Sreemukhi : మెగా కాంపౌండ్ లో పాగా వేసిన స్టార్ యాంకర్..!

Sreemukhi : టాలీవుడ్ స్టార్ యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బుల్లితెర పై ప్రస్తుతం టాప్ లో ఉన్న స్టార్ యాంకర్ల లో ఈమె ఒకరు. జులాయి, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వంటి సినిమాలతో పరిచయమై, ప్రేమ ఇష్క కాదల్ సినిమాతో హీరోయిన్ గానూ ఎంట్రీ ఇచ్చింది. అయితే హీరోయిన్ గా మాత్రం సరైన బ్రేక్ రాలేదు. ఇక సినిమాల్లో అప్పుడప్పుడూ నటిస్తూ బుల్లితెరపై మాత్రం తెగ బిజీ అవుతుంది. ఇక అప్పుడప్పుడూ సినిమాల్లో సైడ్ రోల్స్ చేస్తూనే, టెలివిజన్ లో స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇదిలా ఉండగా టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ ద్వారా చాలామంది నటులు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆ ఫ్యామిలీ నుండి వచ్చిన ముగ్గురు హీరోలు తెలుగు ఇండస్ట్రీని ఏలుతున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వారి లిస్ట్ తీస్తే పెద్దదిగా ఉంటుంది. కొంతమంది ఆయన సపోర్ట్ తో పైకి వస్తే.. మరికొందరు ఆయన్ని ఇన్స్పైర్ అయ్యి సొంతంగా ఎదిగినవారు కూడా ఉన్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఓ స్టార్ యాంకర్ కూడా మెగా కాంపౌండ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె ఎవరో కాదు బుల్లితెరపై స్టార్ యాంకర్ గా కొనసాగుతున్న శ్రీముఖి. ఈ యాంకర్ ఇప్పుడు వరుసగా మెగాహీరోల సినిమాల్లో నటిస్తూ ఆఫర్లు కొట్టేస్తుంది.

బుల్లితెరపై స్టార్ యాంకర్..

ఇక సినిమాల ద్వారానే ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ అసలైన గుర్తింపు మాత్రం బుల్లితెరపైనే దక్కించుకుంది. పటాస్ షో తో పాపులర్ ఐన శ్రీముఖి ఆ తర్వాత వరుస టివి షోలతో రచ్చ చేసింది. బుల్లితెరపై వరుస కామెడీ షోలలో యాంకర్ గా చేస్తూనే, పలుపలు షోలకు హోస్ట్‌గా వ్యవహరిస్తూ అతి తక్కువ కాలంలోనే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. గ్లామర్ ఉన్న యాంకర్స్ లో శ్రీముఖి ఫస్ట్ ప్లేస్ లో నిలుస్తుందని చెప్పొచ్చు. ఇక తనదైన యాంకరింగ్‌తో చాలామంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ హాట్ బ్యూటీ, బుల్లితెర మీద వచ్చిన క్రేజ్‌తో బిగ్‌బాస్ రియాల్టీ షో లో కూడా పాల్గొనింది. బిగ్ బాస్ లో ఫైనల్ వరకు వెళ్లి ఆల్మోస్ట్ విన్నర్ కాబోయి రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కానీ పాపులారిటీ మాత్రం ఓ రేంజ్ లో సంపాదించుకుంది.

మోగా కాంపౌండ్ లో ఎంట్రీ. ఇక వరుస ఛాన్సులు?

ఇక టాలీవుడ్ లో వరుస టివి షో లలో అలరిస్తున్న శ్రీముఖి ప్రస్తుతం పలు టీవీ షోలకు హోస్ట్‌గా వ్యవహారిస్తుంది. అలాగే పలు సినిమా ఈవెంట్స్ లకు కూడా హోస్ట్ గా వ్యవహరిస్తోంది. ఇక ఓ పక్క టీవీ షోలు చేస్తూనే మరోవైపు సినిమాల్లో కూడా నటిస్తోంది ఈ భామ. మెగా హీరో అల్లు అర్జున్ జులాయి సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి(Sreemukhi), ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించి అభిమానులకు షాకిచ్చింది. చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమాలో శ్రీముఖి అలా కాసేపు మెరిసింది. అయితే తాజా సమాచారం ప్రకారం చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న విశ్వంభర సినిమా లో కూడా శ్రీముఖి ఓ సాంగ్‌లో నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. ఇక మెగా ఫ్యామిలీతో ఉన్న అనుబంధమే ఆమెకు ఈ ఛాన్స్ తెచ్చిందని అంటున్నారు నెటిజన్లు. ఇక వరుసగా రాబోయే, పవన్, చరణ్ సినిమాల్లో కూడా నటించే అవకాశం లేకపోలేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు