Dhanush: పబ్లిక్ లో ఘోర అవమానం.. అసలేం జరిగిందంటే..?

Dhanush.. కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక మార్క్ క్రియేట్ చేసుకున్న హీరో ధనుష్ తన రూపం విషయంలో ఎన్నో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు.. అంతేకాదు ఒకానొక సందర్భంలో ఆటో డ్రైవర్ అంటూ అవమానించిన వారు కూడా ఉన్నారు. అయితే అలాంటి అవమాన పడ్డ చోటే నేడు స్టార్ హీరోగా మారి ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు ధనుష్..

Dhanush: A terrible shame in public.. What actually happened..?
Dhanush: A terrible shame in public.. What actually happened..?

స్టార్ కిడ్ అయినా తప్పని అవమానాలు..

ధనుష్ తండ్రి దర్శకుడు కస్తూరి రాజా.. అలాగే ధనుష్ అన్నయ్య సెల్వరాఘవన్ ను కూడా దర్శకుడే.. అంతేకాదు పలు చిత్రాలలో కూడా నటుడిగా నటించి మెప్పించారు.. మరొకవైపు సూపర్ స్టార్ రజినీకాంత్ వీరికి బంధువు అవుతారు.. అందుకే మారు మాట్లాడకుండా తన పెద్దమ్మాయి ఐశ్వర్య ను ఇచ్చి ధనుష్ తో వివాహం జరిపించారు.. నెపో కిడ్ గా సినీ పరిశ్రమ లోకి అడుగుపెట్టారు ధనుష్ .. ఎంత బ్యాగ్రౌండ్ ఉన్నా.. హీరో అనగానే మినిమం ఫీచర్స్ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు.. మంచి రంగు, శరీర సౌష్టవం, ఎత్తు ఉండాలని అనుకుంటారు.. అయితే ఇవన్నీ ఉన్నవాళ్లే సక్సెస్ అవుతారా అంటే కాదనే చెప్పాలి.. ముందుగా హీరో అనగానే అందరి దృష్టిలో కనిపించే లక్షణాలు ఇవే.. కానీ ఇవన్నీ లేకపోయినా సరే తమ నటనతో అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చి మెప్పించారు..

నిజానికి ప్రేక్షకులు హీరో అంటే ఇలాగే ఉండాలి అని అనుకోవడంలో తప్పులేదు… ఎందుకంటే వారి అభిరుచి అలాంటిది మరి.. అయితే ప్రేక్షకుల అభిరుచులకు పూర్తి భిన్నంగా ఉంటారు ధనుష్.. బక్క పలుచ శరీరం, నల్లని వర్ణం , ఒక మోస్తారు హైట్, కోల ముఖంతో చాలా సాదాసీదాగా ఉంటాడు.. 2002లో ధనుష్ తండ్రి కస్తూరి రాజా దర్శకత్వంలో హీరోగా పరిచయమైనా.. ఆ సినిమా సమయంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు.

- Advertisement -

ఆటో డ్రైవర్ అంటూ అవమానం..

ధనుష్ ని సిల్వర్ స్క్రీన్ పై చూసి అందరూ ఆశ్చర్య పోయారు.. ఇతడు హీరో ఏంటి అంటూ ఎద్దేవా చేశారు.. ఆ తర్వాత ధనుష్ తన అన్నయ్య దర్శకత్వంలో రెండవ సినిమా చేశారు.. ఈ మూవీ సెట్స్ లో ధనుష్ కి తీరని అవమానం జరిగింది. ఆటో డ్రైవర్ అంటూ ఎగతాళి చేశారట.. కొంతమంది ధనుష్ వద్దకు వచ్చి హీరో ఎక్కడా అని అడగడంతో ధనుష్ వేరే వ్యక్తిని చూపించి అతనే హీరో అని అన్నాడట ..కానీ వాళ్లకు తెలిసిపోయిందట.. ఆటో డ్రైవర్ లా ఉన్నావు.. నువ్వు హీరో ఏంట్రా అన్నారట..

విమర్శించిన చోటే నాలుగు జాతీయ అవార్డులు..

దాంతో ఆవేదన చెంది కారులో కూర్చొని మరీ ఏడ్చారట లుక్కు పట్ల ఎదుర్కొన్న విమర్శలు ఆయనను మరింత బలంగా మారేలా చేశాయి.. ఫలితంగా నాలుగు జాతీయ అవార్డులను అందించాయి.. రెండుసార్లు ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు అందుకున్నారు.. నిర్మాతగా మరో రెండు అవార్డులు అందుకున్నారు.. ఇప్పుడు బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ చిత్రాలలో కూడా నటించి మెప్పించారు..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు