Devara: బీజీఎమ్ తోనే ఫాన్స్ ను షేక్ చేస్తున్న దేవర ప్రోమో సాంగ్..!

Devera.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం దేవర.. ఈ సినిమాని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా నుంచి ప్రోమో సాంగ్ ను రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఎలాంటి లిరిక్స్ లేకుండా కేవలం బిజిఎం తోనే వణికించేలా ఉన్న ఈ ఫియర్ సాంగ్ ప్రోమో చూస్తుంటే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఏదో పెద్దగానే ప్లాన్ చేశాడని అనిపిస్తోంది. ఇండియన్ సినిమాలో మైల్ స్టోన్ మార్క్ దేవర క్రియేట్ చేస్తుందనే విషయాన్ని పదేపదే చెబుతూ వస్తున్నారు మేకర్స్.. ఇక అచ్చం అలాగే ఉన్న ఈ 14 సెకండ్ల నిడివి ఉన్న వీడియోలో ఎన్టీఆర్ సముద్రంలో బోట్ పై అలా వస్తూ ఉంటే.. చూడడానికి రెండు కళ్ళు చాలవు అన్నట్లుగా ఆ స్టన్నింగ్ లుక్స్ సూపర్ గా అదిరిపోయాయి..

బీట్ తోనే దద్దరిల్లేలా చేస్తున్న అనిరుద్..

Devara: Devara's promo song is shaking fans with BGM..!
Devara: Devara’s promo song is shaking fans with BGM..!

ముఖ్యంగా అనిరుద్ బ్యాక్ గ్రౌండ్ సౌండ్ తోనే బీట్ మొత్తం దద్దరిల్లింది.. పూర్తి సాంగ్ ఎలా ఉండబోతుందనే క్యూరియాసిటీ కూడా ఇప్పుడు ఆడియన్స్లో భారీగా పెరిగిపోయింది.. ముఖ్యంగా ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందిస్తున్నారని తెలిసినప్పటి నుంచి ఈ సినిమా రేంజ్ భారీగా మారిపోయింది.. ఇందుకు ప్రధాన కారణం ఆయన నుండి వచ్చిన గత చిత్రాలే అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆయన మ్యూజిక్ అందించిన చిత్రాల విషయానికొస్తే.. లియో, విక్రమ్, జైలర్ సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ ను ఇప్పటికీ షేక్ చేస్తూనే ఉన్నాయి. అందుకే ఇప్పుడు దేవర సినిమా కోసం అనిరుద్ అందించబోయే మ్యూజిక్ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయని చెప్పవచ్చు.

తారక్ బర్తడే స్పెషల్ అదే..

తాజాగా అందులో భాగంగానే దేవర మూవీ నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అప్డేట్ వచ్చేసింది. మే 19న ఎన్టీఆర్ పుట్టినరోజు కాబట్టి ఒక రోజు ముందుగానే ఈ పాట ఆన్లైన్లో విడుదల కానుంది అని సమాచారం. మొత్తానికి అయితే బీజీఏం తోనే ఫ్యాన్స్ ను వణికిస్తున్న అనిరుద్.. మరి పాట పూర్తిగా విడుదలైన తర్వాత ఏ రేంజ్ లో ఈ పాట సోషల్ మీడియాలో రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

- Advertisement -

ఎన్టీఆర్ సినిమాలు..

ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తున్నారు.. ఇందులో ఈయన సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించినమే కాదు ఈ సినిమా ద్వారా ఆమె తొలిసారి తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. ఎన్టీఆర్ ఈ సినిమా తరువాత కేజీఎఫ్ సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. మే 19వ తేదీన ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి అప్డేట్ ను ఆరోజు విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ఇక ఈ సినిమా తర్వాత మరో యంగ్ డైరెక్టర్ ను ఆయన లైన్ లో పెట్టినట్లు వార్తలు వినిపిస్తూ ఉండడం గమనార్హం.RRR సినిమాతో గ్లోబల్ స్టార్ గా పేరు దక్కించుకున్న ఈయన దేవర సినిమాతో ఎలాంటి రికార్డు క్రియేట్ చేస్తారో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు