Rathnam : విశాల్ పరువు తీసిన రీ రిలీజ్ సినిమా! ఇంత దారుణమా?

Rathnam : కోలీవుడ్ స్టార్ విశాల్ మార్క్ ఆంటోనీ సినిమా తర్వాత నటించిన సినిమా “రత్నం”. కోలీవుడ్ మాస్ డైరెక్టర్ హరి దర్శకత్వంలో తెరకెక్కిన రత్నం మూవీ ఎప్రిల్ 26న తెలుగు, తమిళ భాషల్లో కలిపి గ్రాండ్ గా రిలీజ్ కావడం జరిగింది. ఇక వీరి కాంబోలో ఇంతకు ముందు భరణి, పూజ లాంటి హిట్ సినిమాలు రాగా, ఇప్పుడు రత్నం సినిమా వీరి కాంబోలో హ్యాట్రిక్ సినిమాగా రిలీజ్ అయింది. అయితే విశాల్ రత్నం మూవీ అనూహ్యంగా ఆడియన్స్ నుండి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. రొటీన్ కమర్షియల్ డ్రామా అని, సినిమాలో ఏమాత్రం సరైన కథా, కథనాలు లేవని హరి పాత సినిమాల మాదిరే స్పీడ్ గా సాగే కథనంతో చిన్న కథని పెద్దగా లాక్కొచ్చాడని టాక్ వచ్చింది. ఏది ఏమైనా 100 కోట్ల బ్లాక్ బస్టర్ కొట్టిన విశాల్ నుండి వచ్చిన రత్నం సినిమాకి భారీ ఓపెనింగ్స్ వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా ఈ సినిమా దారుణమైన ఓపెనింగ్స్ ని అందుకుంది.

విశాల్ పరువు తీసిన విజయ్ గిల్లి..

అయితే విశాల్ నటించిన రత్నం అన్ని చోట్ల కూడా రొటీన్ సినిమా అన్న టాక్ తెచ్చుకోగా కనీసం ఓపెనింగ్స్ వస్తాయని మేకర్స్ అనుకున్నా యాడ్ జరగలేదు. పైగా రీసెంట్ గా రీ రిలీజ్ అయిన 20 ఏళ్ల క్రితం నాటి మూవీ గిల్లి, కొత్త సినిమా రత్నం సినిమా రిలీజ్ ను డామినేట్ చేయడం జరిగింది. మహా అయితే ఏదైనా చిన్న సినిమా రిలీజ్ అయినప్పుడు ఇలా జరిగిందంటే ఒకే, కానీ విశాల్ లాంటి స్టార్ హీరో సినిమాకు కూడా, అది కూడా లాస్ట్ ఇయర్ 100 కోట్ల బ్లాక్ బస్టర్ కొట్టిన హీరో నుండి వచ్చిన కొత్త సినిమాను 20 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన సినిమా డామినేట్ చేయడం నిజంగానే ఆశ్చర్యమని చెప్పాలి. ఇక విశాల్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ రత్నం (Rathnam) తమిళ్, తెలుగులో రీసెంట్ గా రిలీజ్ కాగా, ఈ సినిమా కి ఆడియన్స్ లో ముందు నుండి పెద్దగా బజ్ ఏర్పడలేదు. దాంతో బుక్ మై షోలో బుకింగ్స్ చాలా నెమ్మదిగా సాగగా, తొలిరోజు టాక్ ఎలా ఉన్నా మినిమమ్ ఓపెనింగ్స్ ను అయినా సొంతం చేసుకుంటుంది అనుకున్నా, ఈ సినిమాకి బుక్ మై షోలో కేవలం 33 వేల టికెట్ సేల్స్ మాత్రమే మొదటి రోజు జరిగాయి.

రత్నం సినిమాని మించిన గిల్లి బుకింగ్స్..

అదే టైంలో దళపతి విజయ్ నటించిన గిల్లి మూవీ రీ రిలీజ్ అయిన 7వ రోజున కూడా ఓవరాల్ గా 37 వేల టికెట్ సేల్స్ జరిగాయి. ఇది కొత్త సినిమా కాదు 20 ఏళ్ల క్రితం వచ్చిన మూవీ రీ రిలీజ్ అయిన 7వ రోజున కొత్త సినిమా కన్నా ఎక్కువ టికెట్ సేల్స్ జరగడం అన్నది నిజంగానే ఊహకందని ఊచకోత. చూస్తుంటే ఈ వీకెండ్ లో రత్నం సినిమాను ఓల్డ్ మూవీ గిల్లి కంప్లీట్ గా డామినేట్ చేసేలా కనిపిస్తుంది. తమిళ్ లో అసలే సినిమాలు లేక థియేటర్స్ వెలవెలబోతున్న సమయంలో కొత్త సినిమాను మించి జనాలు ఓల్డ్ మూవీని చూడటానికి ఎగబడుతూ ఉండటం విశేషం అని చెప్పాలి. ఇక రత్నం ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో కేవలం 65 లక్షల ఓపెనింగ్స్ గ్రాస్ అందుకోగా, తమిళ నాడు సహా వరల్డ్ వైడ్ గా రత్నం మూవీ 3.6 కోట్ల గ్రాస్ అందుకుంది. ఇది విజయ్ గిల్లి మూవీ రీ రిలీజ్ ఓపెనింగ్స్ కన్నా తక్కువ. ఇక రత్నం మూవీ లాంగ్ రన్ లో ఎంతవరకు వసూళ్ళని అందుకోగలుగుతుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు