The Great Indian Murder Mystery on OTT : మైండ్ బ్లైండ్ మర్డర్ సిరీస్… ఊహించని క్లైమాక్స్ ట్విస్ట్

The Great Indian Murder Mystery on OTT : మీకు థ్రిల్లర్, పోలీస్ స్టోరీస్ అంటే ఇష్టమా? అయితే మిస్టరీ మర్డర్ సిరీస్ ది ఇండియన్ మర్డర్ మిస్టరీ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది.

థ్రిల్లింగ్ అంశాలు మస్త్

మర్డర్ మిస్టరీ ఆధారంగా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ 2022లో ఓటీటీలోకి వచ్చి సంచలనం సృష్టించింది. ప్రముఖ నటీనటులు ఈ వెబ్ సిరీస్‌లో నటించారు. ఈ సిరీస్ క్లైమాక్స్ ఊహించని విధంగా ఉండడంతో థ్రిల్ ఫీల్ అవుతారు. ‘ది గ్రేట్ ఇండియన్ మర్డర్’ సిరీస్ లో రిచా చద్దా, ప్రతీక్ గాంధీ, అశుతోష్ రాణా తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. సస్పెన్స్, థ్రిల్లర్ మూవీస్ అభిమానులు ఈ సిరీస్‌ని ఒక్కసారి కూర్చుంటే పూర్తయ్యేదాకా వదిలి పెట్టరు.

ఈ వెబ్ సిరీస్ లో అనేక ఆసక్తికర రాజకీయ సంఘటనలను కళ్ళకు కట్టినట్టుగా చూపించారు మేకర్స్. సామాజిక చిక్కులతో కూడిన క్లిష్టమైన కథను సస్పెన్స్ తో కలగలిపి ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కించారు. రాజకీయ నాయకుల గూఢచర్య ఆరోపణలు, రాజకీయ లాభ నష్టాల కోసం సీబీఐని దుర్వినియోగం చేయడం, అధికార దాహంతో ఉన్న రాజకీయ నాయకుల కుమారులు, రాజకీయ నాయకుల కుట్రలు, నకిలీ మత పెద్దలు, నక్సలిజం మొదలైనవి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు.

- Advertisement -

ది గ్రేట్ ఇండియన్ మర్డర్ మిస్టరీ కథ ఇదే..

‘ది గ్రేట్ ఇండియన్ మర్డర్ మిస్టరీ’ సిరీస్ కథ పారిశ్రామికవేత్త విక్కీ రాయ్ (జతిన్ గోస్వామి) హత్య చుట్టూ తిరుగుతుంది. విక్కీ రాయ్ చెడ్డ, క్రూరమైన నేరస్థుడు. అతని చెడు ప్రవర్తన కారణంగా చాలా మంది అతన్ని చంపాలనుకుంటారు. విక్కీ రాయ్‌ను ఇద్దరు బాలికల దారుణ మరణం కేసులో పోలీసులు అరెస్టు చేశారు. అయితే అతను తన పలుకుబడిని ఉపయోగించి త్వరగానే బయటకు వస్తాడు. దీని తర్వాత విక్కీ, అతని ఫ్రెండ్స్ తమ ఫామ్‌ హౌస్‌లో గ్రాండ్ గా పార్టీని జరుపుకుంటారు. రాజకీయ ప్రముఖుల నుండి సినిమా తారల వరకు అందరూ ఇందులో పాల్గొంటారు.

పార్టీ హుషారుగా సాగుతున్న సమయంలో ఎవరో విక్కీ రాయ్‌ని గన్ తో కాల్చి చంపేస్తారు. ఆ రాత్రి పార్టీలో విక్కీని చంపాలని చాలా మంది ప్లాన్ చేస్తారు. అయితే ఎవరి బుల్లెట్ అతని ప్రాణాలు తీసిందనే ప్రశ్న తలెత్తుతుంది.

ఏ ఓటీటీలో ఉందంటే?

ది గ్రేట్ ఇండియన్ మర్డర్ సిరీస్‌ను అజయ్ దేవగన్ నిర్మించగా, తిగ్మాన్షు ధులియా దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ ను దిగ్గజ ఓటీటీ ప్లాట్‌ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో చూడవచ్చు. సిరీస్ 9 ఎపిసోడ్‌లతో అందుబాటులో ఉంది.

విక్కీ రాయ్ హత్య కేసులో సిబిఐ దర్యాప్తు ఉత్కంఠతో నిండిన అంశాలతో కొనసాగుతుంది. ఈ సిరీస్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రతి పాత్రను బాగా రాసుకున్నారు. కథనంతో ప్రేక్షకులను నిమగ్నమయ్యేలా చేశారు. నటీనటుల నటన కూడా బాగుంటుంది.

పార్ట్ 2 కోసం వెయిటింగ్

‘ది గ్రేట్ ఇండియన్ మర్డర్’ వెబ్ సిరీస్ కు IMDbలో 10కి 6.5 రేటింగ్‌ ఉంది. ఫస్ట్ సీజన్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవగా ఇప్పుడు రెండవ సీజన్ విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు