోలుకోకుండా చేసాయి. తన తోటి స్టార్ హీరోలైన శ్రీకాంత్, జగపతి బాబు కూడా ఓ మోస్తరు హిట్లతో కొన్నాళ్ళు నెట్టుకొచ్చారు. ఇక ఇప్పుడు వారందరూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు గా విలన్లు గా మారి, ఇప్పుడు కూడా బిజీ అవుతున్నారు. కానీ రాజశేఖర్ మాత్రం హీరోగానే ఇంకా సినిమాలు చేయాలనీ ట్రై చేస్తున్నాడు. ఆ మధ్య మంచి బలమైన పాత్ర వస్తే విలన్ గానూ చేయడానికి సిద్ధం అని స్టేటమెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా సీనియర్ హీరోలలో హిట్ కొట్టి చాలా కాలం అవుతున్న వాళ్ళలో రాజశేఖర్ చివరిగా ఉంటాడు. ఇక రాజా శేఖర్ అప్పుడెప్పుడో 2008 టైంలో గోరింటాకు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత ఇప్పటివరకు అంటే పదిహేనేళ్లుగా ఒక్క హిట్టు బొమ్మ లేదు.

రీ ఎంట్రీ తర్వాత కూడా సరైన సినిమా లేదు..

అయితే ఆ మధ్య కొన్నాళ్ళు గ్యాప్ ఇచ్చిన రాజశేఖర్ తర్వాత టైంలో “గరుడవేగ” లాంటి మంచి యాక్షన్ మూవీ తో రీ ఎంట్రీ ఇచ్చినా విజయాన్ని అందుకోలేదు. ఆ సినిమా విమర్శల ప్రశంసలు అందుకున్నా హిట్ కాలేదు. ఇక ఆ తర్వాత టైంలో రాజశేఖర్ పలు సినిమాల్లో హీరోగా నటించాడు. కానీ అందులో హీరోగా చేసిన సినిమాలు పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఇక రీసెంట్ టైంలో నితిన్ హీరోగా నటించిన ‘ఎక్స్ ట్రా ఆర్డినరీ’ లో స్పెషల్ రోల్ చేసినా పెద్దగా పేరు రాలేదు. అయినా సరే ఇప్పటికి హీరోగా నిలదొక్కుకోవాలని ధృడ నిశ్చయం తో రాజశేఖర్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇక తన అప్ కమింగ్ మూవీస్ లో ఇప్పుడు ఓ సాలిడ్ కంబ్యాక్ కి సెట్ అయ్యే కాన్సెప్ట్ తో గ్రాండ్ రీ ఎంట్రీకి సిద్ధం అవుతున్నట్లు టాలీవుడ్ లో స్ట్రాంగ్ గా బజ్ అయితే వినిపిస్తుంది.

కం బ్యాక్ మూవీ కోసం రెడీ..

అయితే తాజా సమాచారం ప్రకారం రాజసేఝార్ ఎలాగైనా కం బ్యాక్ హిట్ ఇవ్వాలని పక్కా ప్లాంయింగ్ తో ఉన్నారట. వింటేజ్ రాజశేఖర్(Rajasekhar) ను గుర్తు చేస్తూ ఓ భారీ గ్యాంగ్ స్టర్ డ్రామా రాజశేఖర్ చేయబోతున్నారట. మొన్నామధ్య రాజేంద్రప్రసాద్ తో సేనాపతి, జేడి చక్రవర్తి తో దయ లాంటి ఇంటెన్స్ వెబ్ సిరీస్ లు తీసిన డైరెక్టర్ “పవన్ సాదినేని” డైరెక్షన్ లో రాజశేఖర్ తో ఈ సినిమా ఉండబోతుంది అని సమాచారం. అయితే ఈ సినిమాలో హీరోయిన్స్ లేకుండా సాంగ్స్ లేకుండా కేవలం యాక్షన్ సీన్స్ తోనే నిండిపోయే ఈ సినిమా వింటేజ్ రాజశేఖర్ ను గుర్తు చేస్తూ తెరకెక్కే సినిమా అని అంటున్నారు. చాలా ఏళ్లుగా హిట్ అండ్ సరైన కం బ్యాక్ కోసం ఎదురు చూస్తున్న రాజశేఖర్ కి ఈ సారి అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమాతో మంచి కంబ్యాక్ సొంతం అయ్యే అవకాశం ఉందని చెప్పొచ్చు. మరి ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు