Geethanjali Malli Vachindi OTT Release Date : ఓటిటిలోకి గీతాంజలి మళ్లీ వచ్చింది… ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?

Geethanjali Malli Vachindi OTT Release Date : అంజలి హీరోయిన్ గా నటించిన గీతాంజలి మళ్ళీ వచ్చింది అనే హారర్ మూవీ ఓటీటీ ఎంట్రీకి సిద్ధంగా ఉంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ పై అఫిషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. మరి హారర్ మూవీ లవర్స్ ఈ మూవీని ఎప్పుడు, ఎక్కడ చూడవచ్చు అంటే..

ఆహాలో గీతాంజలి మళ్ళీ వచ్చింది..

అంజలి సరికొత్త చిత్రం గీతాంజలి మళ్లీ వచ్చింది హారర్-కామెడీ చిత్రం ఏప్రిల్ 11న థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీకి బిగ్ స్క్రీన్ పై పెద్దగా రెస్పాన్స్ రాలేదు. కానీ ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా ? అని వెయిట్ చేస్తున్నారు. మొత్తానికి నెల రోజులు కూడా కాకముందే గీతాంజలి మళ్ళీ వచ్చింది మూవీని ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నాము అంటూ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా అఫిషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేసింది. ఈ మూవీ మే 8 నుంచి ఆహా లో స్ట్రీమింగ్ కానుంది.

 బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్

అంజలి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం 2014లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన గీతాంజలి మూవీకి సీక్వెల్. ఫస్ట్ పార్ట్ హిట్ కావడమే కాదు అంజలి నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. పైగా ఆమెకు ఉత్తమ నటిగా నంది అవార్డును కూడా సంపాదించి పెట్టింది ఈ మూవీ. దానికి సీక్వెల్ గా వచ్చిందే గీతాంజలి మళ్ళీ వచ్చింది మూవీ. అంజలి కెరీర్లో ఇది 50వ సినిమా కావడం విశేషం.

- Advertisement -

నూతన దర్శకుడు శివ తుర్లపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అంజలి, రాహుల్ మాధవ్, శ్రీనివాస రెడ్డి, సత్యం రాజేష్, సునీల్, షకలక శంకర్, అలీ పలువురు కీలక పాత్రలు పోషించారు. ఫస్ట్ పార్ట్ గీతాంజలికి రాజ్ కిరణ్ దర్శకత్వం వహించగా, అందులో కూడా అంజలి, శ్రీనివాస రెడ్డి, సత్యం రాజేష్ ప్రధాన పాత్రలు పోషించారు.

ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఒరిజినల్ మూవీ కన్నడలో కథే చిత్రకథే నిర్దేశనా పుట్టన్న అనే టైటిల్‌తో రీమేక్ అయ్యింది. అందులో కోమల్ కుమార్, ప్రియమణి ప్రధాన పాత్రలలో నటించారు.

గీతాంజలి మళ్ళీ వచ్చింది స్టోరీ ఇదే..

పార్ట్ 1లో కన్పించిన గీతాంజలి దెయ్యం ఇంకా అలాగే ఉండగా, అంజలితో పాటు మిగతా వాళ్ళకు సినిమా చేసే ఛాన్స్ వస్తుంది. కానీ భూత్ బంగ్లాలో సినిమా చేయాలి అనేది కండిషన్. సంగీత్ మహల్ లో శాస్త్రి ఫ్యామిలీ దెయ్యాలుగా తిరుగుతూ ఉంటారు. మరి ఈ దయ్యాల కథ ఏంటి ? సినిమా కోసం వెళ్ళిన వీళ్ళకు ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి? వాటి నుంచి ఎలా తప్పించుకున్నారు అనేది స్టోరీ.

అంజలి నెక్స్ట్ సినిమాలు

యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో నటిస్తోంది. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నేహా శెట్టి, నాజర్ కూడా కీలక పాత్రలు పోషించారు. రామ్ చరణ్, కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ ఛేంజర్ చిత్రంలో కూడా అంజలి కీలక పాత్ర పోషిస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు