Hanuman : ఎక్కడో కొడుతుందే… ఎంత ట్రై చేసినా స్టోరీ – హనుమాన్ కి సింక్ అవ్వడం లేదా?

ఫస్ట్ తెలుగు సూపర్ హీరో మూవీ “హనుమాన్” సినిమాపై కొత్త అనుమానాలు రేకెత్తిస్తోంది. మేకర్స్ ఎంత ట్రై చేసినా కూడా స్టోరీకి, హనుమాన్ కి సింక్ అవ్వట్లేదా? సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ సినిమా విషయంలో ఇంతకీ ఏం జరుగుతోంది? అనే వివరాల్లోకి వెళితే…

యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాబోతున్న సూపర్ హీరో మూవీ “హనుమాన్”. ఈ మూవీలో తేజ సజ్జ హీరోగా నటిస్తుండగా, అమృత అయ్యర్ ఆయనతో రొమాన్స్ చేయబోతోంది. వరలక్ష్మి శరత్ కుమార్ ఈ మూవీలో కీలక పాత్రలో కనిపించబోతోంది. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి రేసులో ఆలస్యంగా బరిలోకి దిగింది. సినిమా రిలీజ్ విషయంలో ఫుల్ క్లారిటీగా ఉన్న మేకర్స్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం “హనుమాన్” ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

అయితే ట్రైలర్ విజువల్స్ పరంగా అద్భుతంగా ఉంది. పవర్ కోసం ఎంతవరకు అయినా వెళ్లే విలన్ హీరోను ఎందుకు టార్గెట్ చేశాడు? ఒక బలహీనమైన వ్యక్తికి హనుమాన్ ఎలా తోడుగా నిలిచాడు? అనే ఆసక్తిని పెంచేసింది ట్రైలర్. అయితే తాజా సమాచారం ప్రకారం మేకర్స్ ఎంత ట్రై చేసినా సినిమాలో స్టోరీకి, హనుమాన్ కి సింక్ అవ్వట్లేదట. సినిమాలో హనుమాన్ ని ఎక్కడ రంగంలోకి దింపాలి? అనే విషయంలో మేకర్స్ చాలా కన్ఫ్యూజ్ అయ్యారనే విషయం బయటకు వచ్చింది. ఇక స్టోరీ రొటీన్ గా ఉండే అవకాశం ఉందని, స్టోరీ పరంగా ఈ మూవీకి మైనస్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అయితే విజువల్స్ మాత్రం అద్భుతంగా ఉండబోతున్నాయట.

- Advertisement -

నిజానికి ఈ సినిమాకు అనుకున్న కథ ఒకటనీ, కానీ తరువాత చాలా మార్పులు చేర్పులు చేసి, సినిమాను పూర్తి చేశారని టాక్ నడుస్తోంది. దానికి కారణం ప్రభాస్ “ఆది పురుష్” మూవీ. రీసెంట్ గా “ఆది పురుష్” మూవీ విడుదలైన విషయం తెలిసిందే. కానీ విజువల్స్ పరంగా ఈ మూవీ ఏమాత్రం ఆకట్టుకోలేకపోవడంతో సినిమాపై భారీ ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఆ విమర్శలను చూసిన తర్వాత “హనుమాన్” మేకర్స్ అలర్ట్ అయ్యారు.

అప్పటిదాకా వచ్చిన అవుట్ పుట్ ను పక్కనపెట్టి తమ సినిమాకు కూడా అలాంటి నెగటివ్ ఎఫెక్ట్ రాకుండా చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగానే ఈ సినిమా విఎఫ్ఎక్స్ పై ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశారు. అప్పటివరకు అనుకున్న బడ్జెట్ ఒకటైతే, దానికి నాలుగింతలు ఖర్చు పెట్టి విజువల్స్ పరంగా మంచి ఫలితం వచ్చేలా చూసుకున్నారు. సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయినప్పటికీ ఇంత ఆలస్యంగా “హనుమాన్” థియేటర్లలోకి రావడానికి ఇదే రీజన్. అయినప్పటికీ స్టోరీలో హీరోను వెనకే ఉండి నడిపించే “హనుమాన్”ను సినిమాలో ఎక్కడ, ఎలా బయటకు తీసుకురావాలన్న అంశం మాత్రం సింక్ కాలేదట.

అలాగే ముఖ్యంగా సినిమాలో హనుమాన్ ఉంటాడని ట్రైలర్ లో కనిపించింది. దీంతో ఇదో భక్తిరసమైన సినిమా అని, పండుగ టైంలో ఇలాంటి భక్తి సినిమాలకు వెళ్లాలని అనుకుంటారు. కానీ, హనుమాన్ అలాంటి భక్తిరసమైన సినిమా కాదని తెలుస్తుంది. అలాగే సినిమా చూసిన తర్వాత మైథాలజీకల్ ను తప్పు తొవ పట్టించారు అనే విమర్శలు కూడా రావొచ్చు అని తెలుస్తుంది. ఇలాంటివి రాకుండా, “హనుమాన్” మేకర్స్ ఈ విషయాన్ని ఎలా మానేజ్ చేయబోతున్నారో చూడాలి మరి.

Check Filmify for the Latest movie news in Telugu and updates from all Film Industries. Also, get the latest Bollywood news, new film updates, Celebrity latest Photos, and gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు