Devara Update : ఎన్టీఆర్ లేకుండానే షూటింగ్ స్టార్ట్ చేసిన టీం… ఎక్కడ జరుగుతుందంటే?

Devara Update : జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ముంబైలో ఉండగా, ఆయన లేకుండానే దేవర షూటింగ్ ను స్టార్ట్ చేశారు దేవర టీం. మరి ప్రస్తుతం దేవర షూటింగ్ ఎక్కడ జరుగుతోంది అనే వివరాల్లోకి వెళ్తే..

దేవర లేటెస్ట్ అప్డేట్

ది మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బ్యాక్ బ్యాక్ టు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నరు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ట్రిపుల్ ఆర్ మూవీలో తన నటనా నైపుణ్యంతో ఇప్పటికే యావత్ దేశాన్ని ఆశ్చర్యపరిచిన తారక్ ఇప్పుడు మరో భారీ-స్థాయి మూవీతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నారు. ప్రస్తుతం హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 షూటింగ్ కోసం ముంబైలో ఉన్నాడు తారక్. ఈ నేపథ్యంలోనే ఆయన లేకుండానే ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర షూటింగ్ ను స్టార్ట్ చేశారు టీం.

దేవర: పార్ట్ 1లో కీలక పాత్ర పోషిస్తున్న సైఫ్ అలీ ఖాన్ యాక్షన్-థ్రిల్లర్ షూటింగ్ షెడ్యూల్‌ను ప్రారంభించినట్లు అప్డేట్ వచ్చింది. తాజా అప్‌డేట్ ప్రకారం టీమ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌లో షూటింగ్ చేస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం అందుబాటులో లేకపోవడంతో సైఫ్ తన హై-ఆక్టేన్ సన్నివేశాల షూటింగ్ లో పాల్గొంటున్నాడని తెలుస్తోంది.

- Advertisement -

డెడ్ లైన్ ను చేరుకోవడానికి టీం కష్టాలు

అక్టోబరు 10 అనే డెడ్‌లైన్ పూర్తి చేయడానికి దేవర టీమ్ సుధీర్ఘ షెడ్యూల్ ప్లాన్ చేసిందని వార్తలు వస్తున్నాయి. అయితే త్వరలో దేవర: పార్ట్ 1 షూటింగ్ షెడ్యూల్‌లో జూనియర్ ఎన్టీఆర్ జాయిన్ అవుతారని టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ చాలా వరకు పూర్తయ్యింది.

దేవర పోస్ట్ పోన్

ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. వాస్తవానికి ఈ చిత్రాన్ని ఏప్రిల్ 5న విడుదల చేయాలని భావించారు. అయితే VFX వర్క్ ఆలస్యం కావడంతో విడుదల వాయిదా పడింది. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో దసరా సందర్భంగా ఈ ఏడాది అక్టోబర్ 10న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర మూవీలో జూనియర్ ఎన్టీఆర్, సైఫ్ అలీఖాన్‌లతో పాటు జాన్వీ కపూర్, షైన్ టామ్ చాకో, ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఆర్ రత్నవేలు సినిమాటోగ్రాఫర్ కాగా, ఎ శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

వార్ 2 షూటింగ్ లో తారక్..

ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ప్రస్తుతం ముంబైలో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్‌, తారక్ లపై ‘వార్ 2’ చిత్రీకరణ జరుగుతోంది. ఈ స్పై థ్రిల్లర్ చిత్రంతో యంగ్ టైగర్ తన బాలీవుడ్‌ అరంగేట్రం చేయనున్నాడు. ఇందులో హృతిక్ హీరోగా, తారక్ ప్రధాన విలన్‌గా నటిస్తున్నాడు. ఈ మూవీ షెడ్యూల్ పూర్తి కాగానే దేవర సెట్స్ లో అడుగు పెడతాడు తారక్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు