Kshitij Jarapkar : ప్రముఖ మరాఠీ దర్శకుడి ఆకస్మిక మరణం.. ఇండస్ట్రీ ప్రముఖులసంతాపం

Kshitij Jarapkar : మరాఠీ సినిమా ఇండస్ట్రీ నుండి ఒక విచారకరమైన వార్త వచ్చింది. మరాఠీ ఇండస్ట్రీ లో ప్రముఖ దర్శక నటుడు క్షితిజ్ జరాప్కర్ ఆకస్మికంగా మృతి చెందినట్లు సమాచారం వచ్చింది. ఈ వార్త మరాఠి ఇండస్ట్రీ ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. క్షితిజ్ జరాప్కర్ మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక క్షితిజ్ జరాప్కర్ తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలియకపోవచ్చు, కానీ మరాఠీ లో పలు చిత్రాలకు నటుడుగా, దర్శకుడిగా, రచయిత గా కూడా పని చేసారు. ఏకులతి ఏక్, ‘ఐడియా చి కల్పన’ వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నటుడు క్షితిజ్ జరాప్కర్ కేవలం 54 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచాడు. ఈ మధ్యనే క్షితిజ్ జరాప్కర్ నటించిన అదితి సారంగధర్ డ్రామా టెలివిజన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆయన మృతి పట్ల మరాఠీ ఇండస్ట్రీ మొత్తం సంతాపం వ్యక్తం చేస్తోంది.

క్యాన్సర్ తో మృతి..

మరాఠీ లో ఎంతో పేరున్న నటుడు క్షితిజ్ జరాప్కర్ గొమ్ దా బెరిజ్, థెన్ గా, ఏకులటి ఏక్, ఐడియా చి కల్పన వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ఈ చిత్రాలలో కొన్నిటికి దర్శకత్వం దహించడం జరిగింది. ఈరోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో పోరాడుతున్నారు. ఇక దర్శక నటుడు క్షితిజ్ జరాప్కర్ తనకున్న క్యాన్సర్ జబ్బు కారణంగానే క్షితిజ్ మృతి చెందినట్లు సమాచారం. ఇక ఈరోజు దాదర్‌ లోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారని సమాచారం. ఇక నటుడు క్షితిజ్ తనకు వచ్చిన ఆర్గాన్స్ మొత్తం క్షీణించిన తరువాత, అతను గుండెపోటుకు గురయ్యాడు. మధ్యాహ్నం 1:30 నుండి 2:00 గంటల వరకు అంత్యక్రియల కోసం దాదర్ శివాజీ పార్క్‌లోని ఆయన నివాసంలో ఆయన భౌతికకాయాన్ని ఉంచుతారు. అనంతరం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారని సమాచారం.

దర్శకుడిగానూ ముద్ర..

ఇక నటుడిగా క్షితిజ్ జరాప్కర్(Kshitij Jarapkar) నటించిన చాలా సినిమాలు మరాఠీ ప్రేక్షకుల మదిలో మెదిలాయి. అయితే అతను గోమ్ దా బెరిజ్, బికో ఖే నకలత్ వంటి అనేక చిత్రాలకు రచన మరియు దర్శకత్వం కూడా వహించాడు. అదేవిధంగా తేంగా, ఏకులటి ఒక వంటి సినిమాల్లో నటుడిగా కూడా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. తన అనేక సినిమాలు మరియు నాటకాల తో పాటు, అతని దర్శకత్వం, రచన ప్రేక్షకులను మెప్పించాయి. ఇక చాలా రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షితిజ్ అయితే మే 5వ తేదీ ఆదివారం ఉదయం 10:30 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. ఇక క్షితిజ్ స్టడీయస్ నట్‌గా, స్టడీ డైరెక్టర్‌గా పేరు పొందాడు. అందుకే నేడు మరాఠీ సినిమా, రంగస్థలం నేర్చుకోని నట్‌ ను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక క్షితిజ్ జరాప్కర్ యొక్క కథలలో, సినిమాలలో ఎక్కువగా సందేశాన్ని అందించేవి ఉండేవి. ఆయన మృతి పట్ల మరాఠీ ఇండస్ట్రీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు