Samantha: నా లైఫ్ నా ఇష్టం.. సమంత మాటలకి ఫ్యాన్స్ ఫైర్..!

Samantha.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న ఈమె ప్రస్తుతం హిందీ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తూ మరింత ఫేమ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం మయోసైటిస్ వ్యాధి చికిత్స నిమిత్తం ఏడాది పాటు విరామం తీసుకున్న సమంత ఇంకా తన తదుపరి చిత్రాలను ప్రకటించలేదు.. ఈ నేపథ్యంలోనే ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా పంచుకుంటూ ఉంటుంది.. ఇకపోతే నాగచైతన్య తో విడాకులైన తర్వాత మరింత పాపులారిటీ అయిన ఈమె ఎక్కడికి వెళ్లినా.. ఏం చేసినా అది ఒక పెద్ద సెన్సేషన్ అయిపోతోంది. ముఖ్యంగా ఆమెను ట్రోల్ చేసేవారే ఇందుకు ప్రధాన కారణమని చెప్పాలి.

Samantha: I like my life.. Fans are on fire for Samantha's words..!
Samantha: I like my life.. Fans are on fire for Samantha’s words..!

గ్రీస్ లో ఘనంగా సమంతా పుట్టినరోజు వేడుకలు..

ఇటీవల సమంత ఏప్రిల్ 28న తన పుట్టినరోజు వేడుకలను ఘనంగా గ్రీస్ దేశంలోని ఏథెన్స్ లో జరుపుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఇందుకు సంబంధించిన ఫోటోలతో పాటూ ఏథెన్స్ లో ఆమె తిరిగిన ప్రదేశాల ఫోటోలను కూడా షేర్ చేయడంతో వీటిని చూసిన కొంతమంది ట్రోలర్స్.. సమంత ఎంతో సంతోషంగా.. జాలీగా అక్కడ వీధుల్లో చక్కర్లు కొడుతూ తిరుగుతోంది.. నా జీవితం నా ఇష్టం అన్నట్టు ఎంజాయ్ చేస్తాను.. మధ్యలో విమర్శలు చేసే వారికి మీకెందుకు? అని ప్రశ్నించినట్లుగా ఉంది అంటూ కామెంట్ చేస్తున్నారు.. అలాగే సమంతకు ఎక్కడ పని లేదా ఏకంగా గ్రీస్ దేశానికి వెళ్లి పుట్టినరోజు వేడుకలను జరుపుకోవాలా? అంటూ ట్రోల్స్ చేస్తున్నారు..

ట్రోలర్స్ పై సమంత ఫ్యాన్స్ ఫైర్..

దీనిపై సమంత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. సమంత పని సమంత చేసుకుంటోంది.ఆమె జీవితం ఆమె ఇష్టం .. మధ్యలో మీకెందుకు.. ఆమెను ట్రోల్ చేయడమే పనిగా పెట్టుకున్నట్లున్నారుగా అంటూ ఫైర్ అవుతున్నారు.. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇకపోతే మయోసైటీస్ వ్యాధి బారిన పడిన ఈమె ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే.. ఇప్పుడిప్పుడే ఆ సమస్య నుంచి బయటపడి తన లైఫ్ ను సంతోషంగా ఎంజాయ్ చేస్తోంది.

- Advertisement -

వెండితెరపై రీ యంట్రీ..

అంతేకాకుండా త్వరలోనే వెండితెరపై మరొకసారి సందడి చేయడానికి సిద్ధం అయ్యింది.. అందులో భాగంగానే ఒక స్టార్ హీరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.. ఇక మరొకవైపు ఈమె హిందీలో వరుణ్ ధావన్ తో కలిసి సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో నటించినందుకు హనీ బన్నీ అనే టైటిల్ ని కూడా పెట్టారు. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కి సిద్ధం అవుతోంది. ప్రస్తుతం మళ్లీ కం బ్యాక్ ఇచ్చి తన స్టార్ స్టేటస్ ను తిరిగి పొందడానికి ప్రయత్నం చేస్తోంది సమంత అందుకే కథలను వింటున్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే ప్రేక్షకులను ఆకట్టుకునే దిశగా అడుగులు వేసే ప్రయత్నం చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.. మరి సమంతకు సెకండ్ ఇన్నింగ్స్ ఏ విధంగా కలిసి వస్తుందో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు