Ridhima Pandit : ఆ నిర్మాత ఎంతో వేధించాడు.. క్యాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బుల్లితెర నటి…

Ridhima Pandit : సినిమా ఇండస్ట్రీ లో గత కొంతలంగా క్యాస్టింగ్ కౌచ్ పేరుతో పలువురు నటీనటులు ఇబ్బందులు ఎదురుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా బాలీవుడ్ లో ఇది కామన్ అయిపొయింది. అయితే అక్కడ ఒకేసారి బయటపడకుండా, ఒక న్యూస్ వైరల్ కాగానే అలాంటి న్యూస్ మరొకటి వచ్చేస్తుంది. ఎందుకంటే కొన్ని రకాల వార్తలు బయటికి రావాలంటే సమయం పడుతుంది. ఇదిలా ఉండగా రీసెంట్ గా హిందీ సీరియల్ నటి కృష్ణ ముఖర్జీ క్యాస్టింగ్ కౌచ్ పై పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. షూటింగ్ సమయంలో సెట్స్ లో ఓ నిర్మాత తనను వేధిస్తున్నారని ఆరోపించింది. ఈ న్యూస్ హిందీ బుల్లితెరపై సంచలనం అయింది. ఇక తాజాగా మరో వార్త వచ్చింది. క్యాస్టింగ్ కౌచ్ పై ఆరోపణలు చేసిన కృష్ణ ముఖర్జీ కి మద్దతుగా మరో నటి ‘రిధిమా పండిట్’ ఇండస్ట్రీలోని ఎదుర్కుంటున్న ఇబ్బందులను పలు వివాదాలను బయటపెట్టింది.

కృష్ణ ముఖర్జీ కి ఎదురైనా పరిస్థితే నాకు వచ్చింది – రిధిమా

బాలీవుడ్ లో సుశాంత్ రాజ్ పుత్ సింగ్ మరణించినప్పటి నుండి పలు వివాదాస్పద అంశాలు, ముఖ్యంగా క్యాస్టింగ్ కౌచ్ పై రెగ్యులర్ గా సినిమాలు వస్తూ ఉన్నాయి. రీసెంట్ గా హిందీ సీరియల్ నటి కృష్ణ ముఖర్జీ క్యాస్టింగ్ కౌచ్ పై చేసిన ఆరోపణల్లో సెట్ లో ఓ నిర్మాత తనను వేధిస్తున్నారని ఆరోపించగా, దానికి మద్దతుగా మరో నటి రిద్ధిమా పండిట్ ఇండస్ట్రీలోని విషయాలను బయటపెట్టింది. గతంలో ఓ నిర్మాత కూడా తనను చాలా వేధించాడని రిధిమా సింగ్ చెప్పుకొచ్చింది. అంతే కాదు మానసికంగా, శారీరకంగా వేధింపులకు పాల్పడ్డాడని అన్నారు. కృష్ణ ముఖర్జీ కి జరిగింది చాలా భయంకరమైనదని, అలా ఎవరికీ జరగకూడదని చెప్పింది. అలాగే కుందన్ సింగ్ లాంటి నిర్మాతలు ఇలాంటి అమాయక నటీనటులను లోబరుచుకుని వారి జీవితాలను నాశనం చేస్తున్నారని, వారిని డిప్రెషన్ కు గురయ్యేలా చేస్తున్నారని, అలాగే మనలో ఎవరికైనా ఇలా జరగొద్దు కాబట్టి, అందరం కృష్ణకు తోడుగా నిలబడదాం” అని చెప్పుకొచ్చింది.

అమ్మను చూసేందుకు కూడా అనుమతివ్వలేదు – రిధిమ పండిట్

ఇక కృష్ణ ముఖర్జీ కి సపోర్ట్ చేస్తూ తన విషయాలని గురించి కూడా రిధిమా(Ridhima Pandit) చెప్పుకొచ్చింది. బుల్లితెరపై ఇలాంటి ఘటనలు చాలానే జరుగుతున్నా, చాలా మంది బయటకు మాట్లాడేందుకు భయపడుతున్నారని రిద్ధిమ అన్నారు. గతంలో తనకు ఎదురైన పరిస్థితిపై మాట్లాడుతూ.. తాను పనిచేస్తున్న ఓ షో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కూడా తనను వేధింపులకు గురిచేశాడని తెలిపింది.. అనారోగ్యంతో ఉన్న తన తల్లిని చూసేందుకు ఆసుపత్రికి వెళ్లేందుకు కూడా అనుమతి ఇవ్వలేదని తెలిపింది. తన తల్లి ఆరోగ్యం బాగలేక ఆసుపత్రిలో చేర్పించామని, ఐసీయూలో ఉన్న తన తల్లిని చూసేందుకు విజిటింగ్ అవర్స్ చాలా తక్కువ సమయం ఉండేదని, అందుకని షూటింగ్ కి ఉదయం 7 గంటలకు వచ్చి సాయంత్రం త్వరగా వెళ్లిపోతానన్నా అనుమతి ఇచ్చేవాడు కాదని, బయటకు చెప్పాలంటే అప్పట్లో తనపై రూమర్స్ క్రియేట్ చేశారని అన్నారు. ఇక ఈ న్యూస్ హిందీ లో ఇప్పుడు వైరల్ గా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు