Vennela Kishore: చైతూ సినిమాకు నో చెప్పిన వెన్నెల కిషోర్.. ఆ గొడవ నిజమేనా..?

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్లలో వెన్నెల కిషోర్ కూడా ఒకరు.. ఎంతోమంది యంగ్ హీరోలు సినిమాలలో నటిస్తూ తన అద్భుతమైన కామిడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ అలరిస్తున్న ఈయన ఇటీవల వరుస సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా మరింత బిజీగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వెన్నెల కిషోర్ కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో మరింత వైరల్ గా మారింది. ఈ మధ్యకాలంలో వెన్నెల కిషోర్ కి నాగచైతన్య హీరోగా నటిస్తున్న సినిమాలో అవకాశాలు వస్తున్నప్పటికీ కూడా ఆయన నటించడం లేదు.

ఇలా నాగచైతన్యను వెన్నెల కిషోర్ దూరం పెడుతూ వస్తూ ఉండడం గమనార్హం.దీంతో వీరిద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగిందా అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఇకపోతే ఇద్దరూ కలిసి నటించలేనంతగా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు జరిగాయి అనే విషయానికి వస్తే.. సమంతా కి వెన్నెల కిషోర్ మంచి స్నేహితుడు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఎప్పుడూ కూడా వీరిద్దరూ సరదాగా కాలక్షేపం చేస్తూ ఉంటారు. అంతేకాదు ఒకరు ఇబ్బందులను మరొకరు చర్చించుకుంటూ బెస్ట్ ఫ్రెండ్స్ గా కొనసాగుతున్నారు. ఇలాంటి సమయంలో తన ప్రాణ స్నేహితురాలు అయిన సమంతకు నాగచైతన్య విడాకులు ఇచ్చి ఆమె జీవితాన్ని నాశనం చేసాడని.. అందుకే వెన్నెల కిషోర్ కి నాగచైతన్య అంటే ఇష్టం లేదని.. ఈ కారణం చేతనే నాగచైతన్య సినిమాలలో వెన్నెల కిషోర్ నటించడానికి ఆసక్తి చూపించడం లేదని సమాచారం.

ఇకపోతే సమంతకు నాగచైతన్య విడాకులు ఇచ్చిన తర్వాత వెన్నెల కిషోర్.. నాగచైతన్య హీరోగా వచ్చిన కస్టడీ , బంగార్రాజు సినిమాలలో నటించారు. అయితే ఈ రెండు సినిమాలకు కూడా చైతన్య, సమంత విడాకులు తీసుకున్న తర్వాతనే నటించారు.కానీ ఈ సినిమాలకు వెన్నెల కిషోర్..వీరిద్దరూ విడాకులు తీసుకోక ముందే కమిట్ కావడం వల్ల ఇందులో నటించాల్సి వచ్చిందట. ఇక అందుకే ఇప్పటికీ నాగచైతన్య సినిమాలలో నటించే అవకాశాలు వస్తున్నా కూడా వెన్నెల కిషోర్ నటించడానికి ఏమాత్రం ఇష్టపడడం లేదని సమాచారం. ఏది ఏమైనా ఈ కారణం చేతనే వీరిద్దరూ కలిసి నటించడం లేదని తెలుస్తుంది.

- Advertisement -

Check Filmify for the Latest movie news in Telugu and updates from all Film Industries. Also, get the latest Bollywood news, new film updates, Celebrity latest Photos, and gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు