Shahid Kapoor: ప్రేమ పేరుతో ఇద్దరి చేతిలో మోసపోయాను..!

Shahid Kapoor.. ప్రముఖ బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ అందరికీ సుపరిచితమే.. తన నటనతో అద్భుతమైన పర్ఫామెన్స్ తో అటు నార్త్ ఇటు సౌత్ అందరిలో కూడా ఒక ప్రత్యేక మార్క్ క్రియేట్ చేసుకున్న ఈయన తాజాగా ప్రేమ పేరుతో ఇద్దరమ్మాయిల చేతిలో మోసపోయాను అంటూ హాట్ కామెంట్స్ చేశారుఅయితే షాహిద్ ఎవరి చేతిలో ప్రేమ పేరిట మోసపోయారో ఇప్పుడు చూద్దాం.

Shahid Kapoor: I was cheated by two people in the name of love..!
Shahid Kapoor: I was cheated by two people in the name of love..!

ప్రేమలో విఫలమైనా.. ఉన్నత శిఖరాలకు చేరిక..

ప్రేమ.. రెండు అక్షరాల పదం.. కానీ ఇందులో పడ్డామంటే బయటకు రావడం కష్టం.. కొంతమంది ప్రేమించుకొని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుని జీవితాంతం సంతోషంగా ఉంటే.. మరి కొంతమంది ప్రేమలో విఫలమయి చావు అంచుల వరకు వెళ్లిన వారు కూడా ఉన్నారు. మరి కొంతమంది ప్రేమ లేకపోతే తాము లేమని.. తమకు నచ్చిన వారిని వదులుకోలేక లోకాన్నే విడిచిపెట్టిన వారు కూడా ఉన్నారు.. అంత గొప్పది ప్రేమ.. ఇకపోతే ఈ బాధని ఇప్పటి జనరేషన్ వాళ్ళు ఎక్కువగా అనుభవిస్తున్నారని చెప్పడంలో సందేహం లేదు. అయితే వాటి నుంచి బయటకు వచ్చి.. బాధలను దిగమింగుకొని ఉత్తమమైన మార్గంలో ఉన్నత శిఖరాలను అందుకున్న వారు కూడా చాలామంది ఉన్నారు.. అలాంటి వారిలో ప్రధమంగా వినిపించే పేరు షాహిద్ కపూర్.

కెరియర్ అలా మొదలు..

“ఇష్క్ విష్క్” అనే సినిమా ద్వారా హిందీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన షాహిద్ కపూర్.. ఆ తర్వాత పలు చిత్రాలలో నటించి ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు.. వివాహ్ సినిమాతో మంచి హిట్ అందుకొని తానేంటో నిరూపించుకున్న షాహిద్.. ఆ తర్వాత “జబ్ వుయ్ మెట్” భారీ బ్లాక్ బస్టర్ విజయం కావడంతో ఈ సినిమాతో తన రేంజ్ అమాంతం పెరిగిపోయింది.. దీంతో అభిమానులలో లవర్ బాయ్ గా మారిపోయాడు .ముఖ్యంగా లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. దీంతో వరుస పెట్టి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించి.. సినీ కెరియర్ లో వెనుతిరిగి చూడలేదు.

- Advertisement -

ప్రేమ పేరుతో మోసపోయిన షాహిద్ కపూర్..

ఇకపోతే కెరియర్ పరంగా ఉన్నతంగా జీవిస్తున్న షాహిద్ కపూర్ వ్యక్తిగతంగా మాత్రం ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.. తాజాగా ప్రముఖ నటి నేహా ధూపియా కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన బ్రేకప్ ల గురించి స్పష్టం చేశారు.. ఇంటర్వ్యూలో భాగంగా మీరు ఎన్నిసార్లు లవ్ లో మోసపోయారు అని నేహా అడగ్గా.. షాహిద్ మొదట నవ్వుకున్నా.. ఆ తర్వాత తనను ప్రేమ పేరుతో ఇద్దరు మోసం చేశారని చెప్పుకొచ్చారు.. ఇకపోతే రెండు సార్లు తాను ప్రేమలో విఫలం అయ్యానని.. కానీ వారి పేర్లు మాత్రం బయటకు చెప్పనని స్పష్టం చేశారు..

ఆ ఇద్దరు వారేనా..

అయితే షాహిద్ కపూర్ పేర్లు చెప్పకపోవడంతో నేహా ధూపియా మీరు డేటింగ్ చేసిన ఆ ఇద్దరు కరీనాకపూర్, ప్రియాంక చోప్రా కదా అని అడగ్గా.. దానికి షాహిద్ కపూర్ నేను పేర్లు చెప్పను.. మీరు వేరొక ప్రశ్న అడగండి అంటూ చెప్పుకొచ్చారు.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారుతోంది.ఇకపోతే ప్రేమలో రెండు సార్లు ఓడిపోయిన షాహిద్ కపూర్ ప్రస్తుతం మీరా రాజ్ పుత్ ను వివాహం చేసుకొని వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నారు.. అంతేకాదు ఈ జంటకి ఇద్దరు సంతానం కూడా కలరు ..అందులో ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు