Geetha Bhagath.. ప్రముఖ యాంకర్ గీతా భగత్ ప్రస్తుతం పలు సినిమా ఈవెంట్ లతో బిజీబిజీగా గడిపేస్తున్నారు.. టీజర్ లాంచ్ , మూవీ ప్రెస్ మీట్స్, ట్రైలర్ లాంచ్ ఇలా మీడియం రేంజ్ చిత్రాల ఈవెంట్స్ లో కనిపిస్తూ తెగ సందడి చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా వేదికపై తనదైన శైలిలో జోకులు వేస్తూ షోని నడిపించడం ఆమె శైలి.. ఎలాంటి ఈవెంట్స్ లో అయినా.. అతిధులతో పాటు యాంకర్స్ చేసే కామెంట్స్ కూడా వైరల్ అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు ట్రోలింగ్ కి కూడా గురవుతుంటారు.. ముఖ్యంగా సుమ, శ్రీముఖి లాంటి వాళ్ళు గతంలో ఏదో చెప్పబోయి.. ఇంకేదో చెప్పి వివాదాల్లో ఇరుక్కున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు గీతా భగత్ కూడా ట్రోల్లింగ్ కి గురవుతున్నారు.
రాజ్ తరుణ్ తో చీర కట్టించుకోవాలని ఉంది అంటున్న గీత భగత్..
తాజాగా రాజ్ తరుణ్ నటించిన భలే ఉన్నాడే చిత్ర టీజర్ లాంచ్ జరిగింది. ఈ స్టేజ్ పై కంటెంట్ ను తాను కూడా ఇంప్రొవైజ్ చేయాలని అనుకుంది గీతా భగత్ .. సందర్భం అలా వచ్చిందో లేదో ఇలా బోల్డ్ గా మాట్లాడి అందరిని ఆశ్చర్యపరిచింది.. భలే ఉన్నాడే చిత్ర కథ టీజర్ ని బట్టి అర్థమవుతుంది.. సిటీలో జరిగే ఈవెంట్స్ కి ఆడవాళ్ళకి చీర కట్టుకోవడంలో సహాయం చేసే వ్యక్తిగా రాజ్ తరుణ్ ఇక్కడ నటిస్తున్నాడు. టీజర్ లో చాలా ఫన్నీ గా.. రొమాంటిక్ గా చూపించారు మేకర్స్ .. ఇక్కడ రచయిత డార్లింగ్ స్వామి ఈవెంట్ లో ప్రసంగిస్తూ యాంకర్ గీతా ను ఉద్దేశించి కామెంట్లు చేశారు.. ఇంత మాట్లాడుతున్నారు మీరు ఎందుకు చీర కట్టుకొని రాలేదు? అని అడిగితే.. దానికి యాంకర్ గీతా బదులిస్తూ నాకు హీరో రాజ్ తరుణ్ చేత చీర కట్టించుకోవాలని ఉంది అంటూ తన కోరికను బయటపెట్టింది.. దీంతో అక్కడున్న వారంతా నవ్వేసారు కానీ ఈ విషయం ఆన్లైన్లో గీత భగత్ పై ట్రోలింగ్ జరిగేలా చేస్తోంది..
నెటిజన్స్ కామెంట్స్ వైరల్..
అయితే ఈ విషయం వైరల్ కావడంతో.. వైరల్ కావడానికి నోటికి ఎంత మాట వస్తే అంత మాట్లాడేస్తావా అంటూ ట్రోల్ చేస్తున్నారు.. హీరో చేత చీర కట్టించుకోవడం ఏంటి అంటూ ట్రోలింగ్ మొదలు పెట్టేశారు. గతంలో గీత భగత్ పై కొన్ని కాంట్రవర్సీలు కూడా వినిపించిన విషయం అందరికీ తెలిసిందే.. ముఖ్యంగా ఆమె వ్యక్తిగత జీవిత విషయానికి సంబంధించి కూడా తీవ్ర వివాదాలు ఎదురయ్యాయి. పైగా పోలీస్ కేసులు కూడా నమోదయ్యాయి. ఇలాంటి సమయంలో ఇప్పుడు మళ్లీ ఈమె గురించి కొన్ని వార్తలు ట్రోలింగ్ అవుతూ ఉండడం గమనాభం ఏది ఏమైనా గీతా భగత్ ఇప్పటికైనా తన నోటి దురుసును ఆపుకుంటుందా లేక ఎప్పటిలాగే మళ్ళీ వార్తల్లో నిలుస్తున్న అన్నది చూడాలి. ఇక మరోవైపు రాజ్ తరుణ్ కూడా ఇప్పుడిప్పుడే సక్సెస్ వైపు అడుగులు వేస్తున్నారు. మరి ఈ సినిమాతో రామ్ చరణ్ ఎలాంటివి గాని అందుకుంటారో చూడాలి.