Saripodhaa Sanivaaram : ఒక్క అప్డేట్ లేదు.. వాయిదా వేసేలా ఉన్నారే?

Saripodhaa Sanivaaram : న్యాచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. లాస్ట్ ఇయర్ దసరా, హాయ్ నాన్న సినిమాలతో ఇటు మాస్, అటు క్లాస్ సినిమాలతో సూపర్ సక్సెస్ సాధించి తర్వాతి సినిమాలపై అంచనాలను పెంచేసాడు. ఇక ఇండస్ట్రీ లో కూడా నాని సినిమా అంటే మినిమం ఇంపాక్ట్ ఉంటుంది. ప్రస్తుతం నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం “సరిపోదా శనివారం”. అంటే సుందరానికి వంటి క్లాసిక్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఆ సినిమా అంతగా ఆడకపోయినా ఆడియన్స్ కి చాలా ఫేవరెట్. ఇక సరిపోదా శనివారం మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. భారీ బడ్జెట్ తో డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. అలాగే ఎస్.జె.సూర్య ప్రతినాయకుడిగా కనిపించబోతున్నారు. ఈ సినిమా నుండి వచ్చిన టీజర్స్ ఓ రేంజ్ లో ఆడియన్స్ ని ఇంప్రెస్స్ చేసి అంచనాలను పెంచేసాయి. ఒక డిఫరెంట్ ఎలిమెంట్ తీసుకొని వివేక్ ఆత్రేయ ఈ చిత్రాన్ని సిద్ధం చేస్తున్నారు. వారం రోజులపాటు ఉండే కోపాన్ని ఒక్కరోజు మాత్రమే చూపించే వ్యక్తిగా నాని ఈ చిత్రంలో కనిపించబోతున్నాడు. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తో జోరు మీద ఉన్న నాని సరిపోదా శనివారం మూవీతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ని ఖాతాలో వేసుకోవాలని అనుకుంటున్నారు.

నెల రోజులైంది సైలెంట్ అయ్యారు.?

అయితే గత నెలరోజులుగా సరిపోదా శనివారం మూవీ యూనిట్ నుండి పెద్దగా అప్డేట్స్ ఎం రావట్లేదు. నాని కి సంబంధించిన ఫస్ట్ లుక్ తో పాటు టీజర్స్ తో ఓ రేంజ్ ఇంపాక్ట్ ని అయితే సినిమాపై క్రియేట్ చేసారు. ఇక ఈ సినిమాను ఆగష్టు 29న పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ కానున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేసారు. కానీ ఇప్పుడు ఈ సినిమా నుండి అప్డేట్ వచ్చి చాలా రోజులయింది. తాజాగా వస్తున్న వార్తల ప్రకారం సినిమా వాయిదా వేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారా అన్న సందేహాలు కలుగుతున్నాయి. అప్డేట్స్ ఇవ్వకపోయినంత మాత్రాన వాయిదా వేయాల్సిన పనిలేదు, కానీ రిలీజ్ టైం ని బట్టి ఆ సమయంలో విడుదల అవుతున్న ఇతర సినిమాలను బట్టి ఈ అనుమానాలకు తావిస్తుంది. అయితే సరిపోదా శనివారం చిత్రానికి రెండు వారాల ముందు ఆగష్టు 15న ఐకాన్ స్టార్ అల్లు అల్లు అర్జున్ పుష్ప ది రూల్ మూవీ రిలీజ్ కాబోతోంది. పాన్ ఇండియా లెవల్ లో భారీ అంచనాల మధ్య ఈ చిత్రం థియేటర్స్ లోకి రాబోతోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పుష్ప ది రూల్ సినిమాపై హైప్ క్రియేట్ అయ్యి ఉంది. ఆ హైప్ కి తగ్గట్లుగానే సినిమాని స్ట్రాంగ్ గా జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చిత్ర యూనిట్ చేస్తోంది.

పుష్ప రిజల్ట్ ని బట్టే నాని సినిమా వచ్చేనా?

అయితే పుష్ప 2 కి ఉన్న హైప్ ని బట్టి ఆ మూవీ రిలీజ్ తర్వాత టాక్ బాగుంటే లాంగ్ రన్ లో ఇంపాక్ట్ చూపించే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా తెలుగులో అయితే థియేటర్ల సమస్య ఉంటుంది. ఒక వేళ అదే జరిగితే సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram ) సినిమా రిలీజ్ ను ఆగష్టు 29 నుంచి కాస్తా వెనక్కి జరుపుతారని టాక్ వినిపిస్తోంది. అంటే సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో రిలీజ్ డేట్ ఖాయం చేయొచ్చని భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం సినిమాలు సూపర్ హిట్ అయిన కూడా గట్టిగా మూడు వారాలు మాత్రమే థియేటర్స్ లో కలెక్షన్స్ రాబడుతున్నాయి. పుష్ప రిలీజ్ అయిన రెండు వారాల తర్వాత సరిపోదా శనివారం రిలీజ్ కానుంది. ఈ రెండు వారాలలో మెజారిటీ ఆడియన్స్ పుష్ప ది రూల్ చూసేస్తారు. అందుకే సరిపోదా శనివారం వాయిదా వేయకపోవచ్చని మరో వర్గం నుంచి వినిపిస్తోన్న మాట. కానీ పాన్ ఇండియా మూవీ కాబట్టి లాంగ్ రన్ అవకాశం ఉంటుంది. అయితే సరిపోదా శనివారం సినిమాని ఇతర భాషల్లో రిలీజ్ చేస్తే మాత్రం థియేటర్ల సమస్య వస్తుంది. కాబట్టి మరో వారం వాయిదా వేసి మంచి బజ్ తో రిలీజ్ చేస్తే బాగుంటుందని ట్రేడ్ విశ్లేషకుల మాట.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు