Star Kids: బ్యాగ్రౌండ్ వున్నా సొంత టాలెంట్ ను నమ్ముకున్న నెపో కిడ్స్..!

Star Kids.. సినిమా ఇండస్ట్రీలోకి ఈ మధ్యకాలంలో చాలామంది ఏదో ఒక బ్యాగ్రౌండ్ కలిగి ఉండి ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే . అయితే ఇప్పటికే చాలామంది ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి భారీ సక్సెస్ ను అందుకున్నారు. మరి కొంతమంది సినీ బ్యాగ్రౌండ్ తో అడుగుపెట్టి సక్సెస్ అయిన వారు కూడా ఉన్నారు. అయితే ముఖ్యంగా సినీ బ్యాగ్రౌండ్ తో అడుగుపెట్టిన వారికి ఒకటి రెండు చిత్రాలు మాత్రమే కలిసి వస్తాయి.. ఆ తర్వాత తమ సొంత టాలెంట్ తో ఇండస్ట్రీలో స్థానం సంపాదించుకోవాల్సి ఉంటుంది.. అలా కొంతమంది సినీ బ్యాగ్రౌండ్తో అడుగుపెట్టి స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంటే.. మరి కొంతమంది అదే బ్యాక్ గ్రౌండ్ తో వచ్చి కనుమరుగైన వారు కూడా ఉన్నారు.. కానీ మరి కొంతమంది సినీ ఇండస్ట్రీలోకి భారీ బ్యాక్ గ్రౌండ్ తో అడుగుపెట్టి ఆ బ్యాక్ గ్రౌండ్ ను ఉపయోగించుకోకుండా.. సొంత కాళ్లపై నిలబడుతూ తమకంటూ ఒక స్టేటస్ సొంతం చేసుకున్న నెపోకిడ్స్ కూడా ఉన్నారు. మరి వారెవరో ఇప్పుడు చూద్దాం.

Star Kids: Nepo Kids who believed in their own talent despite their background..!
Star Kids: Nepo Kids who believed in their own talent despite their background..!

కామాక్షి:

విరూపాక్ష, పొలిమేర వంటి చిత్రాలతో చాలా ఫేమస్ అయ్యింది నటి కామాక్షి.. ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా సరే ఈమె పేరే సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది. ఇక టాలీవుడ్ లో కూడా ఈమెకు చాలామంది స్నేహితులు ఉన్నారు …అలాగే దగ్గర వారు కూడా ఉన్నారు ..కానీ ఏ ఒక్కరి సహాయం ఎప్పుడూ తీసుకోలేదు. తనదైన స్టైల్ లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది ఈ ముద్దుగుమ్మ.

- Advertisement -

సంతోష్ శోభన్:

ఈయన సినీ ఇండస్ట్రీలో పెద్ద డైరెక్టర్ అయినప్పటికీ ఏ రోజు కూడా తండ్రి ఇమేజ్ ను ఉపయోగించుకోలేదు. సొంత ప్రయత్నాలు చేస్తూ సక్సెస్ అవుతున్నాడు.. ప్రస్తుతం ఈయన చేతిలో మంచి బలమైన కథలే ఉన్నాయి.

వీర:

అల్లు అర్జున్ బావమరిది వీర అసలు ఇండస్ట్రీలో ఉన్నాడన్న విషయం చాలామందికి తెలియదు.. ఇటీవల చిన్న చిన్న పాత్రలు వేస్తూ కాస్త అందరి దృష్టిలోకి రావాలని ప్రయత్నిస్తున్నాడు..

దుల్కర్ సల్మాన్:

మాలీవుడ్ మెగాస్టార్ కొడుకు అయినప్పటికీ ఏ రోజు కూడా తండ్రి పేరు చెప్పుకొని అవకాశం అడగలేదు.. ఆయన ఇండస్ట్రీకి వచ్చిన తొలి రోజుల్లో చాలా సాధారణ నటుడి లాగే సినిమా అవకాశాల కోసం ఎదురు చూశాడు.. ఇక ఏ రోజు కూడా తన తండ్రి ఇమేజ్ను ఉపయోగించుకోలేదు.. అలాగే మమ్ముట్టి కూడా తన కొడుకు సినిమా ఫంక్షన్స్ కి వచ్చి సినిమా చూడండని ఎవరిని అడగలేదు.. అయినా సరే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకొని ఇప్పుడు నేషనల్ నటుడిగా పేరు సొంతం చేసుకున్నారు..

ఇలా వీరితో పాటు చాలామంది నెపో కిడ్స్ భారీ బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ ఏ రోజు కూడా కుటుంబ నేపథ్యాన్ని ఉపయోగించుకోకుండా సొంత కాళ్లపై నిలబడి భారీ సక్సెస్ ను సొంతం చేసుకున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు