Devara : దేవర సెట్స్ లో ప్రమాదం.. హాస్పిటల్ లో ఏకంగా 20 మంది ఆర్టిస్టులు?

Devara : టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ చిత్రాల్లో “దేవర” కూడా ఒకటి. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ సినిమా లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్నాడన్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ అంచనాలని మించి అభిమానులని ఇంప్రెస్స్ చేసాయి. ఇక ఈ సినిమా నుండి రాబోయే అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ మరింత వెయిట్ చేస్తున్నారు. ఇక ‘దేవర’ సినిమా సమ్మర్ లోనే రిలీజ్ కావాల్సి ఉండగా షూటింగ్ డిలే వల్ల సమ్మర్ నుండి దసరా కి వాయిదా పడింది. ఇక సినిమాను అక్టోబర్ 10న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్ గా దేవర ని లేట్ గా తీసుకు వచ్చినా కాలర్ ఎగరేసే సినిమాను తీసుకువస్తున్నామని ఎన్టీఆర్ ఓ వేదికపై చెప్పిన విషయం తెలిసిందే. ఇక సినిమాపై ట్రేడ్ వర్గాల్లో కూడా అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అసలే దర్శకుడు కొరటాల శివ ఈ సినిమా కథ కోసమే చాలా టైం తీసుకున్నాడు. ఇక ఆచార్యతో డిజాస్టర్ అందుకున్న కొరటాల శివ ఈ సినిమాతో ఎలాగైనా హిట్టు కొట్టక తప్పని పరిస్థితి. ఇదిలా ఉండగా తాజాగా దేవర షూటింగ్ లో ప్రమాదం చోటు చేసుకుంది.

సెట్స్ లో ప్రమాదం.. ఆర్టిస్టులు హాస్పిటల్ లో!

ఇక దేవర ప్రస్తుత షెడ్యూల్ ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి జిల్లా మోదకొండమ్మ పాదల వద్ద షూటింగ్ జరుగుతుంది. ఎన్టీఆర్ లేకపోయినా అక్కడ కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం ముందు మేకర్స్ టీమ్ వెళ్లారు. ఇక అక్కడ షూటింగ్ చేస్తుండగా.. ఒక్కసారిగా చిత్ర యూనిట్ సభ్యులపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది జూనియర్ ఆర్టిస్టులకి గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు వారందరినీ చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ తమ అభిమాన నటుడికి ఏమైందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ ఉన్నారా లేదా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. ఇక గాయపడిన ఆర్టిస్టులకి పెద్దగా ప్రమాదం అయితే లేదని, త్వరలోనే కోలుకుంటారని సమాచారం.

ఒకేసారి రెండు సినిమాల్లో ఎన్టీఆర్..

ఇక దేవర సినిమాతో జాన్వీ కపూర్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయమవుతోంది. దేవర (Devara) సినిమాను దసరాకు విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఇక ఈ ఏడాదే ఎన్టీఆర్ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. వార్-2 సినిమాలో హృతిక్ రోషన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తాడని సమాచారం. ఇందులో ఒక రోల్ లో నెగిటివ్ రోల్‌ లో ఉంటుందని సమాచారం. ఇక వార్-2తో పాటు మరో బాలీవుడ్ సినిమాకు కూడా ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ తీయబోయే కొత్త సినిమాలో ఎన్టీఆర్ ఎంపికైయ్యారని గుస గుసలు వినిపిస్తున్నాయి. ఇక ఎన్టీఆర్ దేవర, వార్ 2 సినిమాలు ఏకకాలంలో పూర్తి చేస్తుండడం విశేషం.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు