RGV: ఐశ్వర్య – వివేక్ ఒబెరాయ్ ఎఫైర్ పై ఓపెన్ అయిన వర్మ..!

ఇండియన్ సినీ ఇండస్ట్రీలో చాలామంది హీరో హీరోయిన్లు ప్రేమించుకోవడం సహజమే.. అయితే ఇందులో కొన్ని ప్రేమకథలు సుఖాంతం అయితే మరికొన్ని ప్రేమకథలు మధ్యలోనే ఆగిపోతాయి. అలా బాలీవుడ్ సెలబ్రిటీలైన ఐశ్వర్యరాయ్ – వివేక్ ఒబేరాయ్ లవ్ స్టోరీ కూడా ఇలాగే మధ్యలోనే ఆగిపోయింది. ఎంతో గాఢంగా ప్రేమించుకున్న వీరిద్దరూ పెళ్లి చేసుకోకుండానే తమ ప్రేమకు బ్రేకప్ చెప్పుకున్నారు. అయితే ఐశ్వర్య రాయ్ తో తన కొడుకు ప్రేమాయణం గురించి మొదట్లో ఏమీ తెలియ లేదు అని చెప్పిన సురేష్ ఒబేరాయ్ తాజాగా మాట్లాడుతూ ఎన్నో విషయాలను వెల్లడించారు..

సురేష్ ఒబేరాయ్ మాట్లాడుతూ.. చాలా విషయాలు నాకు అసలు తెలియనే తెలియదు. వివేక్ ఎప్పుడు నాతో ఓపెన్ గా చెప్పలేదు. రామ్ గోపాల్ వర్మ ఇదంతా నాతో తెలిపారు. రాంగోపాల్ వర్మ కంటే ముందు కూడా నాకు ఎవరో చెప్పినట్లు గుర్తు కానీ తను ఏదైతే చేస్తున్నాడో అది వెంటనే ఆపేయమని చెప్పాను. ఇక ఐశ్వర్యారాయ్ సల్మాన్ ఖాన్ తో బ్రేకప్ చెప్పిన వెంటనే వివేక్ తో ప్రేమలో పడింది. కానీ వీరి బంధం కూడా మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. ఎంతో త్వరగా బ్రేకప్ చెప్పుకున్నారు. కొన్నాళ్ళ తర్వాత హీరో అభిషేక్ బచ్చన్ ను పెళ్లాడి.. అమితాబ్ ఇంటికి కోడలిగా వెళ్ళింది ఐశ్వర్యారాయ్.

ఇక సురేష్ ఒబేరాయ్ విషయానికి వస్తే.. సహజ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన.. ఏడేళ్ల వయసులోనే తొలిసారి ఆడపిల్ల వేషంలో రంగస్థలంపై అడుగు పెట్టాడు. డాక్టర్ కావాలనుకుని యాక్టర్ అయి.. ఎన్నో సినిమాలలో విలక్షణ పాత్రలు పోషించారు. తెలుగులో కూడా మరణ మృదంగం వంటి సినిమాలు చేశాడు. ఇక ఇటీవలే యానిమల్ సినిమాలో కూడా ఒక కీలక పాత్రలో మెరిసాడు. ఇక ఈయన తనయుడే వివేక్ ఒబెరాయ్.. రక్త చరిత్ర, క్రిష్ 3 వంటి సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు . పోలీస్ ఫోర్స్ అనే వెబ్ సిరీస్ లో నటించాడు. అంతేకాదు పీ ఎమ్ నరేంద్ర మోడీ బయోపిక్ లో ప్రధాని మోడీ పాత్రను కూడా పోషించారు వివేక్ ఒబెరాయ్. మొత్తానికైతే ఐశ్వర్యరాయ్ వివేక్ తో ప్రేమలో పడింది అన్న విషయాన్ని వర్మ రివీల్ చేశారని చెప్పవచ్చు.

- Advertisement -

Check Filmify for the Latest movie news in Telugu and updates from all Film Industries. Also, get the latest Bollywood news, new film updates, Celebrity latest Photos, and gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు