Chari 111 : వెన్నెల కిషోర్ కావాలనే ప్రమోషన్స్ కు అటెండ్ అవ్వట్లేదా?

టాలీవుడ్ లో కమెడియన్లు హీరోలుగా మారాలనుకోవడం కొత్త విషయం ఏమీ కాదు. ఇక కమెడియన్ గా సత్తా చాటి, హీరోగా ఎంట్రీ ఇవ్వాలి అనుకునే వారికి అవకాశాలకు కూడా కొదవేం ఉండదు. కానీ హీరో అవ్వాలి అనుకోగానే సరిపోదు, దానికి తగ్గ ప్రయత్నాలు కూడా చేయాలి. ప్రయత్నం అనగానే కేవలం సరైన డైరెక్టర్, కంటెంట్ మాత్రమే కాదు. సినిమా మొదలైన దగ్గర్నుంచి థియేటర్లలో రిలీజ్ అయ్యేదాకా హీరోగా మారాలనుకుంటున్న కమెడియన్ కూడా అన్ని విషయాల్లోనూ ముందుండి సినిమాను ముందుకు తీసుకెళ్లాలి. ముఖ్యంగా ప్రమోషన్స్ విషయంలో వీళ్ళు ఎంత చురుగ్గా ఉంటే సినిమా అంత ఎక్కువ మంది ఆడియన్స్ కి చేరవవుతుంది. కానీ తాజాగా ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో వస్తున్న వార్తలు చూస్తుంటే వెన్నెల కిషోర్ కు ఈ విషయాన్ని ప్రత్యేకంగా ఎవరైనా గుర్తు చెయ్యాలేమో అన్పిస్తోంది.

“చారి 111” ప్రమోషన్స్ కు హీరో దూరం
టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ హీరోగా నటిస్తున్న తాజా మూవీ “చారి 111”. ఈ సినిమాలో వెన్నెల కిషోర్ కు జోడిగా తమిళ హీరోయిన్ సంయుక్త విశ్వనాథన్ నటిస్తోంది. రాహుల్ రవీంద్రన్, గోల్డీ నిస్సి కీలక పాత్రలో నటించగా, ఈ మూవీని బర్కత్ స్టూడియోస్ బ్యానర్ పై అదితి సోనీ నిర్మిస్తున్నారు. టీజీ కీర్తి కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ మార్చ్ 1న థియేటర్ల రాబోతోంది. అయితే ఈ సినిమా ప్రమోషన్ల విషయంలో వెన్నెల కిషోర్ మొండి చేయి చూపిస్తున్నట్టుగా ఫిలిం సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. హీరోగా సినిమా చేసేయాలనే సరదా, కోరిక మాత్రమే ఉంటే సరిపోదు. ఆ సినిమా ప్రమోషన్లకు సరిపడా టైం కేటాయించాలి. లేదంటే కమెడియన్ నుంచి హీరోగా మారుతున్న అతనికేం పెద్దగా నష్టం రాకపోవచ్చు. కానీ నిర్మాతలు మాత్రం కుదైలైపోతారు. కనీసం ఈ సినిమా రిలీజ్ అవుతోంది అనే విషయం జనాలకు తెలియాలన్నా ప్రమోషన్స్ చేయాల్సిందే కదా. ఆ వార్తలకు తగ్గట్టుగానే సినిమా రిలీజ్ కు కేవలం కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నప్పటికీ, వెన్నెల కిషోర్ ఎక్కడా కనిపించడం లేదు.

ఇది కారణమా? సాకా?
వెన్నెల కిషోర్ ప్రస్తుతం టాలీవుడ్ లో బిజియెస్ట్ కమెడియన్ అన్న విషయం వాస్తవమే. అలాగని తాను హీరోగా నటిస్తున్న సొంత సినిమాను నెగ్లెక్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? పైగా కమెడియన్ గా ఉన్న ఆయనను హీరోగా మార్చడానికి ట్రై చేస్తున్న నిర్మాతలను ఇలా ఇబ్బంది పెట్టడం ఆయనకే కష్టాలను కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. అయితే వెన్నెల కిషోర్ ఇలా ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి ప్రమోషన్స్ లో లేదా ఇంటర్వ్యూలో పాల్గొనక పోవడానికి ఆయనకు ఉన్న సిగ్గే ముఖ్య కారణం అని అంటున్నారు. ముందుగా ఈ సినిమాను ఓటీటీలో అనుకున్నారట. కానీ ఆ తర్వాత నిర్మాతలు మనసు మార్చుకుని థియేటర్లోకి తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. కానీ నిర్మాతల బడా ప్రయత్నానికి ఈ కమెడియన్ సహకారమేమో ఇలా ఉంది. మరి వెన్నెల కిషోర్ సిగ్గు ఈ సినిమాకు ఎలాంటి రిజల్ట్ తెచ్చి పెడుతుందో చూడాలి. ఒకవేళ మూవీకి ఏమాత్రం నెగటివ్ టాక్ వచ్చినా ఎలాగూ నిర్మాతలకు నష్టాలు తప్పవు. కానీ ఆ నిందను మోయాల్సింది మాత్రం వెన్నెల కిషోరే.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు