Ram Charan: శంకర్ కోసం కమల్ మూవీ కి చెర్రీ సాయం..నిజమైతే పూనకాలే..!

Ram Charan.. ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ ఎస్. శంకర్ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తాజాగా నటిస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్. అయితే ఎప్పుడో పూర్తి కావాల్సిన ఈ సినిమా ఇంకా వాయిదా పడుతూ రావడానికి కారణం మరొకవైపు కోలీవుడ్లో కమల్ హాసన్ తో ఇండియన్ 2 సినిమా శంకర్ చేయడమే.. ఈ సినిమా కోసమే ఇక్కడ గేమ్ ఛేంజర్ సినిమా వాయిదా పడుతూ వస్తోంది.. కానీ ఎట్టకేలకు తాజాగా సినిమాని పూర్తి చేసి విడుదల చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.. ఇదిలా ఉండగా తాజాగా మరొకవైపు తమిళంలో ఇండియన్ 2 సినిమా కూడా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.. ఇటీవలే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా పూర్తి చేశారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం శంకర్ అడిగారని కమలహాసన్ మూవీ కోసం రాంచరణ్ అలాంటి పని చేయబోతున్నారట మరి అదేదో ఇప్పుడు చూద్దాం..

Ram Charan: Cherry help for Kamal's movie for Shankar..!
Ram Charan: Cherry help for Kamal’s movie for Shankar..!

శంకర్ అడిగారని కమల్ మూవీ కోసం రాంచరణ్ సాయం..

తాజాగా ఇండియన్ 2 సినిమా నుంచి అప్డేట్ వినిపిస్తోంది ..ఈ సినిమాకి రామ్ చరణ్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారట ..ఇండియన్ 2 సినిమాలో ఒక వాయిస్ ఓవర్ ఉంది అని, అయితే దానిని రామ్ చరణ్ తో చెప్పిస్తే సినిమాకి మరింత హైప్ వస్తుందని శంకర్ భావించి.. చరణ్ ని అడిగితే ఆయన కూడా ఒప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..ప్రస్తుతం రామ్ చరణ్ ఎలాగో పాన్ ఇండియా హీరో గా గుర్తింపు తెచ్చుకున్నాడు. మరోవైపు ఇండియన్ 2 సినిమా కూడా అన్ని భాషల్లో విడుదల కాబోతోంది.. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకి రాంచరణ్ వాయిస్ తో వాయిస్ ఓవర్ ఇప్పిస్తే సినిమాకు మరింత హైప్ వస్తుందని త్వరలోనే చరణ్ ఆ వాయిస్ ఓవర్ కి డబ్బింగ్ చెప్తాడని వార్తలు వినిపిస్తున్నాయి.

కమల్ మూవీలో చరణ్ వాయిస్ ఓవర్..

ఒకవేళ ఇదే నిజమైతే ఇండియన్ 2 సినిమాకి రామ్ చరణ్ వాయిస్ ఓవర్ ఇస్తే ఖచ్చితంగా కలెక్షన్లు ఇంకొంచెం పెరుగుతాయి అంటూ అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు.. మొత్తానికైతే ఈ విషయం తెలిసి రామ్ చరణ్ అభిమానులే కాదు కమల్ హాసన్ అభిమానులు కూడా ఫిదా అవుతున్నారు.. మరి నిజంగానే కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమాలో రామ్ చరణ్ వాయిస్ ఓవర్ ఉంటుందా లేదా అనే విషయం తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే.. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు వినిపిస్తున్నాయి..

- Advertisement -

కమల్ హాసన్ మూవీస్..

కమల్ హాసన్ విషయానికి వస్తే.. తమిళంలో విక్రమ్ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈయన ఇప్పుడు ఇండియన్ 2 సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. గతంలో భారతీయుడు సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న కమల్ హాసన్ ఇప్పుడు ఆ మూవీ సీక్వెల్ తో ఇండియన్ 2 పేరుతో రాబోతున్నారు. మరి ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటుండగా రాంచరణ్ వాయిస్ ఓవర్ ఇస్తున్నట్టు వార్తలు రావడం సినిమాకి మరింత హైప్ పెరుగుతోంది. మరి ఇందులో ఏది నిజం ఉందో తెలియాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు