Baak OTT Release Date : తమన్నా, రాశిల హార్రర్ మూవీ బాక్ ఓటిటిలోకి వచ్చేదెప్పుడంటే?

Baak OTT Release Date : తమన్నా, రాశి కన్నా హీరోయిన్లుగా నటించిన తమిళ హారర్ కామెడీ మూవీ ఓటిటి స్ట్రీమింగ్ డేట్ గురించి ప్రస్తుతం చర్చ మొదలైంది. మరి ఈ మూవీ డిజిటల్ ప్లాట్ ఫామ్ ఏంటి? ఎప్పుడు ఓటీటీలోకి రాబోతోంది? అనే వివరాల్లోకి వెళితే…

థియేటర్లలో మిక్స్డ్ టాక్

మిల్కీ బ్యూటీ తమన్నా, మరో సౌత్ హీరోయిన్ రాశి కన్నా కలిసి నటించిన హారర్ థ్రిల్లర్ అరణ్మనై 4. ఇది బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీ అరణ్మనైలో నాలుగవ భాగం కాగా, గత చిత్రాలకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ సుందర్ సి ఈ పార్ట్ ను కూడా రూపొందించడం విశేషం. ఇదే మూవీని తెలుగులో బాక్ అనే టైటిల్ తో రిలీజ్ చేశారు. తమిళంతో పాటు తెలుగులో కూడా అరణ్మనై సిరీస్ కు మంచి ప్రేక్షకాదరణ దక్కింది. ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ అండ్ యాక్టర్ సుందర్ సి వరుసగా సీక్వెల్స్ తో బాక్స్ ఆఫీస్ పై దండయాత్ర చేస్తున్నాడు. తాజాగా బాక్ అనే దయ్యం కథతో థియేటర్లలోకి వచ్చారు. అయితే మే 3న థియేటర్లలోకి వచ్చిన బాక్ మూవీకి ఊహించిన రెస్పాన్స్ రాలేదు. మిక్స్డ్ టాక్ తో పెద్దగా ప్రేక్షకదరణకు నోచుకోలేదు అరణ్మనై 4.

నెలలోపే ఓటిటిలోకి

ఇక ఈ మూవీ ఇంకా థియేటర్లలో ఉండగానే ఓటిటి స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడు అనే విషయంపై చర్చ మొదలైంది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5 ఫాన్సీ రేటుకు కొనుగోలు చేసి మూవీ స్ట్రీమింగ్ రైట్స్ ను సొంతం చేసుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అరణ్మనై 4 మూవీని జీ5లో తమిళంతో పాటు తెలుగులో కూడా ఒకేసారి స్క్రీనింగ్ చేయనున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ మూవీ థియేటర్లలోకి వచ్చి ఇంకా నెలరోజులు కూడా కాకముందే ఓటిటిలో సందడి చేయబోతుందని సమాచారం. అరణ్మనై 4 మూవీని మే 31న లేదా జూన్ 10 లోపు ఓటిటిలో రిలీజ్ చేయబోతున్నట్టుగా టాక్ నడుస్తోంది. అయితే దీనిపై ఇంకా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రాలేదు.

- Advertisement -

బాక్ స్టోరీ ఇదే..

బాక్ సినిమాలో తమన్నా, రాశి ఖన్నాలతో పాటు వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, కోవై సరళ తదితరులు నటించారు. ఈ మూవీని కుష్బూ సుందర్, ఏసిఎస్ అరుణ్ కుమార్ అవ్ని సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై సంయుక్తంగా నిర్మించారు. తెలుగు రాష్ట్రాల్లో బాక్ మూవీని ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పి రిలీజ్ చేసింది.

ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే… బాక్ అనే దయ్యం గురించి అస్సాంలో కథలు కథలుగా చెప్పుకుంటారు. అదే దయ్యం సౌత్ కు వస్తే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తో ఈ మూవీని తెరకెక్కించినట్టు డైరెక్టర్ సుందర్ స్వయంగా ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే ఈ మూవీలో కామెడీ, దెయ్యం రెండు రొటీన్ గా ఉన్నాయనే టాక్ వచ్చింది. కాగా ప్రస్తుతం బాక్ మూవీ ఓటిటి స్ట్రీమింగ్ గురించి హారర్ మూవీ లవర్స్ ఈగర్ వెయిట్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు