Salaar: సలార్ దెబ్బకి ఆగిపోయిన బుక్ మై షో..!

ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా , శృతిహాసన్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం సలార్.. డిసెంబర్ 22వ తేదీన గ్రాండ్గా పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇప్పటికే 22 తేదీ అర్ధరాత్రి 1:00 గంటల నుండి బెనిఫిట్ షోలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే టికెట్లు బుక్ చేసుకోవడానికి అభిమానులు పోటీపడ్డారు. ఇక లక్షలాది మంది ఒకేసారి ప్రయత్నం చేయడంతో బుక్ మై షో యాప్ కాస్త క్రాష్ అయ్యింది.

ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనే కాన్ఫిడెన్స్ చిత్ర బృందంలో ఏర్పడింది. అందుకేనేమో సినిమాకి పెద్దగా ప్రమోషన్స్ కూడా చేయలేదు. కానీ తాజాగా అడ్వాన్స్ బుకింగ్స్ తో వస్తున్న స్పందన చూస్తే మాత్రం ఈ సినిమాకిగా ప్రమోషన్స్ అవసరం లేదనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

మరొకవైపు హిందీ, తమిళ్ , కన్నడ భాషలలో ఈ సినిమాని బుక్ మై షో లో అడ్వాన్స్ బుకింగ్స్ కోసం వదలగా.. మరోవైపు టికెట్ రేట్లు పెంచుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా నిర్మాతలకు పర్మిషన్ ఇచ్చింది. ఇక ఇప్పుడు అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రెండు ప్రభుత్వాల నుంచి పర్మిషన్ వచ్చిన తర్వాతే బుక్ మై షో లో ఆన్లైన్ బుకింగ్ ఓపెన్ చేశారు.ఇకపోతే ప్రభాస్ సినిమా అంటే.. ఇక్కడ అభిమానంతో పని లేకుండా ఆయన సినిమా కోసం ఎదురు చూసే వారి సంఖ్య ఎక్కువే.. ఈ క్రమంలోని ఆన్లైన్ బుకింగ్స్ కోసం ప్రభాస్ అభిమానులతో పాటు రెగ్యులర్ సినీ లవర్స్ కూడా టికెట్లు బుక్ చేసుకోవడానికి పోటీపడ్డారు. ఇలా లక్షలాదిమంది ఒకేసారి ట్రై చేయడంతో బుక్ మై షో ఆప్ కాస్త ఆగిపోయినట్లు తెలుస్తోంది.

- Advertisement -

ఇక దీన్ని బట్టి చూస్తే ఆన్లైన్లో సలార్ టికెట్ల కోసం ఎంత ఫ్లోటింగ్ వచ్చిందో అంచనా వేయవచ్చు. ఇకపోతే దీనిపై ప్రభాస్ అభిమాని ట్విట్టర్ లో పోస్ట్ చేయగా.. బుక్ మై షో టీం తాజాగా రిప్లై ఇచ్చింది… అంతరాయానికి క్షమాపణలు చెబుతూ సమస్యను సాల్వ్ చేస్తున్నట్లుగా కూడా తెలిపింది. ఇకపోతే ఈ సినిమా టికెట్ ధరల విషయానికి వస్తే సింగిల్ థియేటర్స్ లో రూ.175 నుంచి రూ.250 వరకు ఉంటే.. మల్టీప్లెక్స్ లో రూ.400 నుంచి రూ.470 వరకు టికెట్ ధరలు ఉన్నాయి. భారీ అంచనాల మధ్య రిలీజ్ కాబోతున్న ఈ సినిమా మరి ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Check Filmify for the Latest movie news in Telugu and updates from all Film Industries. Also, get the latest Bollywood news, new film updates, Celebrity latest Photos, and gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు