Kovai Sarala: నాన్న చివరి చూపుకు నోచుకోలేదు..విమర్శించారు కూడా..!

Kovai Sarala… తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ను సంపాదించింది నటి కోవై సరళ… తెలుగు ప్రేక్షకులకు బ్రహ్మానందం, కోవైసరళ కాంబినేషన్లో కామెడీ అంటే ఇప్పటికీ కడుపుబ్బా నవ్వుతూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో పెద్దగా ఈమె తెలుగులో ఎక్కడ కనిపించలేదు.. కానీ ఒకప్పుడు ఏ చిత్రం రిలీజ్ అయిన కూడా కచ్చితంగా అందులో కోవై సరళ కామెడీ సన్నివేషాలు ఉండాల్సిందే అనేంతగా పేరు సంపాదించింది ఈ జంట.. అయితే మళ్లీ ఇప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత బాక్ అనే చిత్రంలో నటించింది.

Kovai Sarala: Dad didn't see the last look..he even criticized..!
Kovai Sarala: Dad didn’t see the last look..he even criticized..!

బాక్ తో రీ ఎంట్రీ..

ఈ సినిమా ఇటీవలే విడుదలై ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న తరుణంలో ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొన్న కోవై సరళ పలు విషయాలను తెలియజేసింది.. బాక్ సినిమాలో తమన్నా, రాశి ఖన్నా నటించారు. ఈ చిత్రం ఈనెల మూడవ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో కూడా కోవై సరళ తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేలా చేస్తోంది. ప్రముఖ కమెడియన్ ఆలీ హోస్టుగా వ్యవహరిస్తున్నటువంటి ఒక షో కి వచ్చిన కోవై సరళ తన జీవితంలో జరిగిన కొన్ని విషయాలను పంచుకోవడం జరిగింది.. వాటి గురించి చూద్దాం.

ఆ ఇబ్బందులు మరువలేనివి..

సినిమా ఇండస్ట్రీలో కొన్నిసార్లు సినిమా షూటింగుల వల్ల చాలా ఇబ్బందులు పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయని కోవై సరళ వెల్లడించింది.. ముఖ్యంగా తన పేరు కోవై సరళ గా ఎలా వచ్చిందంటే.. కోయంబత్తూరు ని షార్ట్ కట్ లో కోవై అని పిలుస్తూ ఉండేవారు.. తన పేరు సరళ కావడంతో కోవై సరళగా పిలిచారని వెల్లడించింది. అలాగే తన తండ్రి గురించి చెబుతూ ఎమోషనల్ గా మాట్లాడడం జరిగింది కోవై సరళ.. గతంలో ఎక్కువగా సినిమా షూటింగ్లలో బిజీగా ఉండే దాన్ని.. ఒక సినిమా షూటింగ్ కోసం ఊటీకి వెళ్లాల్సి వచ్చింది.. ఆ సమయంలోనే తన తండ్రి మరణించారని తెలియజేసింది.

- Advertisement -

తండ్రి చివరి చూపుకు కూడా నోచుకోలేదు.

అయితే ఆ సినిమా షూటింగ్లో నవ్వుతూ బ్యాండ్ కొడుతూ ఉండాలని.. ఆ సమయంలో ఆ సన్నివేశం చేయలేకపోయినా అప్పుడున్న పరిస్థితులలో తనకు చిన్న ప్రొడక్షన్ నుంచి అవకాశం వచ్చింది . ఆర్టిస్టులు కూడా అందరూ వచ్చారు తాను వెళ్ళిపోతే షూటింగ్ క్యాన్సిల్ అవుతుంది.. దీనివల్ల నిర్మాతలకు చాలా నష్టం వస్తుందని భావించి సినిమా షూటింగ్ పాటను కూడా పూర్తి చేసి వెళ్ళాను అంటూ తెలిపింది. అయితే ఆ సమయంలో తన తండ్రిని చివరి చూపుకు కూడా నోచుకోలేకపోయానని.. దీంతో తన కుటుంబ సభ్యులు బంధువులందరూ కూడా చాలానే విమర్శించారంటూ తెలియజేస్తోంది కోవై సరళ..

చెల్లెళ్లు మాత్రమే అర్థం చేసుకున్నారు..

అంతేకాకుండా తనకు నలుగురు సిస్టర్స్ ఒక బ్రదర్ కూడా ఉన్నారని.. వాళ్లు తన పరిస్థితిని అర్థం చేసుకున్నారు.. కానీ బంధువులు, స్నేహితులు వాళ్లు కూడా అలా అనడంతో చాలా బాధపడ్డానని అసలు విషయం ఎవరికీ తెలియదు అంటూ చాలా ఎమోషనల్ గా మాట్లాడింది కోవై సరళ.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు