Baak : హారర్ మూవీకి విశాల్ సినిమాని మించి వసూళ్లు..

Baak : ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు, నటుడు సుందర్. సి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హారర్ కం, డివోషనల్ ఫాంటసీ జోనర్ లో సినిమాలను తెరకెక్కించి అలరిస్తుంటారు. ఆ రోజుల్లోనే అరుణాచలం లాంటి సెన్సేషనల్ చిత్రాలు దర్శకత్వం వహించిన ఘనత సుందర్ కే దక్కింది. వీటితోపాటు గ్లామర్ కమర్షియల్ మూవీలు కూడా తెరకెక్కించి హిట్లు కొడుతుంటారు. ఇక సుందర్. సి ప్రముఖ నటి ఖుష్బూ భర్త అని తెలిసిందే. ఇక ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో “బాక్” (అరణ్మనై 4) తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమా అరణ్మనై సిరీస్ లో నాలుగో భాగం కాగా, హారర్ కామెడీ జోనర్ లో తెరకెక్కిన ఈ మూవీ మే 3న రిలీజ్ అయి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఇక ఈ సినిమాలో స్టార్ హీరోయిన్లు తమన్నా, రాశీ ఖన్నా లీడ్ రోల్స్ లో నటించగా, తెలుగులో ‘బాక్’ అనే పేరుతో రిలీజ్ చేసారు. అయితే థియేటర్లలో రిలీజ్ అయ్యాక ఈ సినిమా తెలుగులో అంతంత మాత్రంగానే పెర్ఫార్మ్ చేస్తున్నా తమిళ్ లో మాత్రం మంచి కలెక్షన్లు రాబడుతుంది.

టాక్ ఎలా ఉన్నా అదరగొట్టిన ఓపెనింగ్స్..

ఇక తెలుగులో రిలీజ్ అయిన హారర్ మూవీ బాక్ తమిళ్ లో మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న ఫ్రాంచైజ్ మూవీస్ లో ఒకటైన అరణ్మనై సిరీస్ లో భాగం. ఇక తెలుగు లో బాక్ పేరుతో డబ్ అయ్యి రిలీజ్ అయిన ఈ సినిమాకి తెలుగు లో మరీ రొటీన్ అయిన హర్రర్ కామెడీ జానర్ వలన మిక్సడ్ రెస్పాన్స్ సొంతం అయ్యింది. కానీ తమిళ్ లో మాత్రం సినిమా కి మంచి రెస్పాన్స్ సొంతం అవ్వగా కలెక్షన్స్ పరంగా సినిమా అక్కడ మంచి జోరునే చూపిస్తూ ఉండటం విశేషం. తెలుగు లో మొదటి రోజున 40 లక్షల రేంజ్ లో గ్రాస్ అందుకున్న సినిమా రెండో రోజు 55 లక్షల దాకా గ్రాస్ ను తెలుగు లో సొంతం చేసుకోగా 2 రోజుల్లో 95 లక్షల గ్రాస్ ను 45 లక్షల రేంజ్ లో షేర్ ని రాబట్టింది. అయితే తెలుగు లో హిట్ అవ్వాలి అంటే 2.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. అంటే మరో 2 కోట్లయినా రావాలి. ఇక తమిళ్ లో మొదటి రోజు 4 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకున్న ఈ సినిమా రెండో రోజు 6 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకుని సాలిడ్ గా కుమ్మేసింది. టోటల్ గా 2 రోజుల్లో అక్కడ 10 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకోగా టోటల్ గా ఇండియా లో 12 కోట్ల గ్రాస్ ను సొంతం చేసుకుంది. వరల్డ్ వైడ్ గా 13.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుందని అంచనా.

విశాల్ రత్నం కంటే బెటర్ వసూళ్లు..

అయితే రీసెంట్ గా తమిళ్, తెలుగులో రిలీజ్ అయిన రత్నం మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ ఓపెనింగ్స్ అందుకుంది. ఆ సినిమా వీకెండ్ మొత్తంలో 10 కోట్లలోపే వసూళ్లు అందుకోవడం గమనార్హం. అయితే బాక్ (అరణ్మణై) సినిమా మాత్రం విశాల్ రత్నం సినిమాకి మించి రెండు రోజుల్లోనే 13 కోట్లకి పైగా వసూళ్లు అందుకోవడం విశేషం. ఇక వీకెండ్ సండే అడ్వాంటేజ్ తో 20 కోట్ల మార్క్ దాటడం ఖాయంగా కనిపిస్తుంది. మొత్తం మీద రెండో రోజు సినిమా మంచి జోరుని బాక్స్ ఆఫీస్ దగ్గర చూపించగా, మూడో రోజు కూడా తమిళ్ లో కుమ్మేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. వర్కింగ్ డేస్ లో కూడా హోల్డ్ చేస్తే తమిళ్ లో సినిమా ఈ సినిమా హిట్ అయ్యే అవకాశం ఉందని చెప్పోచ్చు. అయితే తెలుగులో మాత్రం ఈ సినిమా ప్లాప్ అయిపోతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు