Sobhitha Dhulipala : సామ్ కు సాలిడ్ కౌంటర్ ఇచ్చిన శోభిత.. వెనకున్నదెవరు?

Sobhitha Dhulipala : టాలీవుడ్ లో మొన్న మొన్నటి వరకు ఇండస్ట్రీ లో బెస్ట్ పెయిర్ అంటే అందరూ నాగ చైతన్య, సమంత ల పేర్లే చెప్పేవారు. ఏడేళ్ల వీరి ప్రేమ జంట సౌత్ ఇండస్ట్రీలోనే బెస్ట్ పెయిర్‌గా నిలుస్తుందని అందరూ భావించారు. కొన్నాళ్ల వరకు సజావుగా వీరి కాపురం సాగింది. ఇటు సమంత కూడా అక్కినేని ఫ్యామిలి కి మచ్చ రాకుండా పరిమితి ఉన్న పాత్రలే సినిమాల్లో చేసింది. అంతవరకు కొన్నాళ్లు బాగానే సాగిన రేలషన్ షిప్ లో అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఈ జంట 2021 లో విడాకులు తీసుకున్నారు. అయితే విడాకుల విషయంలో వీరి అభిమానులు సైతం రెండు వర్గాలుగా విడిపోయి, నాగ చైతన్య ఫాలోవర్లు సమంతది తప్పంటే, లేదు నాగచైతన్యదే తప్పని సమంత ఫాలోవర్లు సోషల్ మీడియా వేదికగా రచ్చ రచ్చ చేశారు. అయితే విడాకులపై నాగచైతన్య ఎప్పుడు మాట్లాడింది లేదు. కాని సమంత మాత్రం తన సినిమాల విడుదల సమయంలో ఇండైరెక్ట్ గా విడాకులపై స్పందిస్తూ వచ్చింది. ఈ మధ్య అయితే ఆ విషయంపై మాట్లాడింది లేదు. అయినా వారిద్దరు తిరిగి కలిస్తే చాలా బాగుంటుందని ఇప్పటికీ అభిమానులు కోరుకుంటున్నారు.

విడాకుల తర్వాత ఎంటరైన శోభిత..

అయితే చై, సామ్ విడాకులు ఎందుకు విడాకులు తీసుకున్నారో అన్న విషయంపై ఇప్పటి వరకూ ఎటువంటి స్పష్టత లేదు. అయితే ఇటు సమంత అటు నాగ చైతన్య కూడా ఇంకా సింగిల్‌ గానే ఉంటున్నారు. ఇక సమంత గత కొంతకాలంగా మయసైటీస్ అనే వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. అనారోగ్యం కారణంగా సమంత పెద్దగా సినిమాలు చేయడం లేదు. అటు నాగ చైతన్య మాత్రం వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. అయితే సమంతతో విడాకుల తీసుకున్న తరువాత తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళ తో నాగ చైతన్య రిలేషన్‌లో ఉన్నాడనే పుకార్లు షికార్లు చేశాయి. తాజాగా నాగ చైతన్య సమ్మర్ వెకేషన్‌కు వెళ్లిన ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ ఫొటోను శోభిత ధూళిపాళ లైక్ చేయడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది.

సామ్ కి కౌంటర్ వేసిన శోభిత..

ఇక తాజాగా సమ్మర్ లొకేషన్ కి వెళ్ళాక ఈ సందర్భం తరువాత , చైతన్య, శోభిత (Sobhitha Dhulipala)లకు సమంత కౌంటర్ ఇండైరెక్ట్ కౌంటర్ ఇవ్వడం, దానికి శోభిత తిరిగి కౌంటర్ ఇవ్వడం వంటివి కూడా జరిగిపోయాయి. చైతూ, శోభిత రిలేషన్ గురించి వార్తలు వచ్చిన వెంటనే, సమంత తన వెడ్డింగ్ డ్రెస్ రీ క్రియేట్ చేయించి వారికి ఓ షో లో పాల్గొనింది. అయితే ఈ డ్రెస్సింగ్ తో చై, శోభిత కు కౌంటరిచ్చిందనే ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా శోభిత సైతం సమంతకు అదిరిపోయే కౌంటరిచ్చిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తాజాగా శోభిత చేసిన పోస్ట్ లో ఇలా పోస్ట్ చేసింది. “ఐయామ్ నాట్ ఎవ్రీ వన్ కప్ ఆఫ్ “చాయ్ “.. అండ్ దట్స్ ఒకే ” అంటూ పోస్ట్ చేసింది. అంటే “నేను ప్రతి ఒక్కరి కప్ ఆఫ్ “చాయ్” కాదు అంటూ సామ్‌కు శోభితా అదిరిపోయే విధంగా కౌంటర్ ఇచ్చిందంటూ నెట్టింట చర్చ నడుస్తుంది. చాయ్ అంటే చై ని ఉద్దేశించే ఇండైరెక్ట్ గా కౌంటర్ వేసిందని అంటున్నారు నెటిజన్లు. అయితే ఈ పోస్ట్ ని నాగార్జున, లేదా నాగ చైతన్య దగ్గరుండి కౌంటర్ వేయించారని కొందరి అభిప్రాయం. మరి ఈ పోస్ట్ కి అసలైన అర్థమేమిటో శోభిత క్లారిటీ ఇస్తే ఇంకా మంచిదని నెటిజన్లు అంటున్నారు.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు