Family Man Season3 : సెన్సేషనల్ సిరీస్ మూడో భాగం మొదలెట్టేసారు..

Family Man Season3 : ఇండియా లో లాక్ డౌన్ తర్వాత ఓటిటి లు ఊపందుకున్న తర్వాత వెబ్ సిరీస్ లో కూడా ఓ రేంజ్ లో సక్సెస్ అయ్యాయన్న సంగతి తెలిసిందే. అయితే అందులో పాన్ ఇండియా వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసిన వెబ్ సిరీస్ లలో “ఫ్యామిలీ మ్యాన్” కూడా ఒకటి. మనోజ్ బాజ్‌పేయ్ ప్రధాన పాత్రలో ఇండియన్ క్రైమ్ బ్రాంచ్ స్పై గూఢచారిగా నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఓటిటి లో భారీ విజయం సాధించింది. ఇప్పటికే రెండు సిరీస్ లు వచ్చి ఒకదాన్ని మించి మరొకటి విజయం సాధించగా, మూడో పార్ట్ కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి క్రేజీ అప్డేట్ వచ్చింది. మేకర్స్ అయిన తెలుగు కుర్రాళ్లు రాజ్ అండ్ డీకే ఈ విషయంపై తీపి క‌బురు చెప్పారు. ప్ర‌తిభావంతులైన ద‌ర్శ‌క‌ద్వ‌యం `ఫ్యామిలీమ్యాన్` సీజ‌న్ 3 స‌న్నాహ‌కాల్లో ఉన్నారు. ప్రైమ్ వీడియో ఒరిజినల్ సిరీస్ మూడవ సీజన్ చిత్రీకరణ కోసం అన్ని ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షిస్తోంది. ఈ ఫ్రాంఛైజీలో సీజ‌న్ 1, సీజ‌న్ 2 ప్రపంచవ్యాప్తంగా భారీగా అభిమానులను సంపాదించాయి. రాజ్ & DK వారి బ్యానర్ D2R ఫిలిమ్స్ లో ఇప్పుడు సీజ‌న్ 3ని కూడా తెర‌కెక్కిస్తున్నారు. యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్ లో సీజన్ 2 క్లైమాక్స్ ప్రశంసలను పొందింది. ఇక సీజన్ 3 కొన‌సాగింపు అంత‌కంటే థ్రిల్లింగ్ గా ఉంటుందని సమాచారం. ఇక సీజ‌న్ 3 ప్రస్తుతం మేకింగ్ ద‌శ‌లో ఉంది.

కథ ఎక్కడ ముగిసిందో అక్కడే మొదలు?

ఇక ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లో మనోజ్ బాజ్‌పేయ్ కొత్త‌ సీజన్‌లో రహస్య గూఢచారి శ్రీకాంత్ తివారీగా తన పాత్రను తిరిగి పోషిస్తారు. ఇక కథ విషయానికి వస్తే.. ఈ సిరీస్ లో శ్రీకాంత్ గా నటించిన మనోజ్ ఒక మధ్యతరగతి అధికారి.. ప్రపంచ స్థాయి ఇండియన్ స్పై గూఢచారిగా తిరిగి తెర‌పైకి వ‌స్తున్నాడు. జాతీయ భద్రత సంక్లిష్టతలను ప‌రిశోధిస్తూ.. ఫ్యామిలీ కి తెలియకుండా అత‌డు తన కుటుంబ జీవితాన్ని కొనసాగించడం, భార్యతో తన సంబంధాన్ని సరిదిద్దుకోవడం వంటి సవాళ్లను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. మునుపెన్నడూ లేనంత బ‌ల‌మైన‌ ప్రత్యర్థులతో ఈసారి శ్రీకాంత్ ఢీకొంటాడని సమాచారం. తన దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి ..త‌న‌కు పొంచి ఉన్న బెదిరింపులను ప్ర‌మాదాల‌ను ఎదుర్కోవడానికి శ్రీ‌కాంత్ తివారీ కాలంతో పాటు, ఫ్యామిలీ పరిస్థితులతో తట్టుకుని పోటీప‌డాల్సి ఉంటుంది. ఇక మొదటి రెండు భాగాల్లో శ్రీకాంత్ భార్య మనస్పర్థల కారణంగా విడిపోయే పరిస్థితి ఉండగా, ఈ మూడో భాగంలో కలిసే ఛాన్స్ ఉంది. ఇక తన కూతురు కూడా రాంగ్ రూట్లో వెళ్తుండగా, తనని రక్షించి దక్కించుకుంటాడు శ్రీకాంత్. బహుశా మూడో సీజన్లో ఫ్యామిలీ కి శ్రీకాంత్ అసలు వృత్తి గురించి తెలిసే ఛాన్స్ ఉంది.

ఉత్కంఠ భరితంగా మూడో సీజన్..

ఇక దర్శక ద్వయం రాజ్ & DK దూరదృష్టితో కూడిన క‌థా ర‌చ‌న‌లో, మరియు దర్శకత్వంలో తిరుగు లేని నిష్ణాతులు. రాజ్ & DK తో చేరిన సుమ‌న్ కుమార్ సృజనాత్మక ఇన్‌పుట్‌తో `ది ఫ్యామిలీ మ్యాన్` సీజన్ 3 (Family Man Season3) ప్రేక్షకులను మ‌రింత‌గా అలరిస్తుందని నెటిజన్లు అంటున్నారు. ఇక ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లో ప్రియమణి, షరీబ్ హష్మీ, ఆశ్లేషా ఠాకూర్, వేదాంత్ సిన్హా త‌దిత‌రులు ఇందులో తిరిగి న‌టిస్తారు. వీరితో పాటు కొత్త‌ తారలు చిత్ర‌ బృందంలో చేరనున్నారు. రెండో సీజన్లో సమంత స్ట్రాంగ్ నెగిటివ్ రోల్ చేయగా, క్లైమాక్స్ లో పాత్ర ఎండ్ అయిపోతుంది. అలాగే సీజన్ 3 లో కూడా ప్రముఖ స్టార్ నటుల్ని నటింపచేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక ఈ గ్రిప్పింగ్ థ్రిల్ల‌ర్‌లో తదుపరి అధ్యాయం కోసం స‌ర్వ‌త్రా ఆస‌క్తి పెరుగుతోంది. క‌థ‌లో ఊహించని మలుపులు, ట్విస్టులు ప్రేక్ష‌కుల‌ను ఓ రేంజ్ లో అలరించబోతున్నాయని సమాచారం.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు