Disha patani: బికినీలో సూర్యుడికే చెమటలు పట్టిస్తున్న లోఫర్ బ్యూటీ..!

Disha patani.. సోషల్ మీడియా వేదికగా చాలామంది హీరోయిన్లు తమ అందాల ఆరబోతతో యువతను ఆకట్టుకోవడమే కాదు ఇంస్టాగ్రామ్ లో హీట్ పెంచేస్తున్నారని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే లోఫర్ సినిమాతో తనకంటూ ఒక ఇమేజ్ సొంతం చేసుకున్న దిశా పటానీ తాజాగా థాయిలాండ్ బీచ్ ఒడ్డున అందాల సునామీ సృష్టించింది. తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. వాస్తవానికి అందాల వల విసరడంలో బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని తర్వాతే ఎవరైనా… సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ అందరిని అలరిస్తోంది.. అంతేకాదు ఇదే హాబీ గా పెట్టుకున్న ఈమె రోజుకొక గ్లామర్ ఫోటో షూట్ తో అలరిస్తూ ఉంటుంది.. ముఖ్యంగా హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకోవడంలో ముందు వరసలో ఉండే దిశాపటాని తరచూ బికినీలో కనిపిస్తూ అభిమానుల మదిలో మంట పెడుతోంది.

Disha patani: Loafer beauty sweating in the sun in a bikini..!
Disha patani: Loafer beauty sweating in the sun in a bikini..!

బికినీ ట్రీట్ తో సూర్యుడికే చెమటలు..

ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ అమ్మడు తన ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన ఫోటోలు మరొకసారి వైరల్ గా మారుతున్నాయి.. థాయిలాండ్ బీచ్ ఒడ్డున బికినీ వేసి హాట్ అందాలతో రెచ్చగొడుతుంది. గ్లామర్ డోస్ దట్టిస్తూ ఈ అమ్మడు ఎంజాయ్ చేసిన ఫోటోలు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు ఈమె అందాలు చూసి సూర్యుడే చెమటలు కక్కుతున్నాడు. మొత్తానికైతే ఈమె రొమాంటిక్ బాణాలు విసురుతూ రచ్చ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో మరింత వేడిని పుట్టిస్తున్నాయి..

దిశాపటాని సినీ కెరియర్..

దిశా పటాని సినీ కెరియర్ విషయానికి వస్తే 2016లో వచ్చిన ఎంఎస్ ధోని అన్ టోల్డ్ లవ్ స్టోరీ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన దిశా పటాని ఆ తర్వాత పలు చిత్రాలలో నటించింది. తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న తర్వాత భాగీ , భారత్, మలంగ్ లాంటి సినిమాలతో తన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటూ ఎప్పటికప్పుడు పరువాల విందు ఇస్తూ ఫాలోయింగ్ రెట్టింపు చేసుకుంటున్న దిశాపటానీ సోషల్ మీడియాలో మరింత క్రేజ్ సొంతం చేసుకుంది. యాక్టింగ్ కంటే ఎక్కువగా గ్లామర్, ఎఫైర్ వ్యవహారాలతోనే బాగా గుర్తింపు పొందిన దిశాపటానీ బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ తో డేటింగ్ వ్యవహారం వల్ల అప్పట్లో బాలీవుడ్ లో హాట్ టాపిక్ గాని నిలిచింది.. వీరి జంటగా తిరిగినా ఫోటోలు సోషల్ మాధ్యమాలలో తెగ వైరల్ అయ్యాయి.. దాంతో జనాలలో పలు చర్చలకు తావిచ్చారు ఈ జంట.

- Advertisement -

తెలుగు దర్శకుల దృష్టిలో పడడానికి..

ఇక లోఫర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దిశాపటానీ ఇక్కడి ఆడియన్స్ పల్స్ పట్టేసింది.. వెండితెరపై గ్లామర్ ట్రీట్ ఇస్తూ తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది.. ఇక ఇప్పుడు మరిన్ని తెలుగు సినిమాలలో అవకాశాలు సొంతం చేసుకోవడానికి గట్టిగానే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే ఈ గ్లామర్ డోస్ తో అయినా.. ఎలాగైనా సరే తెలుగు దర్శక నిర్మాతల దృష్టిలో పడి సినిమాలలో అవకాశాలు దక్కించుకోవాలని ప్రయత్నం చేస్తుంది.. మరి ఇకనైనా ఈమెకు అవకాశాలు వస్తాయో లేదో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు