Pawan Kalyan: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన పవన్ బ్యూటీ..!

Pawan Kalyan..తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్స్ సైతం మొదట మంచి మంచి చిత్రాలలో నటించి.. మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు.. అయితే ఆ తర్వాత సడన్ గా ఇండస్ట్రీకి దూరమైన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి హీరోయిన్ లలో హీరోయిన్ పార్వతి మెల్టన్ కూడా ఒకరు.. అచ్చు తెలుగుదనం ఉట్టిపడేలా ఎన్నో చిత్రాలలో నటించిన ఈ అమ్మడు పలు చిత్రాలలో సెకండ్ హీరోయిన్ గా కూడా నటించింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన జల్సా సినిమాలో కూడా నటించింది.. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

Pawan Kalyan: Pawan's beauty has changed beyond recognition..!
Pawan Kalyan: Pawan’s beauty has changed beyond recognition..!

పవన్ మూవీ తోనే గుర్తింపు..

ఇందులో కూడా సెకండ్ హీరోయిన్ గానే పార్వతి మిల్టన్ నటించింది. జల్సా సినిమా తర్వాత పార్వతి మిల్టన్ క్రేజ్ మాత్రం భారీగానే పెరిగిపోయింది. అల్లరి నరేష్ , మంచు విష్ణు తదితర హీరోల చిత్రాలలో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ.. అయితే ఆశించిన స్థాయిలో మాత్రం సక్సెస్లను అందుకోలేక గుర్తింపు కూడా పొందలేకపోయింది.. ఇక మహేష్ బాబు నటించిన దూకుడు చిత్రంలో కూడా స్పెషల్ సాంగ్ లో కనిపించి ఆ చిత్రానికే హైలైట్ గా నిలిచింది ఈ ముద్దుగుమ్మ.

పార్వతి మెల్టన్ ఫొటోస్..

పార్వతి మెల్టన్ హఠాత్తుగా సినీ ఇండస్ట్రీకి దూరం కావడంతో అభిమానుల సైతం తీవ్ర నిరాశతో ఉన్నారు అయితే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. 2013లో శంసు లాలాని నీ వివాహం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ .. యూఎస్ఏ లో అక్కడే సెటిల్ అయిపోయింది.. తాజాగా సోషల్ మీడియాలో ఈమెకు సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలు చూసి పలువురు అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు.. గతంలో కాస్త బొద్దుగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఈ ఫోటోలలో చాలా ఘోరంగా కనిపిస్తోంది.

- Advertisement -

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన పార్వతి మెల్టన్..

ప్రస్తుతం ఈ ఫోటోలలో పార్వతి మెల్టన్ చాలా సన్నగా.. గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.. ఈ ఫోటోలు చూసిన అభిమానులు సైతం అసలు ఇక్కడ ఉన్నది పార్వతి మెల్టనేనా అనే సందేహాలను కూడా వ్యక్త పరుస్తున్నారు. ప్రస్తుతం పార్వతి మెల్టన్ కి సంబంధించిన ఈ ఫోటోలు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఏది ఏమైనా ఒకప్పుడు తన అంద చందాలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఇలా గుర్తుపట్టలేనంతగా మారిపోయి అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది..

పార్వతి మెల్టన్ కెరియర్..

ఈమె ఒక ఇండో అమెరికన్ సినీనటి .. తల్లిదండ్రులు భారతీయులు.. తెలుగుతోపాటు పలు భారతీయ భాష చిత్రాలలో కూడా నటించిన ఈమె నట శిక్షకుడైన ఎన్ జే భిక్షు దగ్గర నటనలో శిక్షణ తీసుకుంది. 2005లో వెన్నెల అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈమె.. ఆ తర్వాత గేమ్, అల్లరే అల్లరి, హల్లో, ఫ్లాష్, మధుమాసం వంటి చిత్రాలలో నటించింది.. ఇక 2012లో యమహో యమహా అనే చిత్రంలో నటించి తెలుగు ఇండస్ట్రీకి దూరమైంది. ఇక ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయి అందరినీ షాక్ కి గురి చేసింది ఈ ముద్దుగుమ్మ.

 

View this post on Instagram

 

A post shared by Parvati Melton (@parvatim)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు