Friday OTT Releases: ఈవారం ఓటిటిలోకి 17 సినిమాలు… తెలుగు మూవీ లవర్స్ కు ఈ ఒక్కటే బెస్ట్ ఆప్షన్

Friday OTT Releases : కొత్త వారం మొదలైంది ఓటీటీ లోకి కొత్త సినిమాలు రాబోతున్నాయి. మే 5నే ఈనెల మొదటి వారం పూర్తయిపోయింది. ఇప్పుడు రెండో వారం స్టార్ట్ కావడంతో ఓటిటిలోకి రాబోయే కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ ల గురించి ఓటీపీలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఓటీటీ లవర్స్. అయితే ఈ వీకెండ్ తర్వాత అంటే మే 13న తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఓవైపు ఎన్నికలు, మరోవైపు ఐపీఎల్ ఫైనల్స్ ఫుల్ స్వింగ్ లో జరగబోతున్నాయి.

ఈ నేపథ్యంలో థియేటర్లలోకి రానున్న చెప్పుకోదగ్గ సినిమాల్లో కృష్ణమ్మ మాత్రమే ఉంది. ఈ మూవీ ఈ శుక్రవారం థియేటర్లలోకి రానుండగా, మరోవైపు ఓటిటిలో ఈ వారం 17 సినిమాలు, వెబ్ సిరీస్ లు రాబోతుండడం విశేషం. ఇక వీటిలో చాలా వరకు ఇంగ్లీష్ హిందీ సినిమాలు, వెబ్ సిరీస్ లే ఉన్నాయి. ఆవేశం అనే డబ్బింగ్ మూవీ, 8 ఏఎమ్ మెట్రో అనే సినిమాలు మాత్రమే ఈ వారం తెలుగు ప్రేక్షకులకు బెస్ట్ ఆప్షన్ కాబోతున్నాయి. మరి ఈ ఫ్రైడే ఓటిటిలోకి అడుగు పెట్టబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లపై ఓ లుక్కేద్దాం.

అమెజాన్ ప్రైమ్ వీడియో

మే 9న ఆవేశం మూవీ తెలుగు డబ్బింగ్ వర్షన్ స్ట్రీమింగ్ కాబోతోంది. మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్ హీరోగా నటించాడు. అయితే ఈ మూవీ ఓటిటి రిలీజ్ డేట్ పై ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. అదే తేదీన మాక్స్ టన్ హాల్ అనే జర్మన్ వెబ్ సిరీస్, ది గోట్ అనే ఇంగ్లీష్ సిరీస్ ఈ వారం స్ట్రీమింగ్ కాబోతున్నాయి.

- Advertisement -

నెట్ ఫ్లిక్స్

ఈ వారం నెట్ ఫ్లిక్స్ లో ద రోస్ట్ ఆఫ్ టామ్ బ్రాడీ అనే ఇంగ్లీష్ మూవీ మే 6న స్ట్రీమింగ్ కాబోతోంది. మే 9న బోడ్కిన్ అనే ఇంగ్లీష్ సిరీస్, థాంక్యూ నెక్స్ట్ అనే టర్కిష్ సిరీస్, మదర్ ఆఫ్ ద బ్రైడ్ అనే ఇంగ్లీష్ మూవీ అందుబాటులోకి రాబోతున్నాయి. మే 10న లివింగ్ విత్ లిపార్డ్స్ అనే ఇంగ్లీష్ మూవీ స్ట్రీమింగ్ కానుంది.

జీ5

జీ5 ఓటిటి లో మే 10న పాష్ బాలిష్ అనే బెంగాలీ సిరీస్, 8 ఏఎమ్ మెట్రో అనే హిందీ మూవీ రాబోతున్నాయి.

హాట్ స్టార్

మే 8న ఆల్ ఆఫ్ అజ్ స్ట్రేంజర్స్ అనే ఇంగ్లీష్ మూవీ రిలీజ్ కాబోతోంది.

మే 10న లయన్స్ గేట్ ప్లేలో ద మార్ట్ కింగ్స్ డాటర్ అనే ఇంగ్లీష్ మూవీ, సన్ నెక్స్ట్ లో ఫ్యూచర్ పొండాటి అనే తమిళ సిరీస్, జియో సినిమాలో మర్డర్ ఇన్ మహీం అనే హిందీ సిరీస్, సోనీ లివ్ లో అన్ దేకి సీజన్ 3 అనే హిందీ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఇక ఆపిల్ ప్లస్ టీవీలో మే 8న డార్క్ మేటర్, హాలీవుడ్ కెన్ క్వీన్ అనే ఇంగ్లీష్ సిరీస్ లు రాబోతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు