Rathnam : అక్కడా ఇక్కడా ఎదురేలేదు.. విశాల్ కి ఇంతకన్నా మంచి ఛాన్స్ దొరకదు..

Rathnam : కోలీవుడ్ స్టార్ విశాల్ విశాల్ లాస్ట్ ఇయర్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను “మార్క్ ఆంటోనీ” మూవీ తో సొంతం చేసుకుని ఫుల్ జోరు మీదున్నాడు. ఈ సినిమాతో తమిళ్ లో భారీ విజయాన్ని సొంతం చేసుకోగా, టోటల్ రన్ లో తమిళ్, తెలుగు కలిపి టోటల్ గా ఏకంగా 102 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది.ఈ హిట్ వచ్చిన ఊపులో ఈ ఇయర్ విశాల్ ఫుల్ జోరు మీదుండి వరుస సినిమాలను లైన్లో పెట్టాడు. అందులో హరి దర్శకత్వంలో వస్తున్న “రత్నం” మూవీ కూడా ఒకటి. వీరి కాంబోలో ఇంతకు ముందు భరణి, పూజ లాంటి హిట్ సినిమాలు రాగా, ఇప్పుడు రత్నం సినిమా వీరి కాంబోలో హ్యాట్రిక్ సినిమాగా రాబోతుంది. ఇక విశాల్ రత్నం మూవీ ఆడియన్స్ ముందుకు ఈ నెల 26న గ్రాండ్ గా తమిళ్, తెలుగు లో రిలీజ్ కానుండగా, తెలుగు లో సినిమా కొన్ని చోట్ల ఓన్ గా, రిలీజ్ చేస్తూ, మరికొన్ని చోట్ల అడ్వాన్స్ బేస్ మీద రిలీజ్ అవుతూ ఉంది. అయితే తమిళ్, తెలుగు లో పెద్దగా పోటి ఏమి లేకుండానే ఇప్పుడు రత్నం రిలీజ్ కాబోతుంది.

విశాల్ కి ఫుల్ అడ్వాంటేజ్…

ఇక ఈ వారం రిలీజ్ అవుతున్న రత్నం (Rathnam) మూవీ కి సోలో రిలీజ్ వచ్చేసిందని చెప్పాలి. మాస్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా 26న రిలీజ్ అవుతుంది. అయితే దీనికి తమిళ్ లో పోటీగా అరన్మలై4 రిలీజ్ కావాల్సి ఉండగా వారం రోజులు వాయిదా పడింది ఆ సినిమా. ఇక తెలుగులో ప్రతినిధి2 ఒక్కటే దీనికి పోటీగా రిలీజ్ అవ్వాల్సి ఉండగా, ఆ సినిమా కూడా వాయిదా పడింది. దీంతో అటు తమిళ్ లో, ఇటు తెలుగులో కూడా విశాల్ కి సోలో రిలీజ్ దక్కిందని చెప్పాలి. ఇక రత్నం మాస్ మూవీ కావడంతో బి,సి సెంటర్ల ప్రేక్షకులు రత్నం కి బాగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక రత్నం మూవీకి తెలుగు బిజినెస్ కూడా చాలా తక్కువగా 4 కోట్ల లోపే జరగడం వల్ల ఈ సినిమా కి మంచి టాక్ గనుక వస్తే వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉంది. పైగా సమ్మర్ హాలిడేస్ సినిమాకి మరో అడ్వాంటేజ్ కాగా, అన్నిటికీ మించి తెలుగులో నెలరోజులుగా ఒక్క హిట్ సినిమా లేకపోవడం వల్ల తెలుగు ఆడియన్స్ ఆకలిమీదున్నారు. ఈ టైం లో రత్నం మూవీకి మంచి టాక్ అనుక వస్తే వారాంతంలోనే బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉంది.

రెండో బ్లాక్ బస్టర్ వచ్చేనా?

ఇక విశాల్ రత్నం మూవీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన మాస్ ఎంటర్టైనర్ కాగా, డైరెక్టర్ హరి విశాల్ కాంబోలో ఆల్రెడీ రెండు హిట్లు వచినందువల్ల, మూడో హిట్ కూడా కంఫర్మ్ అని ఫాన్స్ అనుకుంటున్నారు. ఇక ట్రైలర్ చూడ్డానికి యావరేజ్ గా అనిపించినా, హరి సినిమాలు రిలీజ్ అయ్యాకే సూపర్ హిట్ టాక్ ని మౌత్ టాక్ ద్వారా సొంతం చేసుకుంటాయి కనుక రత్నం సినిమాకి కూడా అదే సీన్ రిపీట్ అవుతుందని భావిస్తున్నారు. ఇక అసలు పోటినే లేకుండా ఈ సినిమా రిలీజ్ కానుంది కాబట్టి, భారీ వసూళ్లు కంఫర్మ్ అని అనుకుంటున్నారు. ఇటు తెలుగు లో కంప్లీట్ గా సైలెంట్ అయిపోయిన బాక్స్ ఆఫీస్ దగ్గర, రత్నం లాంటి మాస్ మూవీ మంచి టాక్ ను సొంతం చేసుకుంటే మాస్ సెంటర్స్ లో మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంటుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు