Anjali Arora: సీతగా కచా బాదం బ్యూటీ.. సాయి పల్లవికి పోటీగా..!

Anjali Arora.. హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రంగా భావించే ఘట్టాలలో రామాయణం కూడా ఒకటి. ఇతిహాస గాథ ను తెరపై ఎవరు ఎన్నిసార్లు చూపించినా. ప్రేక్షకులు ఎన్నిసార్లు చూసినా..తనివి తీరనిది.. ఒక్కొక్కరు ఒక్కో విధానంలో ఈ సినిమాను తెరపై చూపించినా.. ఒకే కాన్సెప్ట్ తో ప్రేక్షకులను ఎప్పుడూ కూడా ఈ కథలు అలరిస్తూనే ఉంటాయి. ఈ క్రమంలోనే రామాయణ ఇతిహాసం మీద ఇప్పటికే ఎన్నో సినిమాలు తెరపై కనిపించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఒక సినిమా తెరపై ఉండగానే మరో సినిమా ఆ సినిమాకి పోటీగా రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారీ దర్శకత్వంలో రామాయణ్ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రన్బీర్ కపూర్ రాముడు పాత్రలో నటిస్తుండగా.. సీతగా సాయి పల్లవి ఎంపికయింది. ఇప్పటికే సీత పాత్రలో ఎంతోమంది హీరోయిన్స్ ను పరిశీలించగా చివరికి సాయి పల్లవి ఫైనల్ అవ్వడం గమనార్హం.

Anjali Arora: Kacha Badam Beauty as Sita.. Competing with Sai Pallavi..!
Anjali Arora: Kacha Badam Beauty as Sita.. Competing with Sai Pallavi..!

సాయి పల్లవికి పోటీగా..

ఈ సినిమా సెట్ పై ఉండగానే ఇప్పుడు మరో సినిమా అనౌన్స్మెంట్ జరిగింది.. అది కూడా రామాయణం ఇతిహాస గాధ నేపథ్యంలోనే తెరకెక్కుతున్నట్లు సమాచారం. శ్రీ రామాయణ కథ అనే పేరుతో ఈ సినిమాని హిందీలో అభిషేక్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. ప్రకాష్ మహోబియా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంజయ్ బందేలా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.. ఇక ఇందులో కచా బాదం పాటతో భారీ పాపులారిటీ దక్కించుకున్న అంజలి అరోరా సీతగా కనిపించనున్నట్లు సమాచారం. కరీనాకపూర్ లాక్ అప్ 1 ద్వారా పాపులారిటీ సంపాదించకున్న అంజలి అరోరా ఆ తర్వాత తన అద్భుతమైన నటనతో పలు చిత్రాలలో నటించి మెప్పించింది..

సీత పాత్రలో అంజలి అరోరా..

ఇకపోతే ఇప్పుడు సీత పాత్ర పోషించడం పట్ల తన అభిప్రాయాన్ని ఇంస్టాగ్రామ్ ద్వారా పంచుకుంది ఈ ముద్దుగుమ్మ.. అంజలి అరోరా మాట్లాడుతూ.. ఈ సినిమాలో సీత పాత్ర ఆఫర్ చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాను.. సీతాదేవి పాత్ర చాలా పవిత్రమైనది.. దానిని ఎవరు కూడా తిరస్కరించలేరు.. అయితే ఈ పాత్రకు నన్నే ఎందుకు ఎంచుకున్నారు అనే ఆసక్తితో నేను డైరెక్టర్ ని అడిగాను..ఆయన మాట్లాడుతూ.. మీతో సహా చాలామంది నటీమణులను షార్ట్ లిస్టు చేస్తాము.. అయితే ఈ పాత్రకు నువ్వు మాత్రమే న్యాయం చేయగలవని నమ్ముతున్నాము అంటూ ఆయన చెప్పారు.. ఇక అందుకే నాలో నేను ఆ పాత్రకు న్యాయం చేయగలను అని వారు నమ్మరు కాబట్టే కచ్చితంగా వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను అంటూ ఆమె చెప్పుకొచ్చింది.. గత నెలలో ఈ పాత్రకు నేను ఫైనల్ అవ్వగా అప్పటినుండి సీతాదేవికి సంబంధించిన వీడియోలు చూస్తున్నాను.. రామాయణ గాధకు సంబంధించి పుస్తకాలు చదువుతున్నాను.. వర్క్ షాప్ లకి హాజరవుతున్నాను అంటూ చెప్పుకొచ్చింది అంజలి అరోరా..

- Advertisement -

సాయి పల్లవిని ఢీ కొడుతుందా..

నాచురల్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి ఒకవైపు సీత పాత్రలో నటిస్తుండగా.. ఇప్పుడు అంజలి ఆరోరా కూడా సీత పాత్రలో నటించడానికి సిద్ధమైంది మరి వీరిద్దరిలో ఎవరు తమ నటనతో మెప్పిస్తారో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు