Rajasekhar : సైడ్ యాక్టర్ రేంజ్ కు పడిపోయిన యాంగ్రీ యంగ్ మ్యాన్

సినిమా ఇండస్ట్రీలో సాధారణంగా హీరోల కంటే హీరోయిన్లకే త్వరగా ఎక్స్పైరీ డేట్ వచ్చేస్తుంది. హీరోయిన్లు ఎంత క్రేజ్ ఉన్నా దశాబ్దం కంటే ఎక్కువగా ఇండస్ట్రీలో కొనసాగలేరు. కానీ హీరోలు మాత్రం 60 ఏళ్ల వయసు పైబడినప్పటికీ కుర్ర హీరోయిన్లతో రొమాన్స్ చేస్తూ స్టార్ హీరోలుగా కొనసాగుతారు. అయితే హీరోల్లో ఇది కూడా అందరికీ సాధ్యమయ్యే పని కాదు. కొంతమంది హీరోలు మాత్రమే ఏజ్ తో సంబంధం లేకుండా స్టార్ డంను మెయింటైన్ చేయగలుగుతారు. వాళ్లు అలా కొనసాగడానికి రీజన్ ఏదైనాప్పటికీ ఫ్యాన్ బేస్ మాత్రం రోజురోజుకు పెరగడమే తప్ప తరగడం ఉండదు. అయితే మరి కొందరు హీరోలకు మాత్రం ఏజ్ పెరిగే కొద్దీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం, వరుస సినిమాలతో దూసుకెళ్తున్న తమ తోటి హీరోలు ఇచ్చే పోటీని తట్టుకొని నిలబడడం కష్టమవుతుంది. ఫలితంగా స్టార్ హీరోల నుంచి సైడ్ యాక్టర్లకు వాళ్ల రేంజ్ పడిపోతుంది. తాజాగా యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ పరిస్థితి కూడా అలాగే ఉంది.

అప్పుడు “ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్”లో కీ రోల్…
ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగిన రాజశేఖర్ ఇప్పుడు సపోర్టింగ్ రోల్స్ కే పరిమితం అయిపోతున్నారు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ సీనియర్ హీరో ఆ మధ్య హీరోగా చేసిన ప్రయత్నాలన్నీ బెడిసి కొట్టాయి. దీంతో “ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్”తో సపోర్టింగ్ యాక్టర్ గా కొత్త టర్న్ తీసుకున్నారు. ఈ సినిమాలో కీ రోల్ చేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రీ ఎంట్రీ ఇచ్చాడు రాజశేఖర్. అయితే నితిన్ హీరోగా నటించిన ఈ సినిమాలో రాజశేఖర్ కు పెద్దగా ఇంపార్టెన్స్ లేని పాత్ర దక్కడం గమనార్హం. ఈ సినిమాలో ఆయన పాత్ర కీలక పాత్రకు తక్కువ, గెస్ట్ రోల్ కు వేస్ట్ అన్నట్టుగా ఉంటుంది. మొత్తానికి ఇందులో ఏమాత్రం ఇంపార్టెన్స్ లేని పాత్రను చేసి తన అభిమానులకు నిరాశే మిగిల్చాడు రాజశేఖర్. మరోవైపు తన తోటి హీరోను స్టార్ హీరోలుగా, లేదంటే విలన్లుగా ఇండస్ట్రీని దున్నేస్తుంటే, రాజశేఖర్ మాత్రం ఔట్ డేటెడ్ అయిపోతున్నారు. ఇప్పుడు ఈ హీరో మరో యంగ్ హీరోకు తండ్రిగా నటించే సాహసం చెయ్యడానికి రెడీ అవుతున్నాడు.

ఇప్పుడు శర్వాకు తండ్రిగా రాజశేఖర్…
అప్పుడేమో ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాతో ఎక్స్ట్రా డోస్ నిరాశను అందుకున్న ఈ సీనియర్ హీరో ఇప్పుడేమో యంగ్ హీరో శర్వానంద్ కు తండ్రిగా నటించడానికి రెడీ అయ్యాడు. శర్వానంద్ ప్రస్తుతం తన 35వ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. నెక్స్ట్ “లూజర్” వెబ్ సిరీస్ ఫేమ్ అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో శర్వానంద్ 36వ సినిమా రూపొందనుంది. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాలో శర్వానంద్ సరసన మాళవిక నాయర్ హీరోయిన్ గా కనిపించనుంది. పిరియాడిక్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో శర్వానంద్ కి రాజశేఖర్ తండ్రిగా కనిపించబోతున్నట్టు సమాచారం. దీని గురించి ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. కానీ ఫిలింనగర్ సర్కిల్స్ లో ఈ వార్త జోరుగా షికార్లు చేస్తోంది. మరి ఈ సినిమాతోనైనా రాజశేఖర్ కెరీర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి టర్న్ తీసుకుంటుందేమో చూడాలి. ఈ సినిమా ఫలితంపైనే యాంగ్రీ యంగ్ మాన్ సినీ కెరీర్ ఆధారపడి ఉందనేది నిజం.

- Advertisement -

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు