Daksha Nagarkar Hospitalised : సర్జరీ నుంచి కోలుకోవడం కష్టంగా ఉందంటూ హీరోయిన్ పోస్ట్… అసలేం జరిగిందంటే?

Daksha Nagarkar Hospitalized : హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న హీరోయిన్ దక్షా నగార్కర్ తాజాగా చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. కోలుకోవడం కష్టం ఉందంటూ ఆమె చేసిన ఈ పోస్ట్ ఫ్యాన్స్ ను ఆందోళనకు గురి చేస్తోంది.

కోలుకోవడం కష్టంగా ఉందంటూ పోస్ట్

ముంబై బ్యూటీ దక్షా నగార్కర్ తాజాగా తన ఆరోగ్యం బాగలేదనే విషయాన్ని తెలియజేస్తూ ఇన్స్టా లో ఓ పోస్ట్ చేసింది. ఆసుపత్రిలో చేరిన విషయాన్ని చెప్తూ అపరిచితులతో నిండిన ఆపరేషన్ గదిలోకి ప్రవేశించడం చాలా కష్టమైన పని అని ఆమె అన్నారు. వైద్యులు తనకు రెండుసార్లు అనస్థీషియా ఇంజెక్షన్ చేశారని ఆమె తెలిపారు.

ఆ పోస్ట్ లో దక్షా “గత కొన్ని రోజులుగా స్ట్రెచర్‌పై నాకు తెలియని వ్యక్తులతో సర్జరీ గదిలో ఉండటం నుండి నాకు రెండు సార్లు వెన్నముకకు అనస్థీషియా ఇవ్వడం చాలా కష్టంగా ఉంది. కోలుకోవడం మరింత కష్టమైంది. నేను నా భావోద్వేగాలన్నింటినీ కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించాను. నన్ను ప్రేమించే వ్యక్తులు సపోర్ట్ గా నిలిచి దీన్ని సులభం చేసారు. వారు ఎలా ప్రేమించాలో, సరైన మార్గంలో ప్రేమించబడాలో నాకు చూపించారు. ప్రేమ, సంరక్షణకు నిజంగా కనిపించని గాయాలను నయం చేసే శక్తి ఉంది. ఇలా ఎవ్వరికీ అవ్వాలని నేను కోరుకోను. దయచేసి మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. మరీ ముఖ్యంగా మిమ్మల్ని బేషరతుగా ప్రేమించే సరైన వ్యక్తులు మీ చుట్టూ ఉండేలా చూసుకోండి. సంతోషకరమైన విషయలను మాత్రమే పోస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఎవరూ విచారంగా ఉండకూడదనుకుంటున్నాను” అంటూ బాధకరమైన ఎమోజీని జత చేస్తూ రాసుకొచ్చింది దక్షా.

- Advertisement -

దక్షాకి ఏమైంది?

దక్షా చేసిన పోస్ట్ ను చూశాక అసలు ఆమెకు ఏమైంది? రెండుసార్లు వెన్నెముకకు అనస్తీషియా ఇచ్చారు అంటోంది. అంటే ఏదైనా సర్జరీ జరిగిందా? అనే ఆందోళనలో పడిపోయారు దక్షా ఫ్యాన్స్. అయితే ఆమె ఈ పోస్ట్ లో తనను ఎందుకు ఆసుపత్రిలో చేర్చారు? ఎందుకు ఆపరేషన్ చేయించుకుంది? అనే విషయాలను వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో దక్షా త్వరగా కొలుకోవాలని కోరుకుంటున్నారు అభిమానులు, నెటిజన్లు.

దక్షా నటించిన సినిమాలు

తెలుగు చిత్ర పరిశ్రమలోకి దక్షా అడుగు పెట్టి దాదాపు దశాబ్దం గడిచిపోయింది. కానీ ఇప్పటి వరకు ఆమె ఖాతాలో ఒక్క హిట్ సినిమా కూడా పడలేదు. ఇప్పటిదాకా దక్షా నగార్కర్ కేవలం ఆరు చిత్రాలే చేసింది. ఏకే రావు పీకే రావు, హుషారు, జాంబీ రెడ్డి, రావణాసుర, బంగార్రాజు వంటి తెలుగు చిత్రాలలో నటించి, తన నటనకు కొంత ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా బంగార్రాజు సినిమా ఈవెంట్లో ఆమె స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. దక్షా, నాగ చైతన్య ఒకరినొకరు చూసి చిలిపిగా నవ్వుకోవడంతో ఆ వీడియో తెగ వైరల్ అయ్యింది. ఆ ఒక్క ఎక్స్ ప్రెషన్ తో ఆమెను ఏకంగా అక్కినేని నాగ చైతన్యకు భార్యగా, అక్కినేని ఇంటికి రెండవ కోడలిగా చేసేశాయి రూమర్స్. ప్రస్తుతం పెద్దగా అవకాశాలు లేక సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు షేర్  చేస్తూ అభిమానులను అట్రాక్ట్ చేస్తోంది దక్షా.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు