Cricketer Nithish Kumar Reddy : ఈ మ్యాచ్ విన్నర్ ఫేవరేట్ హీరో ఎవరో తెలుసా…?

Cricketer Nithish Kumar Reddy :ప్రస్తుతం నడుస్తున్న ఐపీఎల్ ఫీవర్ లో అందరి మన్ననలు అందుకుంటున్న ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి తెలుగు వాడే. ఈ విశాఖ కుర్రాడు మైదానంలో బ్యాట్ తో అదరగొడుతున్నాడు. గత సీజన్లలో పేసర్ గా రాణించిన నితీష్ ప్రస్తుతం బ్యాట్ తో ఆల్ రౌండర్ ప్రదర్శనతో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్నాడు. గురువారం రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ను గెలిపించడంలో కీలకంగా వ్యవహరించిన నితీష్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో ఆయన తన ఫేవరెట్ హీరో ఎవరు అన్న విషయాన్ని బయట పెట్టారు.

నితీష్ కుమార్ ఫేవరెట్ హీరో ఎవరంటే?

సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే తనకు ఇష్టమని, పోకిరి సినిమా నుంచి తను ఆయన అభిమానిని అని నితీష్ వెల్లడించారు. మహేష్ బాబు చేస్తున్న సినిమాలన్నీ ఇన్స్పైరింగ్ గా ఉంటాయని ఈ సందర్భంగా నితీష్ చెప్పుకొచ్చాడు. అయితే తనకంటే ముందే తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్ అని, ఆ తర్వాత తరమైన తాను మహేష్ బాబు అభిమానులుగా మారామని వివరించాడు నితీష్. ప్రస్తుతం మహేష్ బాబు తన ఫేవరెట్ అంటూ నితీష్ చేసిన కామెంట్స్ కు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.

20 ఓవర్లలో 3 వికెట్లకు 201 రన్స్..

సన్ రైజర్స్ హైదరాబాద్ కు వరుసగా గత రెండు ఓటమిల నిన్న జరిగిన మ్యాచ్ కీలకంగా మారింది. ఈసారి రాజస్థాన్ రాయల్స్ తో తలపడ్డ సన్ రైజర్స్ 200లకు పైగా స్కోర్ చేసి దుమ్మురేపారు. నితీష్ కుమార్ రెడ్డి, ట్రావిస్ హెడ్ హాఫ్ సెంచరీలు, క్లాసెన్ కలిసి రాజస్థాన్ రాయల్స్ పై భారీ స్కోరు సాధించారు. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్ లో టాప్ లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ సొంత గడ్డపై జరిగిన ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 201 రన్స్ చేశారు.

- Advertisement -

నితీష్ హైలెట్…

ఈ మ్యాచ్ లో టాస్ గెలవగానే వేరే ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకొని మైదానంలో అదరగొట్టారు సన్ రైజర్స్. అందరికంటే ఎక్కువగా నితీష్ దూకుడు చూపించాడు. క్రీజ్ లో ఉన్న హెడ్ కు ఈ మ్యాచ్ లో నితీష్ కుమార్ రెడ్డి తోడయ్యాడు. మూడో వికెట్ కు 96 పరుగులు జోడించారు. హెడ్ ఈ మ్యాచ్ లో ఊహించిన స్థాయిలో ఆడకపోయినా నితీష్ కుమార్ రెడ్డి మాత్రం సిక్సర్ల మోత మోగించాడు. 42 బంతుల్లో 8 సిక్స్ లు, రెండు 4 లతో 76 రన్స్ చేసి సన్ రైజర్స్ టీంలో అజేయుడిగా నిలిచాడు. మరోవైపు క్లాసెన్ కూడా తోడవడంతో ఇద్దరూ నాలుగో వికెట్ కు 66 పరుగులు జోడించి సన్ రైజర్స్ ను విజేతలుగా నిలిపారు. ఈ నేపథ్యంలోనే ఈ మ్యాచ్ విన్నర్ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలు వైరల్ అవుతున్నాయి. ఈ యంగ్ క్రికెటర్ మహేష్ బాబు అభిమాని కావడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు