Devara : ఫియర్ సాంగ్ బ్రేక్ చేయాల్సిన రికార్డులు ఇవే..! ఆ హీరో రికార్డ్స్ పైనే గురి!

Devara : టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ సినిమాల్లో “దేవర” కూడా ఒకటి. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా భాషల్లో రూపొందుతుండగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ 250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే సినిమా నుండి రిలీజ్ అయిన టీజర్ ఓ రేంజ్ రెస్పాన్స్ ని తెచ్చుకుని, సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని నందమూరి అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి అందరూ ఎదురుచూస్తున్న ఓ క్రేజీ అప్డేట్ వచ్చేసింది. అదే ఫస్ట్ లిరికల్ సాంగ్. ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ గా దేవర నుండి ఫియర్ సాంగ్ పేరుతో ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఇక అనిరుధ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తుండడంతో సినిమాపై అంచనాలు కూడా ఓ రేంజ్ లో ఉన్నాయి. ఇక మే 19న ఎన్టీఆర్ బర్త్ డే సందర్బంగా రిలీజ్ చేయబోతున్న సాంగ్ కి సంబంధించి చిన్న ప్రోమో కూడా రాగా, నెట్టింట ట్రెండ్ అవుతుంది. ఇక దేవర ఫస్ట్ లిరికల్ యూట్యూబ్ లో బ్రేక్ చేయాల్సిన సాంగ్స్ రికార్డ్స్ పైనే నెటిజన్ల ద్రుష్టి ఉంది.

These are the records that Devara Fear song has to break..!

ఫియర్ సాంగ్ బ్రేక్ చేయాల్సిన రికార్డులివే!

ఇక దేవర (Devara) ఫియర్ సాంగ్ మే 19న రిలీజ్ కాబోతుండగా 24 గంటల్లో ఆయా స్టార్ హీరోల సాంగ్స్ పలు రికార్డులు సృష్టించాయి. వాటిని బ్రేక్ చేసేలా దేవర సాంగ్ రెడీ అవుతుంది. ఇక ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉండగా దేవర సాంగ్ రిలీజ్ అయిన తర్వాత 24 గంటల్లో యూట్యూబ్ లో రికార్డులతో దుమ్ము లేపాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి టాలీవుడ్ లో రిలీజ్ అయిన లిరికల్ సాంగ్స్ లో , లిరికల్ వీడియోల పరంగా హైయెస్ట్ వ్యూస్ అండ్ లైక్స్ ని అందుకున్న సాంగ్స్ ను గమనిస్తే 24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ ను అందుకున్న సాంగ్ రికార్డ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ ‘గుంటూరు కారం’ లోని ‘దమ్ మసాలా సాంగ్’ పేరిట ఉంది. ఆ సాంగ్ 24 గంటలలో 17.42 మిలియన్ వ్యూస్ ని అందుకుంది. ఇక అదే విధంగా 24 గంటల్లో హైయెస్ట్ లైక్స్ రికార్డ్ కూడా మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమాలోని ‘కళావతి’ సాంగ్ 806.3K లైక్స్ తో టాప్ లో ఉంది.

- Advertisement -

సౌత్ రికార్డులపైనా గురి?

ఇక సౌతిండియా వ్యాప్తంగా చూసుకుంటే దళపతి విజయ్ సాంగ్స్ టాప్ లో ఉన్నాయి. దళపతి విజయ్ GOAT మూవీలో విజిల్ పోడు సాంగ్ 24.88 మిలియన్స్ వ్యూస్ 24 గంటల్లో సాధించింది. లైక్స్ పరంగా బీస్ట్ లోని అరబిక్ కతు సాంగ్ టాప్ లో ఉంది. ఈ సాంగ్ 24 గంటల్లో 2.2 మిలియన్ లైక్స్ సొంతం చేసుకుంది. ఈ రికార్డ్ ని దేవర బ్రేక్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అది సెన్సేషన్ అవుతుందని చెప్పొచ్చు. ఇక అనిరుద్ మ్యూజిక్ కి తమిళంలో విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఈ నేపథ్యంలో అన్ని భాషలలో కలిపి ఖచ్చితంగా సౌత్ ఇండియాలో హైయెస్ట్ వ్యూస్, లైక్స్ రికార్డ్ ని దేవర ఫస్ట్ సింగిల్ బ్రేక్ చేస్తుందని తారక్ అభిమానులు భావిస్తున్నారు. మరి దేవర ఫియర్ సాంగ్ ఏ రేంజ్ లో ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందో, సాంగ్ రిలీజ్ తర్వాత సినిమాపై ఏ రేంజ్ అంచనాలను పెంచేస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు