RC16: పోస్టర్ అదుర్స్.. కానీ చరణ్ మూవీ పై దెబ్బెయ్యదుగా..!

RC16.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ ను దక్కించుకొని.. ఇప్పుడు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్. శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే సినిమా చేస్తున్నారు.. ఈ సినిమా పూర్తయిన వెంటనే బుచ్చిబాబు దర్శకత్వంలో ఆర్సి 16 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా చేయబోతున్నామంటూ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ప్రకటన మేరకు ఇదివరకే ఆర్సీ 16 పూజా కార్యక్రమాలు కూడా లాంచనంగా జరిగి.. మొదటి షెడ్యూల్ కూడా మొదలైంది.. ఈ సినిమాలో రామ్ చరణ్ హీరోగా ఆయనకు జోడిగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు.

RC16: The poster is superb.. But Charan's movie is not damaged..!
RC16: The poster is superb.. But Charan’s movie is not damaged..!

RC 16 పై బుచ్చిబాబు ఏమన్నారంటే..

బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఒక స్పోర్ట్స్ డ్రామా కావడంతో మరింత ఆసక్తి నెలకొంది.. ఈ మూవీ కోసం రాంచరణ్ ఒక కొత్త లుక్ లో కనిపించబోతున్నారని సమాచారం.. ఇందులో కబడ్డీ ప్లేయర్ గా రామ్ చరణ్ కనిపించబోతున్నట్లు ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ విషయం గురించి బుచ్చిబాబు ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నించగా.. తాను బదిలీస్తూ ఫుల్ రా అండ్ రస్టిక్ గా ఉంటుంది.. మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంటుంది.. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ అంటే నేను చెప్పలేను.. నేను ఎప్పుడూ ఒక జోనర్ ఆడియన్స్ ని మాత్రమే టార్గెట్ చేసుకొని కథ రాయను.. నా సినిమా అన్ని సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ చూసేలా చిత్రీకరిస్తుంటాను అంటూ బదులిచ్చారు.. అయితే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ అంటే అవును అని లేదా కాదు అని చెప్పలేదు.. కానీ కబడ్డీ ప్లేయర్ అని అంతటా వినిపిస్తున్న విషయం తెలిసిందే..

RC 16 పై చెర్రీ కామెంట్స్..

మరొకవైపు గతంలో రామ్ చరణ్ నేషనల్ సమ్మిట్ లో మాట్లాడుతూ.. ఒక పల్లెటూరి మట్టి కథతో కంప్లీట్ ఎమోషన్స్ తో ఆర్సి16 ఉంటుందని చెప్పారు. ఇక వీరిద్దరి మాటలను బట్టి చూస్తే ఈ సినిమా పూర్తిగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కాకుండా ఫ్యామిలీ , పల్లెటూరు మట్టి కథలతో ఉండనుందని తెలుస్తోంది.. అయితే ఈ వార్తలు రావడానికి కారణం తమిళంలో విడుదలైన బైసన్ మూవీ పోస్టర్ అని చెప్పవచ్చు..

- Advertisement -

పోటీగా బైసన్ పోస్టర్..

తమిళంలో ఒక పెద్ద డైరెక్టర్ కబడ్డీ నేపథ్యంలో వస్తున్నాడు.. ఈ చిత్రానికి బైసన్ అనే టైటిల్ పెట్టి ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు ..ఈ ఫస్ట్ లుక్ చాలా సూపర్ గా ఉంది. పైగా ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం లో భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం.. దాంతో ఇద్దరు ఒకే నేపథ్యంలో కావడంతో చరణ్ బుచ్చిబాబు సినిమాకి దెబ్బ కొడుతుందేమో అని సోషల్ మీడియాలో నెటిజన్స్ సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరొకవైపు స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కాదంటున్న చరణ్ మాటలకు అదే అర్థం వినిపిస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే బైసన్ పోస్టర్ ప్రేక్షకులు ఇప్పటికే సగం ఆకట్టుకుంది.. మరి ఈ రెండు సినిమాలు ఏ రేంజ్ లో పోటీ పడతాయో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు